konarao pet
-
ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య
సాక్షి, వేములవాడ: స్వరాష్ట్రం ఏర్పడినప్పటికీ తనకు ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి లో చోటు చేసుకుంది .గ్రామానికి చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ..ఉన్నత విద్యాభ్యాసం చేసిన తనకి ఉద్యోగం రాలేదని కొంత కాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి సోమవారం సాయంత్రం బయటకు వెళ్లాడు. అయితే , హైదరాబాద్ కు వెళ్లకుండా గ్రామ శివారులోని ఓ బావిలో దూకాడు. ఇది గమనించిన కొందరు రైతులు వెంటనే మహేందర్‌ను బావిలో నుంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందాడు. కాగా మహేందర్ తెలంగాణ యాదవ స్టూడెంట్ ఫెడరేషన్‌కు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. ఉద్యోగం రాలేదనే కారణంతోనే మహేందర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి సోదరుడు దేవరాజు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. ( చదవండి: డేంజర్ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి ) -
అప్పులబాధతో కౌలురైతు ఆత్మహత్య
కోనరావుపేట (కరీంనగర్ జిల్లా ) : కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన గౌరు నర్సయ్య(45) అనే కౌలురైతు పంట నష్టం, అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ కూలీగా చేస్తూ ఎకరంన్నర భూమిని కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేయగా వర్షాల్లేక పంట ఎండిపోయింది. సాగుకు చేసిన లక్ష రూపాయల అప్పుతోపాటు ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లకు నాలుగు లక్షల అప్పు అయింది. ప్రస్తుతం మరో కూతురు పెళ్లికి ఉంది. సాగు చేసిన పంట ఎండిపోయి అప్పులు తీర్చేందుకు మార్గం లేకపోవడంతో మనస్తాపం చెందాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన నర్సయ్య ఐకేపీ సెంటర్ సమీపంలోని కాలువలో పంట కోసం తెచ్చిన క్రిమిసంహారక మందును తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అటుగా వెళ్లిన గ్రామస్తులు చూసి మృతుని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంఘటన స్థలంలో రోదనలు మిన్నంటాయి. -
ఆందోళన బాటలో హమాలీలు
కోనరావుపేట (కరీంనగర్ జిల్లా) : ఆరోగ్య కార్డులు, గుర్తింపు కార్డుల కోసం హమాలీ కార్మికులు ఆందోళన బాటపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ నుంచి ఎమ్మార్వో ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లిన హమాలీలు, ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించారు. 100 నుంచి 150 మంది హమాలీ కార్మికులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. -
ఒంటరితనంతో విద్యార్థి ఆత్మహత్య
కోనరావుపేట: తండ్రి, తాత రెండేళ్ల వ్యవధిలో మృతి చెందడంతో ఒంటరితనంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం మంగళ్లపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బడవేని భాస్కర్ (22) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి రాజిరెడ్డి మృతి చెందాడు. దీంతో తాత మల్లయ్యతో కలసి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, ఎనిమిది నెలల క్రితం తాత కూడా మృతి చెందడంతో భాస్కర్ ఒంటరిగా ఉంటున్నాడు. సోదరుడు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన భాస్కర్ ఇంటికి దగ్గర్లో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆర్టీసీ బస్సు ఢీ: విద్యార్థినికి గాయాలు
కోనరావుపేట (కరీంనగర్) : ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానిక ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న అఖిల కుమారి(13) రోడ్డు దాటుతున్న సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు విద్యార్థినిని సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. -
ఖాళీ బిందెలతో నిరసన
కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలోని కోనరావుపూట మండలంలోని మల్కపేటకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో గురువారం నిరసనకు దిగారు. కొంతకాలంగా తాగునీటి కోసం గ్రామంలో ఇబ్బంది పడుతుండటంతో మహిళలంతా కలిసి సర్పంచ్ ఇంటి ఎదుట ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. గ్రామ సర్పంచ్ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. (కోనరావుపేట)