
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ దర్శకులు కె. రాఘవేంద్రరావు సోదరుడు, నిర్మాత కోవెలమూడి కృష్ణమోహన్ రావు (81) అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. కృష్ణతో ‘భలే కృష్ణుడు’, మోహన్ బాబుతో ‘అల్లరి మొగుడు’, చిరంజీవితో ‘యుద్ధభూమి’, (చిరు నటించిన ‘ఇద్దరు మిత్రులు’ని రాఘవేంద్రరావుతో కలిసి నిర్మించారు) బాలకృష్ణతో ‘అపూర్వ సహోదరులు, మహేశ్‌బాబుతో ‘బాబీ’ తదితర చిత్రాలను కృష్ణమోహన్ రావు నిర్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు గురువారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణమోహన్ రావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment