కబళించిన విద్యుత్ తీగ
కొప్పాక (పెదవేగి రూరల్): మొక్కజొన్న పొలంలో కూలి పనికి వెళ్లిన మహిళను విద్యుత్ తీగ రూపంలో మృత్యువు కాటేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన కోన సుజాత (40) అనే మహిళ శుక్రవారం అదే గ్రామానికి చెందిన ఆవుల జగన్మోహానరావు అనే రైతు పొలం లో మొక్కజొన్నకు వెన్ను తీసే పనికి వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో పొలంలో వెన్నుతీస్తుండగా ప్రమాదవశాత్తు సుజాత మోచేయి పక్కనే ఉన్న విద్యుత్ తీగకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందింది. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై మృతురాలి భర్త దేవసహాయం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ పీసీహెచ్ రఘురామ్ చెప్పారు.