హైదరాబాద్ : రాష్ట్ర విభజనకు కట్టుబడి ఉన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పషమైన వైఖరి ప్రకటించారని టీడీపీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం ఉదయం ఓ న్యూస్ చానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రం దృష్టిలో రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి టీడీపీయే కారణమని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై రాజకీయ పార్టీలు మరోసారి తమ అభిప్రాయాలు తెలియచేయాలన్నారు. తాను సక్కా సమైక్యావాదినని అన్నారు. తెలంగాణ అడగటంలో తప్పులేదని... ఇవ్వటంలోనూ తప్పులేదన్నారు. అయితే సీమాంధ్రులను కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలటం సరికాదన్నారు.