కోటి గోటి తలంబ్రాల పంటకు శ్రీకారం | Goti Koti talambrala Crop To Started | Sakshi
Sakshi News home page

కోటి గోటి తలంబ్రాల పంటకు శ్రీకారం

Published Mon, Jul 6 2015 1:16 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

కోటి గోటి తలంబ్రాల పంటకు శ్రీకారం - Sakshi

కోటి గోటి తలంబ్రాల పంటకు శ్రీకారం

వరి విత్తనాలు జల్లిన ఏసీబీ డీఎస్పీ మురళీకృష్ణ
రాజానగరం: వచ్చే ఏడాది శ్రీరామ నవమికి ఒంటిమిట్ట రాములవారికి గోటితో ఒలిచే కోటి తలంబ్రాలు సమర్పించే నిమిత్తం తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్యసంఘం ఆధ్వర్యంలో  వరిసాగుకు సో మవారం శ్రీకారం చుట్టారు. రాజానగరం మం డలం వెలుగుబంద గ్రామంలో  నాతిపా ము శ్రీరామ్మూర్తికి చెందిన పొలంలో ‘జై శ్రీరా మ్’ అని జపిస్తూ  ఏసీబీ డీఎస్పీ జి.మురళీకృష్ణ చేతుల మీదుగా వరి విత్తనాలు చల్లించారు.

తొలుత శాస్త్రోక్తంగా ధాన్యలక్ష్మి అనుష్టానంతో విత్తనశుద్ధి చేశారు. ‘శ్రీరామ నామం అనే విత్త నం మనస్సులో నాటుకుంటే జ్ఞానం అనే పం ట పండుతుంది’ అని సంఘం ప్రతినిధి కల్యా ణం అప్పారావు అన్నారు. అదే విశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాములోరి కల్యాణోత్సవాలకు గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను అందించనున్నట్టు చెప్పారు. భద్రాద్రి రాముడి కల్యాణానికి గత సంవత్సరం మాదిరే ఈ సంవత్సరమూ గోకవరం మండలంలో ప్రత్యేకంగా వరి పంటను సాగు చేస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement