సాక్షి, వేములవాడ: స్వరాష్ట్రం ఏర్పడినప్పటికీ తనకు ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి లో చోటు చేసుకుంది .గ్రామానికి చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.
అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ..ఉన్నత విద్యాభ్యాసం చేసిన తనకి ఉద్యోగం రాలేదని కొంత కాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి సోమవారం సాయంత్రం బయటకు వెళ్లాడు. అయితే , హైదరాబాద్ కు వెళ్లకుండా గ్రామ శివారులోని ఓ బావిలో దూకాడు. ఇది గమనించిన కొందరు రైతులు వెంటనే మహేందర్‌ను బావిలో నుంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందాడు. కాగా మహేందర్ తెలంగాణ యాదవ స్టూడెంట్ ఫెడరేషన్‌కు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. ఉద్యోగం రాలేదనే కారణంతోనే మహేందర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి సోదరుడు దేవరాజు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు.
( చదవండి: డేంజర్ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి )
Comments
Please login to add a commentAdd a comment