VEMULAWADA RAJANNA District
-
ఉద్యోగం రావడం లేదని యువకుడి ఆత్మహత్య
సాక్షి, వేములవాడ: స్వరాష్ట్రం ఏర్పడినప్పటికీ తనకు ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లి లో చోటు చేసుకుంది .గ్రామానికి చెందిన ముచ్చర్ల మహేందర్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ ..ఉన్నత విద్యాభ్యాసం చేసిన తనకి ఉద్యోగం రాలేదని కొంత కాలంగా మనస్తాపంతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి సోమవారం సాయంత్రం బయటకు వెళ్లాడు. అయితే , హైదరాబాద్ కు వెళ్లకుండా గ్రామ శివారులోని ఓ బావిలో దూకాడు. ఇది గమనించిన కొందరు రైతులు వెంటనే మహేందర్‌ను బావిలో నుంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతను మృతి చెందాడు. కాగా మహేందర్ తెలంగాణ యాదవ స్టూడెంట్ ఫెడరేషన్‌కు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు. ఉద్యోగం రాలేదనే కారణంతోనే మహేందర్ యాదవ్ ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి సోదరుడు దేవరాజు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. ( చదవండి: డేంజర్ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి ) -
వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటించాలి
► అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా ► గుడి ఎదుట బైఠాయించిన నాయకులు వేములవాడ : ‘దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటించాలి. లేదా కరీంనగర్ జిల్లాలోనే కొనసాగించాలి.’ అని డిమాండ్ చేస్తూ శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాజన్న గుడి ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ త్వరలో రాజన్న గుడి ఎదుట నిరాహార దీక్ష, సిరిసిల్ల, కరీంనగర్‌లకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా ఉన్న వేములవాడను రాజన్న జిల్లాగా ప్రకటిం చాలని లేదా కరీంనగర్ జిల్లాలోనే కొన సాగించాలని కోరారు. కార్యక్రమంలో కన్వీనర్ బొజ్జ కనుకయ్య, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, జేఏసీ నాయకులు ఆది శ్రీనివాస్, ఏనుగు మనోహర్‌రెడ్డి, సుదర్శన్‌యాదవ్, మధు రాధాకిషన్, చిలుక రమేశ్, గన్నమనేని రామారావు, తూం మధు, నామాల పోచె ట్టి, సంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్, ఆర్. దేవేందర్, కూర దేవయ్య, అంజయ్యగౌడ్, గాజర్ల బుగ్గయ్య, కే. రాజేందర్, రేగుల మల్లికార్జున్, నక్క భూమేశ్, కడారి రాములు, ల్యాగల రమేశ్, మస్తాన్, శ్రీధర్గౌడ్లతోపాటు యాభై మంది పాల్గొన్నారు.