kosta district
-
అమ్మా ఎందుకు వదిలేశావ్..?
రాత్రి 8 గంటల సమయం. చుట్టూ చిమ్మచీకటి. మెల్లగా ముసురుకుంటున్న చలి గాలులు. నిశ్శబ్దమైన వాతావరణంలో వినిపించిన ఓ పసికందు రోదన కోష్ట గ్రామాన్ని ఉలిక్కిపడేలా చేసింది. తొమ్మిది నెలలు అమ్మ కడుపులో భద్రంగా ఉన్న బిడ్డ ఆ పేగు తెంచుకున్నాక.. బంధాలకు కూడా దూరమై ఇలా చీకటిలో నిస్సహాయంగా స్థానికుల కంట పడింది. జేఆర్‌పురం ఎస్ఐ జి.రాజేష్ తెలిపిన వివరాల మేరకు.. కోష్ట గ్రామంలోని ఒక కర్రల మోపుపై ఎవరో ఒక ఆడ పసికందును విడిచిపెట్టి వెళ్లిపోయారు. స్థానికులు పసిపాప ఏడుపులు విని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ రాజేష్ పాపను రణస్థలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ బిడ్డను ఎవరు ఇక్కడ వదిలి వెళ్లిపోయారో తెలియాల్సి ఉంది. పసికందు 1.5 కిలోల బరువు ఉందని, జన్మించి ఒక రోజు అయి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజేష్ తెలిపారు. (చదవండి: సిక్కోలు గుండెల్లో ఆ గురుతులు పదిలం) -
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
తొండంగి (తుని) : కోస్తా జిల్లాల్లో పలు చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితులను క్రైం పోలీసులు శుక్రవారం గోపాలపట్నం రైల్వేస్టేçÙ¯ŒS వద్ద అరెస్టు చేశారు. తణుకుకు చెందిన బండి దుర్గా ప్రసాద్, రాజమండ్రికి చెందిన మోర్త వెంకటేష్ తణుకు, విజయనగరం, రాజమండ్రి, బెండపూడి, ఎర్రకోనేరు, గండేపల్లి, కోరుకొండ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడ్డారు. పలుకేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న వీరు పరారీలో తిరుగుతున్నారు. వీరిని పట్టుకునేందుకు పెద్దాపురం క్రైం ఎస్సై ఎస్.జి.వల్లీ బృందం నెల రోజులుగా తిరుగుతున్నారు. శుక్రవారం గోపాలపట్నం రైల్వేస్టేçÙ¯ŒS వద్ద ఉన్నట్టు వారికి సమాచారం అందడంతో వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఎస్సై బి.కృష్ణమాచారి, క్రైం ఏఎస్సై నరసింహారావు, హెడ్‌కానిస్టేబుల్ బలరామ్, తొండంగి పోలీస్‌స్టేçÙ¯ŒS సిబ్బంది పాల్గొన్నారు.