krishna-guntur
-
ఎమ్మెల్సీ విజేత ఆర్కే
భారీ విజయం సొంతం చేసుకున్న రామకృష్ణ కేఎస్ లక్ష్మణరావుపై 1,763 ఓట్ల మెజారిటీ ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే స్పష్టమైన ఫలితం ఫలించిన మంత్రులు, టీడీపీ నేతల మంత్రాంగం గుంటూరు: కృష్ణా-గుంటూరు శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా డాక్టర్ ఏఎస్ రామకృష్ణ గెలుపొందారు. రామకృష్ణకు విజయం చేకూర్చే బాధ్యతను భుజాన వేసుకుని ప్రచారం చేసిన అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యూహం ఫలించి చివరకు విజయం వరించింది. ఈనెల 22న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ బుధవారం గుంటూరులోని సెయింట్ జోసఫ్ మహిళా బీఈడీ కళాశాలలో జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగింది. రెండు జిల్లాల పరిధిలో పోలైన 13,047 ఓట్లను డబ్బాలో పోసి అభ్యర్థులవారీగా వేరు చేసి 11 గంటలకు లెక్కింపు ప్రారంభించారు. ఇందుకోసం ఏర్పాటుచేసిన 14 టేబుళ్లలో జరిగిన ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో అన్నింటా రామకృష్ణే ఆధిక్యం కనబరిచారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అవసరం లేకుండానే రామకృష్ణ స్పష్టమైన మెజారిటీతో గెలుపొందారు. మొదటి నుంచి రామకృష్ణదే ఆధిక్యం.. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 18,931 ఓట్లకు గానూ 13,047 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఏఎస్ రామకృష్ణకు 7,146, కేఎస్ లక్ష్మణరావుకు 5,383 ఓట్లు వచ్చాయి. 1,763 ఓట్ల ఆధిక్యంతో రామకృష్ణ విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఏ అభ్యర్థికీ 50 శాతానికి మించి ఓట్లు రానిపక్షంలో ఎన్నికల సంఘ నిబంధనల ప్రకారం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టి విజయాన్ని నిర్ధారిస్తారు. అయితే, స్పష్టమైన మెజారిటీ రావడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అవసరం లేకుండాపోయింది. వెనుదిరిగిన లక్ష్మన్న.. మొదటి నుంచి గెలుపుపై ధీమాతో ఉన్న కేఎస్ లక్ష్మణరావు ఫలితం అధికారికంగా వెలువడక ముందే తన ఓటమిని అంగీకరించారు. ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే కౌంటింగ్ హాలు నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటా
కేఎస్ లక్ష్మణరావు స్పష్టీకరణ అవనిగడ్డ : కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తాను మరోసారి పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు స్పష్టం చేశారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో తనకు యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగనున్నానని వివరించారు. పోస్టుల కుదింపు విచారకరం... ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన డీఎస్సీ నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో ఏమాత్రం సంతోషం నింపలేకపోయిందని, పోస్టుల సంఖ్య కుదించడమే దీనికి కారణమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 10,600 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయాల్సి ఉండగా కేవలం 9,060 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం విచారకరమన్నారు. భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును ఇటీవల కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో వారంతా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. 58 నుంచి 60 సంవత్సరాలకు ఎయిడెడ్ ఉపాధ్యాయుల వయోపరిమితిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు యూటీఎఫ్ నాయకులతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యుడు వీ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎంతో భూమి..పనికొచ్చేది కొంతే సుమి!
జిల్లాలో మొత్తం 5.91 లక్షల ఎకరాలు పనికొచ్చేది 742.23 ఎకరాలు మాత్రమే ప్రభుత్వానికి ‘రెవెన్యూ’ నివేదిక అందజేత సాక్షి, విజయవాడ : జిల్లాలో లక్షలాది ఎకరాల భూములు ఉన్నప్పటికీ పనికొచ్చేవి మాత్రం వందల ఎకరాలే ఉన్నాయి. నివాసయోగ్యమైన భూములు మొదలుకొని అసైన్డ్ వరకు ఏ కేటగిరీలో ఏ మేరకు భూములు ఉన్నాయో రెవెన్యూ అధికారులు సమగ్రంగా వివరాలు సేకరించారు. ఈ మేరకు రెండు రోజుల క్రింతం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించారు. నూతన రాష్ట్రంలో రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం అన్వేషణ సాగిస్తున్న క్రమంలో అన్ని జిల్లాల్లో భూముల వివరాలను సేకరించి నివేదిక పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ వివరాల ఆధారంగా నూతన ప్రాజెక్టులకు భూములను కేటాయించనున్నారు. కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటవుతుందనే ప్రచారం జోరందుకోవడంతో భూముల వివరాల సేకరణలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో మొత్తం 5,91,304.54 ఎకరాల భూమి ఉంది. దీనిలో వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వం గతంలో లబ్ధిదారులకు కేటాయించిన భూములు, నివాస భూములు, వాణిజ్య సముదాయాలున్న భూములు 3,28,845.55 ఎకరాలున్నాయి. ఇవికాక 2,62,459.4 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. దీన్ని పూర్తిగా పనికిరాని భూమిగా రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. ఇక పనికొచ్చే భూమి కేవలం 742.23 ఎకరాలు మాత్రమే ఉంది. -
'కృష్ణా -గుంటూరు మధ్యే రాజధాని'
హైదరాబాద్ : కృష్ణా-గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చే అవకాశం ఉందని పట్టణాభివృద్ధి శాఖామంత్రి నారాయణ తెలిపారు. బుధవారం ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నందునే కృష్ణా-గుంటూరు మధ్యే రాజధానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాజధానికి 30 టీఎంసీల తాగునీటిని సమకూర్చుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. ఆ నీటిని రప్పించేందుకు కృషి చేస్తున్నామని నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా ముంపు సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ ఆగస్ట్ 10వ తేదీలోపు నివేదిక ఇవ్వనుంది.