Kothaguda
-
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి
కొత్తగూడ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎదుళ్లపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జినుకల రాజు(24) నాటు వేయడానికి తన పొలం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో నీరు పారించడానికి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మోటార్ వద్ద షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు సింహద్రి, నాగమల్లు గుండెలవిసేలా రోదించారు. -
దొంగలు బాబోయ్ దొంగలు..
-
కొత్త సంవత్సరం కానుక.. కొత్తగూడ ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, సిటీబ్యూరో/గచ్చిబౌలి: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి.. సిగ్నల్ లేని ప్రయాణానికి మార్గం సుగమమం చేసేందుకు మరో ఫ్లైఓవర్ కొత్త సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఐటీ కారిడార్‌కు మరో మణిహారంగా కొత్తగూడలో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లను మునిసిపల్ ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ఆదివారం ప్రారంభించారు. దీనిద్వారా ఆల్విన్‌కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ లేని ప్రయాణం చేసేందుకు మార్గం సుగమమైంది. ఫ్లై ఓవర్ వివరాలు.. ► రూ.263.09 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం ► ఫ్లై ఓవర్‌తోపాటు 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్‌పాస్ ► ఫ్లైఓవర్ పొడవు దాదాపు 3 కి.మీ. ► 2, 3, 4, 5 లేన్లుగా గ్రేడ్ సెపరేటర్‌గా నిర్మాణం ► ఎస్సార్డీపీ ద్వారా చేపట్టిన పనుల్లో ఇది 18వ ఫ్లైఓవర్ ► ప్రత్యేక ఆకర్షణగా ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు ఉపయోగాలు.. ► గచ్చిబౌలి వైపు నుంచి ఆలి్వన్‌కాలనీ జంక్షన్ వైపు వన్‌వే ఫ్లైఓవర్‌గా ఇది అందుబాటులోకి రానుంది. గచ్చిబౌలి వైపు నుంచి వచ్చే వాహనాలు, మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్ నుంచి వచ్చే వాహనాలు ఫ్లైఓవర్ పైకి వెళ్తాయి. మాదాపూర్ లేదా హఫీజ్‌పేట్ వైపు వెళ్లవచ్చు. హఫీజ్‌పేట్ నుంచి వచ్చే గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే వాహనాలు అండర్ పాస్ ద్వారా వెళ్తాయి. దీంతో శరత్ సిటీ క్యాపిటల్ మాల్, కొత్తగూడ జంక్షన్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గనుంది. ► కొండాపూర్, మాదాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట్, బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలి ప్రాంతాలకు సులభతరంగా రాకపోకలు చేయవచ్చు. ► కొత్తగూడ, కొండాపూర్ బొటానికల్ గార్డెన్ జంక్షన్లలో వాహనదారులకు ఊరట. ► ఆల్విన్ కాలనీ నుంచి గచ్చిబౌలి కూడలి వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం. ► మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్, గచ్చిబౌలివైపు వెళ్లే వారు ఇక సులభంగా రాకపోకలు సాగించే అవకాశం. ► గచ్చిబౌలి కూడలి నుంచి బొటానికల్ గార్డెన్, కొండాపూర్, కొత్తగూడ, ఆలి్వన్‌కాలనీ, మాదాపూర్ ప్రాంతాలకు ఎలాంటి ఆటంకం లేకుండా రాకపోకలు సాగించే అవకాశం ► ట్రాఫిక్ సమస్య, సమయం, వాహనాల ఇంధనం ఖర్చు తగ్గుతాయి. ఏర్పాట్ల పరిశీలన.. ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే ఆరెకపూడిగాంధీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, డీఈ భరద్వాజ్, ఏఈ పరమేష్, ఏఈ శివకృష్ణ, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్, మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నవీన్, బోస్, నాయకులు శ్రీనివాస్‌యాదవ్, నర్సింహ్మసాగర్,ఖాజా, రామకృష్ణ ఆంజనేయులు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. చదవండి: అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు -
సైబర్ సిటీలో సాఫీ జర్నీ.. నయా సాల్ కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్
సాక్షి, హైదరాబాద్: కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన కొత్తగూడ ఫ్లైఓవర్ త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్త సంవత్సర కానుకగా జన వరి మొదటి వారంలో మంత్రి కె.తారక రామా రావు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. దాదాపు రూ.263 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈప్రాజెక్టు వినియోగంలోకి వచ్చాక పరిసర కాలనీల్లోని వారితోపాటు ఆ మార్గాల్లో ప్రయాణించేవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. తక్కువ దూరంలో ఉన్న బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కుల నుంచి సాఫీగా వెళ్లేందుకు వెసులుబాటు కలుగుతుంది. ఈ జంక్షన్ల పరిసరాల్లోనే అనేక సాఫ్ట్వేర్ కంపెనీలుండటం తెలిసిందే. సదరు కంపెనీల్లోని ఉద్యోగుల రాకపోకలకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి. మియాపూర్ దాకా మంచి కనెక్టివిటీ.. ఈ ఫ్లై ఓవర్ వల్ల గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. మియాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్ పరిసర ప్రాంతాల వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్లలో 100 శాతం ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంతో పాటు కొండాపూర్ జంక్షన్ లో 65 శాతం ట్రాఫిక్ సమస్య తీరుతుందని అధికారులు పేర్కొన్నారు. దాదాపు 3 కిలో మీటర్ల పొడవుతో చేపట్టిన ఫ్లై ఓవర్‌తో పాటు 470 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్‌ను కూడా చేపట్టి పూర్తి చేశారు. ఫ్లై ఓవర్ ఇలా.. మెయిన్ ఫ్లై ఓవర్ ఎస్ఎల్ఎన్ టెర్మినస్ నుంచి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు.. బొటా నికల్ గార్డెన్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్‌వరకు..అక్కడి నుంచి కొండాపూర్ ఆర్టీఏ ఆఫీస్ వరకు. పొడవు 2.21 కి.మీ. ∙మజీద్‌బండ రోడ్వైపు నుంచి వచ్చేవారి కోసం బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు 2 లేన్లతో అప్ర్యాంప్ 401మీటర్లు. ∙కొత్తగూడ జంక్షన్ నుంచి హైటెక్‌సిటీ వైపు 3 లేన్లతో డౌన్ ర్యాంప్ 383 మీటర్లు. ∙అన్నీ వెరసి దాదాపు 3 కి.మీ.ల పొడవు. హఫీజ్‌పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు కొత్తగూడ జంక్షన్‌వద్ద 3లేన్ల అండర్‌పాస్.దీనిపొడవు 470 మీటర్లు. -
మహబూబాబాద్ జిల్లాలో పులి ఆనవాళ్లు
-
బోయపాటి సినిమాకు బ్రేక్.. కారణం ఇదే!
అనంతగిరి: తమ గ్రామ పరిధిలో సినిమా చిత్రీకరణ చేయరాదని, తమ భూములు పాడవుతున్నాయని కొటాలగూడ గ్రామస్తులు అడ్డుకున్నారు. శనివారం వికారాబాద్ మండలం కొటాలగుడెం గ్రామంలో ద్వారక క్రియేషన్స్ ప్రొడక్షన్స్‌లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను చిత్రీకరించేందుకు వచ్చారు. చిత్రీకరిస్తున్న క్రమంలో పలువురు గ్రామస్తులు వెళ్లి సినిమా షూటింగ్‌ను అడ్డగించడంతోపాటు తమ పంట పొలాలు దెబ్బతింటున్నాయని వాపోయారు. చదవండి: హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే: నాగబాబు చదవండి: ఆచార్య@ మారేడుపల్లి.. చిరు గ్రాండ్ ఎంట్రీ -
విద్యార్ధుల మధ్య ఘర్షణ,ఒకరు మృతి
-
బాలుడిని మింగిన ఇంకుడు గుంత
కొత్తగూడ : ఇంకుడు గుంతలోపడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని పొగుళ్లపల్లి శివారు చక్రాలతండాలో గురువారం జరి గింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా రవీందర్, అరుణ దంపతులు తమ ఇంటి ఎదుట ఇంకుడు గుంత తవ్వారు. తవ్వినప్పటి నుంచి ప్రతీ రోజు వర్షం కురుస్తుండటంతో గుంతను పూడ్చకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గురువారం తల్లిడ్రులు తాగునీటి కోసం సమీప బోరు బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏకైక కుమారుడు చరణ్(2) ఆడుకుంటూ వెళ్లి నీటితో నిండి ఉన్న ఇం కుడు గుంతలో పడిపోయాడు. నీళ్లు తీసుకురావడం పూర్తయ్యాక చరణ్ కోసం తండాలోని ఇళ్లల్లో వెతికారు. ఎక్కడా కనిపంచకపోవడంతో ఇంకుడుగుంతలో చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. ఎన్నో దేవుళ్లకు మొక్కితే కలిగిన కుమారుడు.. రవీందర్, అరుణ దంపతులకు పెళ్లయిన రెండేళ్లకు కుమార్తె జన్మించింది. అనంతరం ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. ఎన్నో దేవుళ్లకు మొక్కు లు, వరాలు పట్టిన తర్వాత డాక్టర్ల చుట్టూ తిరిగితే ఎనిమిదేళ్ల తర్వాత కలిగిన కుమారుడు చరణ్. ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. చరణ్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చరణ్ మృతదేహాన్ని చూడటానికి వచ్చిన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. -
నగరంలో పర్యటించిన మేయర్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం హైదరాబాద్ నగరంలో పర్యటించారు. నగరంలోని కొత్తగూడ, కొండాపూర్ ప్రాంతాల్లోని రహదారుల పరిస్థితిని ఆయన పరిశీలించారు. సదరు ప్రాంతంలో ట్రాఫిక్, రహదారి పరిస్థితిని ఆయన వెంట ఉన్న ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే, కేబీఆర్ పార్కు వద్ద వన్‌వే ఏర్పాటుపై కూడా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు మేయర్ బొంతు రామ్మోహన్ పలు సూచనలు చేశారు. -
పొరుగింటివారు తిట్టారని..
హైదరాబాద్ : ఇంటి పక్కవారు అకారణంగా తిట్టారని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. హయత్‌నగర్ మండలం కొత్తగూడలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత(21)కు ఆదివారం పొరుగింటివారితో గొడవ జరిగింది. ఈ సందర్భంగా వారు అనవసరంగా దుర్భాషలాడారంటూ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆమె చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.