Kovelamudi Raghavendra Rao
-
దర్శకుడు రాఘవేంద్రరావు ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్ రావు (81) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. కృష్ణతో ‘భలే కృష్ణుడు’, మోహన్ బాబుతో ‘అల్లరి మొగుడు’, చిరంజీవితో ‘యుద్ధభూమి’, (చిరు నటించిన ‘ఇద్దరు మిత్రులు’ని రాఘవేంద్రరావుతో కలిసి నిర్మించారు) బాలకృష్ణతో ‘అపూర్వ సహోదరులు, మహేశ్‌బాబుతో ‘బాబీ’ తదితర చిత్రాలను కృష్ణమోహన్ రావు నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు గురువారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణమోహన్ రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
నిర్మాత కన్నుమూత: జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్
ప్రముఖ నిర్మాత వి.దొరస్వామి నేడు(సోమవారం) ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి విదితమే. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన ఇక లేరనే వార్త చాలా బాధాకరమని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. నిర్మాతగా, పంపిణీదారుడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు. సింహాద్రి చిత్ర విజయంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని గుర్తు తెచ్చుకున్నాగు. దొరస్వామి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (చదవండి: ప్రముఖ తెలుగు నిర్మాత కన్నుమూత) "అజాత శత్రువు, అందరికీ బంధువు దొరస్వామి గారు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కింగ్‌లా వెలిగారు. మేం తీసిన 90 శాతం సినిమాలు ఆయనే రిలీజ్ చేశారు. ఆయన తీసిన అన్నమయ్య కీర్తనలకు నేను దర్శకుడిగా పని చేసినప్పుడు పంచుకున్న అనుభవాలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ఆయనకు ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. తదితరులు సైతం ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో రేపు ఉదయం 11 గంటలకు దొరస్వామి అంత్యక్రియలు జరగనున్నాయి. (చదవండి: యాక్షన్ సీన్ కోసం 50 రోజులు నైట్ షూట్) దొరస్వామి రాజు గారు ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ఒక నిర్మాత గా, పంపిణీదారుడి గా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు మరువలేనివి. సింహాద్రి చిత్ర విజయం లో ఆయన పాత్ర ఎంతో కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను — Jr NTR (@tarak9999) January 18, 2021 We lost Telugu Cinema’s one of the passionate distributors & producers, VMC Doraswami Raju garu. My condolences to his family. - K. Raghavendra Rao @Ragavendraraoba pic.twitter.com/yrhtvXnGGr — BARaju (@baraju_SuperHit) January 18, 2021 -
ఒక్క ఫ్రేములో బన్నీ సినిమా స్టోరీ
గంగోత్రి సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు అల్లు అర్జున్.. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్‌తో జతకట్టిన బన్నీ ‘ఆర్య’ సినిమాతో మరోసారి ప్రేమకథను ఎంచుకుని సక్సెస్‌ను అందుకున్నాడు. ఆపై సాఫ్ట్ యాంగిల్ నుంచి మాస్, రొమాంటిక్, యాక్షన్.. ఇలా అన్ని రకాల సినిమాల్లోనూ తన సత్తా చాటుతూ ఆల్‌రౌండర్‌గా మారాడు. ఎప్పటికప్పుడు కొత్త కథలను ఎంచుకునే బన్నీ ఆయా సినిమాలకు తగ్గట్టుగా భిన్న లుక్స్‌తో కనిపించడానికే ప్రాధాన్యం ఇస్తాడు. అలా తక్కువ కాలంలోనే స్టైలిష్ స్టార్‌గా పేరు గడించాడు. అయితే ఎవరికైనా తొలి సినిమా ఓ జ్ఞాపకం.. ఓ మధురానుభూతి.. ఎన్ని విజయాలందుకున్నా.. ఎంత ఎదిగినా తొలి అడుగు అక్కడే మొదలైందన్న విషయం ఎవరూ మర్చిపోరు. అలాగే కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సినిమా కూడా అంతే ప్రత్యేకం. (సామజవరగమన పాటకు కేటీఆర్ ఫిదా) ఈ క్రమంలో తన తొలి సినిమా ‘గంగోత్రి’ డైరెక్టర్ రాఘవేంద్రరావు, తాజా సినిమా (అల వైకుంఠపురములో) దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి బన్నీ ఒకే ఫ్రేములో కనిపించాడు. ‘గంగోత్రి నుంచి అల వైకుంఠపురం వరకు ఒక్క ఫ్రేములో నా జర్నీ’ అంటూ బన్నీ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై అభిమానులు స్పందిస్తూ మీ శ్రమే మిమ్మల్నీ స్థాయిలో నిలబెట్టింది అని ఆకాశానికెత్తుతున్నారు. కాగా ఈ హీరో తాజా చిత్రం అల వైకుంఠపురములో టాలీవుడ్ రికార్డులను బద్దలు కొడుతూ బాక్సాఫీస్‌ను హోరెత్తిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో బన్నీ ఇటీవలే సినిమా దర్శకులందరికీ ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన బన్నీ సినిమాలు ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘జులాయి’ సినిమాలు సైతం హిట్‌ను సాధించాయి. ప్రస్తుతం బన్నీ, క్యూట్ హీరోయిన్ రష్మిక మందన్నాతో కలిసి సుకుమార్ డైరెక్షన్లో వస్తున్న చిత్రంలో నటించనున్నాడు. చదవండి: టాలీవుడ్ దర్శకులకు గ్రాండ్‌పార్టీ ఇచ్చిన బన్నీ అల్లు అర్జున్ టైటిల్ అది కాదా? -
నన్నలా తీర్చిదిద్దారు
‘‘నేను స్కూలు చదువులు చదివింది పెద్దగా లేదు కాబట్టి, అక్కడి గురువులు గురించి చెప్పలేను. నా 9వ ఏట నుంచి నన్ను వేలుపట్టి నడిపిస్తూ నాతో లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్ చేయించింది జిత్‌మోహన్ మిత్రాగారు. నా జీవితానికి దొరికిన అద్భుతమైన గురువు ఆయన. మిత్రాగారు చేసే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను మిమిక్రీ చేసేవాణ్ణి. ఆ విధంగా నాకు స్టేజ్ ఫియర్ లేకుండా, మాస్‌తో కనెక్ట్ అయ్యేవిధంగా నన్ను తీర్చిదిద్దింది మిత్రాగారే. అప్పట్లో నాకు 5 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. అదే నాకు వేలు, లక్షల కింద లెక్క. నేను ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా, ముందు మా గురువు పేరే చెబుతాను. ఇక సినిమా ఫీల్డ్ విషయానికొస్తే -కె.రాఘవేంద్రరావుగారు, రవిరాజా పినిశెట్టిగారు, ఈవీవీగారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారు, పూరి జగన్నాథ్ నన్ను ప్రతి దశలోనూ ఎంకరేజ్ చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో ఫేజ్‌లో నాకు అండగా నిలబడి, నా కెరీర్‌ని సుసంపన్నం చేశారు. అందుకే వాళ్లని కూడా నేను గురువులుగానే భావిస్తాను. - అలీ