Kothakota Dayakar Reddy
-
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్‌రెడ్డి, అమరచింత నుంచి 2 సార్లు, ఒకసారి మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కపురం. చదవండి: ఎల్లో అలర్ట్: తెలంగాణలో రెండు రోజులు వానలే.. -
టీడీపీకి గుడ్‌బై.. కన్నీటి పర్యంతమైన దయాకర్‌రెడ్డి
సాక్షి, మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు మహబూబ్‌నగర్ జిల్లాలో టీడీపీ ఖాళీ అయింది. ఆ పార్టీ సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి దంపతులు పార్టీని వీడుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. అయితే ఏ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. దీంతో పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. అనుచరులు, కార్యకర్తల అభీష్టం మేరకే తదుపరి నిర్ణయమని చెబుతున్నా.. కాంగ్రెస్‌లోనే చేరేందుకు అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ఆయన అనుచరులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ హయాంలో కొత్తకోట దంపతులు కీలకపాత్ర పోషించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో వీరే కీలకంగా ఉన్నారు. అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు దయాకర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజకవర్గాల పునర్వివిభజనతో 2009లో మక్తల్ నుంచి బరిలో నిలిచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దయాకర్‌రెడ్డి సతీమణి సీతమ్మ 2002లో జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2009లో కొత్తగా ఏర్పాటైనా దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన ఈ దంపతులు ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పరిణామాల క్రమంలో స్తబ్దుగా ఉన్నారు. కొత్తకోట దంపతుల నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు, ఆ తర్వాత పాలమూరులో టీడీపీ పరిస్థితి రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్ అయింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో టీడీపీ దాదాపుగా ఖాళీ అయినట్లేనని తెలుస్తోంది. బక్కని నర్సింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి వంటి ఇద్దరు ముగ్గురు నాయకులే మిగలగా.. వారు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నట్లు గుర్తుచేసుకున్నారు. కన్నీటి పర్యంతమైన దయాకర్‌రెడ్డి.. గురువారం దయాకర్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవరకద్రలోని ఓ గార్డెన్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన ఆయన అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. 30ఏళ్లుగా టీడీపీతో పాటు ఎన్టీఆర్ఆర్, చంద్రబాబుతో ఉన్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నిలిచిపోయాయని.. పార్టీలో కొనసాగినా ఇటు కార్యకర్తలకు, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. -
కాంగ్రెస్‌లోకి కొత్తకోట దంపతులు?
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగుదేశం సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట దయాకర్‌రెడ్డి, సీతా దయాకర్‌రెడ్డి దంపతులు ఆ పార్టీని వీడుతున్నారు. దయాకర్‌రెడ్డి గురువారం ఈ విషయం వెల్లడించారు. వారిద్దరూ త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాల్లో వీరు కీలకంగా వ్యవహరించారు. దయాకర్‌రెడ్డి అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 1999లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నియోజక వర్గాల పునర్విభజనతో 2009లో మక్తల్ నుంచి గెలుపొందారు. సీతమ్మ 2002లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పాటైన దేవరకద్ర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో దంపతులిద్దరూ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించారు. ప్రజాభీష్టం మేరకే నిర్ణయం తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొంతకాలం టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నా ఆ తర్వాత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల కొంతకాలంగా మక్తల్, దేవరకద్ర నియోజకవర్గ కేంద్రాల్లో పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరికి మూడు ప్రధాన పార్టీల నుంచి ఆహ్వానం అందినట్లు తెలిసింది. (క్లిక్: అవినీతి నిరూపిస్తే మంథని చౌరస్తాలో ఉరేసుకుంటా) ఈ క్రమంలో దేవరకద్రలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో టీడీపీని వీడుతున్న విషయం వెల్లడిస్తూ దయాకర్‌రెడ్డి కన్నీటి పర్యంతం అయ్యారు. టీడీపీతో 30 ఏళ్ల అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. మూడు నెలల పాటు దేవరకద్ర, మక్తల్ నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రజల అభీష్టం మేరకు ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటామని కొత్తకోట దంపతులు చెప్పారు. అయితే టీడీపీలో ఉన్న సమయంలో రేవంత్‌రెడ్డితో ఉన్న సంబంధాల నేపథ్యంలో హస్తం గూటికి చేరే అవకాశమే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. (క్లిక్: అన్ని పార్టీల్లోనూ అదే సీన్ అలక.. అసంతృప్తి) -
దొరలపాలన అంతమవ్వాలి.. ప్రజాస్వామ్యం బతకాలి..
సాక్షి, అమరచింత : తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలనలో విసిగివేసారిన జనం దొరలపాలనకు చరమగీతం పలికి బహుజనులకే రాజ్యాధికారం అందించడానికి ముందుకురావాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గసభ్యుడు జాన్‌వెస్లీ అన్నారు. సోమవారం అమరచింతలో బీఎల్ఎఫ్ మక్తల్ నియోజకవర్గ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని గెలిపించాలని కోరుతూ అమరచింతలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీళ్లు,నిధులు, నియామకాలు అంటూ గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్లను మింగాడని, నిధులను దోచుకున్నాడని నియామకాలను వదిలేశారని ఆరోపించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు ఇస్తానని, అర్హులైన ప్రతిఒక్కరికీ డబుల్ బెడ్రూంలను నిర్మించి ఇస్తానని ప్రగల్భాలు పలికి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గాలికి వదిలేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్ర జాసంక్షేమాన్ని విస్మరించిన ఆయారాజకీయ పార్టీలు మరోమారు తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసి బీఎల్ఎఫ్ బలపర్చిన అభ్యర్థులను ఆదరించి గెలిపించాలని కోరారు. మక్తల్ నియోజకవర్గాన్ని పరిపాలించిన చిట్టెంరాంమోహన్‌రెడ్డి, కొత్తకోట దయాకర్‌రెడ్డి వారిసొంత ఆస్తులను పెంచుకున్నారే తప్పా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయలేదన్నారు. మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేకపోవడం శోచనీయం అన్నారు. కొత్తమండలాలతో పాటు కొన్నిచోట్ల పాతమండలాల్లో కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా ఏర్పాటు చేయలేని పాలకులను సాగనంపాలన్నారు. నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీచేస్తున్న వెంకట్రాంరెడ్డికి మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎల్ఎఫ్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, సీపీఎం మండల కార్యదర్శి జీఎస్.గోపి, సీపీఎం సీనియర్ నాయకులు మహిమూద్, శ్యాంసుందర్, బుచ్చన్న, రమేష్, తిమ్మోతి, వెంకటేష్ పలువురు పాల్గొన్నారు. -
కేంద్రం దృష్టిలో 'రాయల తెలంగాణ'
హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పషమైన వైఖరి ప్రకటించారని టీడీపీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఉదయం ఓ న్యూస్ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రం దృష్టిలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి టీడీపీయే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై రాజకీయ పార్టీలు మరోసారి తమ అభిప్రాయాలు తెలియచేయాలన్నారు. తాను సక్కా సమైక్యావాదినని అన్నారు. తెలంగాణ అడగటంలో తప్పులేదని... ఇవ్వటంలోనూ తప్పులేదన్నారు. అయితే సీమాంధ్రులను కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలటం సరికాదన్నారు.