కేఎస్ లక్ష్మణరావు స్పష్టీకరణ
అవనిగడ్డ : కృష్ణా-గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తాను మరోసారి పోటీ చేయనున్నట్లు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు స్పష్టం చేశారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో తనకు యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారని, పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో దిగనున్నానని వివరించారు.
పోస్టుల కుదింపు విచారకరం...
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నూతన డీఎస్సీ నోటిఫికేషన్ నిరుద్యోగుల్లో ఏమాత్రం సంతోషం నింపలేకపోయిందని, పోస్టుల సంఖ్య కుదించడమే దీనికి కారణమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు చెప్పారు. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో 10,600 ఉపాధ్యాయ పోస్టులు భర్తీచేయాల్సి ఉండగా కేవలం 9,060 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేయడం విచారకరమన్నారు. భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను మరింతగా పెంచాలని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావును ఇటీవల కోరినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు.
ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో వారంతా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పారు. 58 నుంచి 60 సంవత్సరాలకు ఎయిడెడ్ ఉపాధ్యాయుల వయోపరిమితిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు యూటీఎఫ్ నాయకులతో పాటు జిల్లా కార్యవర్గ సభ్యుడు వీ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉంటా
Published Sun, Dec 7 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM
Advertisement