koti talambralu
-
రాములోరి పెళ్లికి కోటి తలంబ్రాలు
గోకవరం: భద్రాచలం, ఒంటిమిట్ట ఆలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి ఏటామాదిరిగా కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురంలో కోరుకొండ శ్రీకృష్ణచైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణం అప్పారావు తన ఎకరం పొలంలో కోటి తలంబ్రాల కోసం ధాన్యం పండించారు. శుక్రవారం ఈ పంట కోతలు కోయించారు. శ్రీరాముని వేషధారణతో పాటు జాంబవంతుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, అంగదుడు వేషధారణలో భక్తులు రామనామం జపిస్తూ కోతల్లో పాల్గొన్నారు. కళ్యాణం అప్పారావు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది భద్రాచలం, ఒంటిమిట్టల్లో నిర్వహించే సీతారాముల కళ్యాణానికి తలంబ్రాల కోసం సుమారు 800 కేజీల ధాన్యం అవసరం అవుతుందన్నారు. ఇక్కడ పండించిన ధాన్యాన్ని ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లోని సుమారు 3 వేల మంది భక్తులకు పంపించి గోటితో ఒడ్లు ఒలిపించి తలంబ్రాలు సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. కొన్నేళ్లుగా ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. -
కల్యాణ రామునికోసం సిద్ధమైన కో(గో)టి తలంబ్రాలు
రాజమహేంద్రవరం కల్చరల్ : కోదండ రాముని కల్యాణోత్సవానికి కోటి తలంబ్రాలు సిద్ధమయ్యాయి. కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యాన నాలుగు నెలలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి సేకరించిన తలంబ్రాలను గురువారం పుష్కరాల రేవు వద్దకు తీసుకువచ్చారు. శ్రీరామనామ పారాయణతో గోటితో 400 కేజీల ధాన్యం ఒలిచి, కోటి తలంబ్రాలుగా మలిచి, పుష్కరాల రేవు వద్ద పూజలు నిర్వహించారు. శ్రీసూక్తం, శ్రీరామ అష్టోత్తర శతనామ స్తోత్రం, హనుమా¯ŒS చాలీసా చదువుతూ తలంబ్రాలను నింపడానికి తీసుకువచ్చిన కలశాలను గోదావరి జలాలతో శుద్ధి చేశారు. అనంతరం కలశాలకు హారతులు ఇచ్చారు. ఈ సందర్భంగా కల్యాణం అప్పారావు మాట్లాడుతూ, భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఉన్న రామయ్య కల్యాణ వేదిక వద్దకు ఏప్రిల్ ఒకటో తేదీకి కలశాలను చేరుస్తామని చెప్పారు. భద్రగిరికి ప్రదక్షిణలు చేసి, సీతారామ కల్యాణ మహోత్సవానికి తలంబ్రాలు అందజేస్తామన్నారు. భారతీయ ఆత్మ శ్రీరాముడని, సీతారామ కల్యాణమంటే ఆత్మకల్యాణమేనని ఆయన తెలిపారు. -
కోటి గోటి తలంబ్రాల పంటకు శ్రీకారం
వరి విత్తనాలు జల్లిన ఏసీబీ డీఎస్పీ మురళీకృష్ణ రాజానగరం: వచ్చే ఏడాది శ్రీరామ నవమికి ఒంటిమిట్ట రాములవారికి గోటితో ఒలిచే కోటి తలంబ్రాలు సమర్పించే నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం ఆధ్వర్యంలో వరిసాగుకు సో మవారం శ్రీకారం చుట్టారు. రాజానగరం మం డలం వెలుగుబంద గ్రామంలో నాతిపా ము శ్రీరామ్మూర్తికి చెందిన పొలంలో ‘జై శ్రీరా మ్’ అని జపిస్తూ ఏసీబీ డీఎస్పీ జి.మురళీకృష్ణ చేతుల మీదుగా వరి విత్తనాలు చల్లించారు. తొలుత శాస్త్రోక్తంగా ధాన్యలక్ష్మి అనుష్టానంతో విత్తనశుద్ధి చేశారు. ‘శ్రీరామ నామం అనే విత్త నం మనస్సులో నాటుకుంటే జ్ఞానం అనే పం ట పండుతుంది’ అని సంఘం ప్రతినిధి కల్యా ణం అప్పారావు అన్నారు. అదే విశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాములోరి కల్యాణోత్సవాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందించనున్నట్టు చెప్పారు. భద్రాద్రి రాముడి కల్యాణానికి గత సంవత్సరం మాదిరే ఈ సంవత్సరమూ గోకవరం మండలంలో ప్రత్యేకంగా వరి పంటను సాగు చేస్తున్నారు.