సెల్ఫీలు.. అహంకారులు!
సియోల్: తమ అందాన్ని చూసుకొని మురిసిపోయే వారు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా సెల్ఫీలు పెడతారని ఓ అధ్యయనంలో తేలింది. దక్షిణ కొరియాలోని కొరియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు స్వయం మోహితం (నార్సిసిజం)కు...వ్యక్తుల సెల్ఫీ పోస్టింగ్, వాటికొచ్చిన కామెంట్లపై ఆసక్తి చూపడం మధ్యగల సంబంధాన్ని అధ్యయనం చేశారు.
కాగా తమకొచ్చిన కామెంట్లు, ఇతరుల సెల్ఫీలపై వారు ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు తక్కువేనని తేల్చారు. నలుగురిలో గౌరవం పొందడం కోసం ఇతరుల కన్నా వారు తమను తాము ఎక్కువగా చూపించుకునేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. ఇలాంటివారిలో అహంకార ధోరణి ఎక్కువగా కనిపిస్తుందని, ఇతరుల అభిప్రాయాలను వీరు గౌరవించేందుకు ఆసక్తి చూపరని శాస్త్రవేత్తలు తెలిపారు.