kotta majeru
-
కొత్తమాజేరులో చెరువును పరిశీలించిన వైఎస్ జగన్
కొత్తమాజేరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో కలుషితంగా మారిన మంచినీటి చెరువును పరిశీలించారు. కాగా విష జ్వరాలతో మృతిచెందిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. గ్రామస్తులు కలుషిత నీరు తాగి విషజ్వరాల బారిన పడినా సకాలంలో స్పందించని అధికారుల తీరుపైనా వివరాలను ఆయన అడిగి తెలుసుకుంటారు. అంతకు ముందు వైఎస్ జగన్...శ్రీకాకుళం గ్రామంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. -
వల్లూరుపాలెంలో వైఎస్ జగన్కు ఘన స్వాగతం
విజయవాడ : కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం వల్లూరుపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పార్టీ నేతలు మంగళవారం ఘన స్వాగతం పలికారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్త మాజేరులో విష జ్వరాలతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లో బయలుదేరి 8.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొత్తమాజేరుకు బయల్దేరి వెళ్లారు. పరామర్శల అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు వైఎస్ జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి ఎయిరిండియా విమానంలో హైదరాబాద్ పయనం అవుతారు.