జాతీయ విద్యాసంస్థలను సిద్ధం చేయండి: సీఎస్
హైదరాబాద్: రాష్ట్రంలో కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేయనున్న ఏడు జాతీయ విద్యాసంస్థల్లో సాధ్యమైనంత త్వరితంగా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అధికారులను ఆదేశించారు. జాతీయ విద్యాసంస్థలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్), విశాఖపట్నంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), పశ్చిమగోదావరి జిల్లాలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), అనంతపురంలో సెంట్రల్వర్సిటీ, విజయనగరంలో ట్రైబల్వర్సిటీల ఏర్పాటు చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీటి ప్రగతి గురించి విద్యాశాఖ కార్యదర్శి సుమితా దావ్రా వివరించారు.