Krishnarajapura
-
భలే కిలాడీ
ప్రియునితో కలిసి భర్తపై హత్యాయత్నం కృష్ణరాజపుర: భర్తను హత్య చేయించడానికి భార్య ప్రయత్నించిన ఘటన శనివారం కర్ణాటక కాడుగోడి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెళతూరులో జరిగింది. బెళతూరు గ్రామానికి చెందిన సోమశేఖర్‌కు అదే గ్రామానికి చెందిన సుధతో పదేళ్ల వివాహమైంది. ఈ క్రమంలో సుధకు కొద్దికాలం క్రితం అదే ప్రాంతానికి చెందిన అరుణ్‌తో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరి వ్యవహారం సుధ భర్త సోమశేఖర్‌కు తెలియడంతో కొద్ది కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి కూడా ఇదే విషయమై ఇరువురి మధ్య గొడవ జరగడంతో సుధ భర్త సోమశేఖర్‌ను హత్య చేయాలంటూ ప్రియుడు అరుణ్‌కు సూచించింది. దీంతో అరుణ్ శుక్రవారం రాత్రి పనిపై బయటకు వచ్చిన సోమశేఖర్‌పై తన సహచరులతో కలసి అరుణ్ ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో సోమశేఖర్ స్పృహ తప్పి పడిపోవడంతో సోమశేఖర్ మరణించాడని భావించిన నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సోమశేఖర్‌ను కే.ఆర్.పుర ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీలంటే మహా ఇష్టం..
కృష్ణరాజపుర : ఆమె మూడు అంతస్థుల భవనానికి యజమానురాలు. ఆస్తిపాస్తులున్నా చోరీలంటే మహా ఇష్టం. ఈక్రమంలో పాల ప్యాకెట్లు, కిటికీ కర్టన్ల, సోఫా కవర్లను చోరీ చేస్తూ కె.ఆర్.పోలీసులకు పట్టుబడింది. వివరాలు.. మేడహళ్లికి చెందిన మంజుల అదే ప్రాంతంలో మూడు అంతస్థుల భవనం నిర్మించింది. ప్రతీ నెలా వేలాది రూపాయల అద్దె లభిస్తుంది. అయినప్పటికీ ఇతరుల ఇళ్లల్లో అందిన వస్తువులను దోచుకెళ్లడం ఆమెకు అలవాటుగా మారింది. పాల ప్యాకెట్లు,సోఫా కవర్లు,కిటికీ స్క్రీన్లు తదితర వస్తువులను దోచుకెళ్లేది. మునియప్ప గార్డెన్ కు చెందిన సలీం అనే వ్యక్తికి చెందిన మారుతీ కారు, సోఫా కవర్లు, డైనింగ్ టేబుల్ కవర్లు తదితర వస్తువులు చోరీ చేసింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మంజులను అరెస్ట్ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.