ఇంకుడు గుంతలోపడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని పొగుళ్లపల్లి శివారు చక్రాలతండాలో గురువారం జరి గింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా రవీందర్, అరుణ దంపతులు తమ ఇంటి ఎదుట ఇంకుడు గుంత తవ్వారు. తవ్వినప్పటి నుంచి ప్రతీ రోజు వర్షం కురుస్తుండటంతో గుంతను పూడ్చకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గురువారం తల్లిడ్రులు తాగునీటి కోసం సమీప బోరు బావి వద్దకు వెళ్లారు.
కొత్తగూడ : ఇంకుడు గుంతలోపడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటన మండలంలోని పొగుళ్లపల్లి శివారు చక్రాలతండాలో గురువారం జరి గింది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన భూక్యా రవీందర్, అరుణ దంపతులు తమ ఇంటి ఎదుట ఇంకుడు గుంత తవ్వారు. తవ్వినప్పటి నుంచి ప్రతీ రోజు వర్షం కురుస్తుండటంతో గుంతను పూడ్చకుండా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. గురువారం తల్లిడ్రులు తాగునీటి కోసం సమీప బోరు బావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో వారి ఏకైక కుమారుడు చరణ్(2) ఆడుకుంటూ వెళ్లి నీటితో నిండి ఉన్న ఇం కుడు గుంతలో పడిపోయాడు. నీళ్లు తీసుకురావడం పూర్తయ్యాక చరణ్ కోసం తండాలోని ఇళ్లల్లో వెతికారు. ఎక్కడా కనిపంచకపోవడంతో ఇంకుడుగుంతలో చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు.
ఎన్నో దేవుళ్లకు మొక్కితే కలిగిన కుమారుడు..
రవీందర్, అరుణ దంపతులకు పెళ్లయిన రెండేళ్లకు కుమార్తె జన్మించింది. అనంతరం ఏళ్లు గడిచినా సంతానం కలగలేదు. ఎన్నో దేవుళ్లకు మొక్కు లు, వరాలు పట్టిన తర్వాత డాక్టర్ల చుట్టూ తిరిగితే ఎనిమిదేళ్ల తర్వాత కలిగిన కుమారుడు చరణ్. ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. చరణ్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. చరణ్ మృతదేహాన్ని చూడటానికి వచ్చిన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి.