చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
Published Sat, Jan 21 2017 12:13 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM
తొండంగి (తుని) :
కోస్తా జిల్లాల్లో పలు చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితులను క్రైం పోలీసులు శుక్రవారం గోపాలపట్నం రైల్వేస్టేçÙ¯ŒS వద్ద అరెస్టు చేశారు. తణుకుకు చెందిన బండి దుర్గా ప్రసాద్, రాజమండ్రికి చెందిన మోర్త వెంకటేష్ తణుకు, విజయనగరం, రాజమండ్రి, బెండపూడి, ఎర్రకోనేరు, గండేపల్లి, కోరుకొండ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడ్డారు. పలుకేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న వీరు పరారీలో తిరుగుతున్నారు. వీరిని పట్టుకునేందుకు పెద్దాపురం క్రైం ఎస్సై ఎస్.జి.వల్లీ బృందం నెల రోజులుగా తిరుగుతున్నారు. శుక్రవారం గోపాలపట్నం రైల్వేస్టేçÙ¯ŒS వద్ద ఉన్నట్టు వారికి సమాచారం అందడంతో వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఎస్సై బి.కృష్ణమాచారి, క్రైం ఏఎస్సై నరసింహారావు, హెడ్‌కానిస్టేబుల్ బలరామ్, తొండంగి పోలీస్‌స్టేçÙ¯ŒS సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement