నన్నలా తీర్చిదిద్దారు
నన్నలా తీర్చిదిద్దారు
Published Thu, Sep 5 2013 2:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
‘‘నేను స్కూలు చదువులు చదివింది పెద్దగా లేదు కాబట్టి, అక్కడి గురువులు గురించి చెప్పలేను. నా 9వ ఏట నుంచి నన్ను వేలుపట్టి నడిపిస్తూ నాతో లెక్కలేనన్ని ప్రోగ్రామ్స్ చేయించింది జిత్‌మోహన్ మిత్రాగారు. నా జీవితానికి దొరికిన అద్భుతమైన గురువు ఆయన. మిత్రాగారు చేసే అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో నేను మిమిక్రీ చేసేవాణ్ణి.
ఆ విధంగా నాకు స్టేజ్ ఫియర్ లేకుండా, మాస్‌తో కనెక్ట్ అయ్యేవిధంగా నన్ను తీర్చిదిద్దింది మిత్రాగారే. అప్పట్లో నాకు 5 రూపాయలు పారితోషికం ఇచ్చేవారు. అదే నాకు వేలు, లక్షల కింద లెక్క. నేను ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా, ముందు మా గురువు పేరే చెబుతాను.
ఇక సినిమా ఫీల్డ్ విషయానికొస్తే -కె.రాఘవేంద్రరావుగారు, రవిరాజా పినిశెట్టిగారు, ఈవీవీగారు, ఎస్వీ కృష్ణారెడ్డిగారు, పూరి జగన్నాథ్ నన్ను ప్రతి దశలోనూ ఎంకరేజ్ చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో ఫేజ్‌లో నాకు అండగా నిలబడి, నా కెరీర్‌ని సుసంపన్నం చేశారు. అందుకే వాళ్లని కూడా నేను గురువులుగానే భావిస్తాను.
- అలీ
Advertisement