చోరీలంటే మహా ఇష్టం.. | she is very interested to doing the thefts | Sakshi
Sakshi News home page

చోరీలంటే మహా ఇష్టం..

Published Thu, Apr 27 2017 10:17 AM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

చోరీలంటే మహా ఇష్టం..

చోరీలంటే మహా ఇష్టం..

కృష్ణరాజపుర : ఆమె మూడు అంతస్థుల భవనానికి యజమానురాలు. ఆస్తిపాస్తులున్నా చోరీలంటే మహా ఇష్టం. ఈక్రమంలో పాల ప్యాకెట్లు, కిటికీ కర్టన్ల, సోఫా కవర్లను చోరీ చేస్తూ కె.ఆర్‌.పోలీసులకు పట్టుబడింది. వివరాలు.. మేడహళ్లికి చెందిన మంజుల  అదే ప్రాంతంలో మూడు అంతస్థుల భవనం నిర్మించింది. ప్రతీ నెలా వేలాది రూపాయల అద్దె లభిస్తుంది.

అయినప్పటికీ  ఇతరుల ఇళ్లల్లో అందిన వస్తువులను దోచుకెళ్లడం ఆమెకు అలవాటుగా మారింది. పాల ప్యాకెట్లు,సోఫా కవర్లు,కిటికీ స్క్రీన్లు తదితర వస్తువులను దోచుకెళ్లేది. మునియప్ప గార్డెన్ కు చెందిన సలీం అనే వ్యక్తికి చెందిన మారుతీ కారు, సోఫా కవర్లు, డైనింగ్‌ టేబుల్‌ కవర్లు తదితర వస్తువులు చోరీ చేసింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం మంజులను అరెస్ట్‌ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement