chory
-
చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
తొండంగి (తుని) : కోస్తా జిల్లాల్లో పలు చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న నిందితులను క్రైం పోలీసులు శుక్రవారం గోపాలపట్నం రైల్వేస్టేçÙ¯ŒS వద్ద అరెస్టు చేశారు. తణుకుకు చెందిన బండి దుర్గా ప్రసాద్, రాజమండ్రికి చెందిన మోర్త వెంకటేష్ తణుకు, విజయనగరం, రాజమండ్రి, బెండపూడి, ఎర్రకోనేరు, గండేపల్లి, కోరుకొండ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చోరీలకు పాల్పడ్డారు. పలుకేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న వీరు పరారీలో తిరుగుతున్నారు. వీరిని పట్టుకునేందుకు పెద్దాపురం క్రైం ఎస్సై ఎస్.జి.వల్లీ బృందం నెల రోజులుగా తిరుగుతున్నారు. శుక్రవారం గోపాలపట్నం రైల్వేస్టేçÙ¯ŒS వద్ద ఉన్నట్టు వారికి సమాచారం అందడంతో వారిని అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. ఎస్సై బి.కృష్ణమాచారి, క్రైం ఏఎస్సై నరసింహారావు, హెడ్‌కానిస్టేబుల్ బలరామ్, తొండంగి పోలీస్‌స్టేçÙ¯ŒS సిబ్బంది పాల్గొన్నారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
మోద్గులగూడెం(కురవి): మండలంలోని మోద్గులగూడెంలో ఓ ఇంట్లో రెండు రోజుల క్రితం చోరీ జరిగిన ఘటనలో తులం బంగారం, రూ.10వేల నగదు అపహరణకు గురైంది. బాధితుల కథనం ప్రకారం.. మోద్గులగూడేనికి చెందిన నీలారపు వెంకటమ్మ ఇంట్లో గత శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. వెంకటమ్మతో పాటు కుటుంబసభ్యులు బంధువుల ఊరికి వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు వెంకటమ్మ ఇంట్లోకి చొరబడి బీరువాను పగులగొట్టి అందులో దాచుకున్న రూ.10వేల నగదు, తులం బంగారు ఆభరణాన్ని అపహరించారు. వెంకటమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం ఇంటికి చేరుకునే సరికి తలుపులు తీసి కనిపించాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి, సామాన్లు చెల్లాచెదురుగా పడవేసి కనిపించాయి. సీరోలు పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా చోరీ జరిగిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు.