Krsnastami
-
గోకులోత్సావం
-
మురిపాల మిఠాయిలు
ఎప్పటిలాగే ఆ రోజు కూడా శ్రీకృష్ణుడు ఇరుగుపొరుగు ఇళ్లలో నుంచి వెన్నపెరుగులు దొంగిలించి తిన్నాడు... అక్కడితో కడుపు నిండలేదు... అమ్మని మీగడ పాలు అడిగితే తిడుతుందని భయం వేసి... ‘అమ్మా! పాలు తాగితే జుట్టు పెరుగుతుందన్నావుగా, కడివెడు పాలు ఇవ్వవూ’ అని గోముగా అడిగాడు. అవి తాగినా కడుపు నిండలేదు... ‘అమ్మా! పాలుపెరుగులతో ఏవైనా కొత్త మిఠాయిలు చేసిపెట్టవూ’ అన్నాడు మురిపెంగా... చిన్నికృష్ణుని మాటలకు యశోద ముచ్చటపడింది. అంతే క్షణంలో కొత్త కొత్త వంటలు చేసింది... కన్నయ్యను ఒడిలో కూర్చోపెట్టుకుని ప్రేమగా తినిపించింది... పనీర్ ఖీర్ కావలసినవి: పాలు - ఒకటిన్నర కప్పులు; పనీర్ తురుము - అర కప్పు; కండెన్స్డ్ మిల్స్ - ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; ఏలకుల పొడి - అర టేబుల్ స్పూను; డ్రైఫ్రూట్స్ తరుగు - 3 టేబుల్ స్పూన్లు (బాదం, జీడిపప్పు, పిస్తా) తయారి: పెద్ద పాత్రలో పాలు, పనీర్ తురుము వేసి స్టౌ మీద సన్నని మంట మీద ఉంచి, ఆపకుండా కలుపుతూ, పాలను మరిగించాలి కండెన్స్డ్ మిల్క్ జత చే సి ఐదారు నిమిషాలు ఉంచి దించేయాలి ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ తరుగు వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో గంట సేపు ఉంచి తీసేయాలి పిస్తా తరుగు పైన చల్లి చల్లగా అందించాలి. చాకో స్వీట్ కావలసినవి: డార్క్ చాకొలేట్ తురుము - 75 గ్రా; పల్లీలు + బాదం పప్పులు - రెండు టేబుల్ స్పూన్లు; తురిమిన పనీర్ - 150 గ్రా (కాటేజ్ చీజ్); కాఫీ పొడి - అర టీ స్పూను; కోకో పొడి - టీ స్పూను; పంచదార పొడి - 75 గ్రా.; బాదం పప్పులు - 8; చాకో చిప్స్ - అలంకరిచండానికి తగినన్ని తయారీ: డార్క్ చాకొలేట్‌ను అవెన్‌లో ఒక నిమిషం ఉంచి కరిగించి బయటకు తీసి స్పూన్‌తో బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చాకొలేట్ మౌల్డ్‌లో పల్చగా ఒక పొరలా పోయాలి బాణలిలో పల్లీలు, బాదంపప్పులు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి ముక్కలుముక్కలుగా వచ్చేలా చేయాలి పనీర్‌ను పొడిపొడిలా చేసి రెండు నిమిషాలపాటు చేతితో మెత్తగా చేయాలి. పంచదార, కాఫీ పొడి, కోకో పొడి, పల్లీలు + బాదం పప్పుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాల్స్‌లా తయారుచేసి, చాకొలేట్ టార్ట్ మౌల్డ్స్‌లో ఉంచి, సుమారు అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి చాకో చిప్స్‌తో అలంకరించి చల్లగా అందచేయాలి. మావా కాజు శాండ్విచ్ కావలసినవి: మెత్తగా పొడి చేసిన కోవా - 150 గ్రా; పంచదార - 40 గ్రా; నెయ్యి - టీ స్పూను; ఖర్జూరాలు - 10 (పాలలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి); జీడిపప్పు పలుకులు - 3 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నూనె - కొద్దిగా తయారి: ఒక పాత్రలో కోవా పొడి, పంచదార వేసి స్టౌ మీద ఉంచి ముద్దలా అయ్యేవరకు కలిపి, దించి చల్లారాక ఈ మిశ్రమాన్ని రెండు ఉండలుగా (ఒకటి పెద్దది, ఒకటి చిన్నది) చేసి పక్కన ఉంచాలి బాణలిలో నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి కరిగాక, నానబెట్టి ఉంచుకున్న ఖర్జూరాలు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు కలపాలి ఏలకుల పొడి, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలిపి దించేయాలి ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకుని దాని మీద కొద్దిగా నూనె పూయాలి ఐదు అంగుళాల వెడల్పు, ఒక అంగుళం లోతు ఉన్న డబ్బా మూత తీసుకుని, అందులో ప్లాస్టిక్ షీట్ ఉంచాలి తయారుచేసి ఉంచుకున్న కోవా పెద్ద బాల్ తీసుకుని మూత మధ్యలో ఉంచి, చేతితో జాగ్రత్తగా అంచులు కూడా మూసుకునేలా ఒత్తాలి ఇప్పుడు కోవా మిశ్రమం మీద ఖర్జూరం మిశ్రమం ఉంచి, ఆ పైన చిన్న బాల్ పెట్టి గట్టిగా ఒత్తి పైన సిల్వర్ ఫాయిల్ ఉంచి, ఫ్రిజ్ లో పది నిమిషాలు ఉంచి తీసేయాలి ఎనిమిది సమాన భాగాలుగా కట్ చేసి అందించాలి. స్ట్రాబెర్రీ శ్రీఖండ్ కావలసినవి: నీరు పూర్తిగా తీసేసిన పెరుగు - కప్పు; మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు - అర కప్పు; క్రీమ్ - పావు కప్పు; పంచదార - 2 టీ స్పూన్లు; స్ట్రాబెర్రీలు - 2 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) తయారి: ఒక పాత్రలో ముందుగా పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి క్రీమ్, మెత్తగా చేసిన స్ట్రాబెర్రీల గుజ్జు జత చేసి మరోమారు కలిపి, మూడు గంటలసేపు ఫ్రిజ్‌లో ఉంచి తీసేయాలి స్ట్రాబెర్రీలతో అలంకరించి అందించాలి. (నాలుగు కప్పుల పెరుగును మూట గడితే ఒక కప్పు పెరుగు తయారవుతుంది) మలై పేడా కావలసినవి: చిక్కటి పాలు - రెండున్నర కప్పులు; పల్చటి పాలు - రెండున్నర కప్పులు; కుంకుమ పువ్వు - కొద్దిగా; నిమ్మ ఉప్పు - పావు టీ స్పూను; కార్న్ ఫ్లోర్ - 2 టీ స్పూన్లు (పల్చటి పాలలో వేసి కరిగించాలి); ఏలకుల పొడి - అర టీ స్పూను; పంచదార - 4 టీస్పూన్లు; పిస్తా పప్పులు - టీ స్పూను (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) తయారీ: నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలను పక్కన ఉంచి, మిగిలిన చిక్కటి పాలకు, పల్చటి పాలను జత చేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. అంచులకు అంటుకోకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. చిన్న పాత్రలో నాలుగు టీ స్పూన్ల చిక్కటి పాలు, కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి మూడు టేబుల్ స్పూన్ల నీళ్లలో నిమ్మ ఉప్పు వేసి కలిపి, మరుగుతున్న పాలలో చిలకరించాలి నీళ్లలో కరిగించిన కార్న్‌ఫ్లోర్, పంచదార వేసి బాగా కలిపి చూడటానికి కోవాలా అయ్యేవరకు ఉంచాలి కుంకుమ పువ్వు మిశ్రమం, ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించి, చల్లారనివ్వాలి ఈ మిశ్రమాన్ని పేడాలుగా చేసుకోవాలి పిస్తా తరుగుతో అలంకరించి, సుమారు గంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి, తీసిన పావు గంటకు అందించాలి ఇవి రెండు మూడురోజులు తాజాగా ఉంటాయి. సేకరణ: డా ॥వైజయంతి -
వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
విజయనగరం కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక కన్యకాపరమేశ్వరీ ఆలయంలో కొలువైన మురళీ కృష్ణ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. వేకువ జామున స్వామివారికి పంచామృతాభిషేకం, సహస్ర తులసీ దళార్చన పూజలు జరిపారు. శ్రీకృష్ణ మూలమంత్ర హోమాన్ని ఆలయంలో నిర్వహించారు. మోహన్ హోమ కార్యక్రమాన్ని జరిపారు. మహిళలు శ్రీకృష్ణ సంకీర్తనలు గానం చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలుగుకుండా దేవస్థానం సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ అర్చకుడు ఆరవిల్లి ఉమామహేశ్వరశర్మ పూజాకార్యక్రమాలను నిర్వహించారు. భక్తులకు ఉచితంగా ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బొబ్బిలి రూరల్: మండలంలో పలు గ్రామాల్లో గురువారం శ్రీకృష్ణ అష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిరిడి, కృష్ణాపురం,చింతాడ, కలువరాయి, కోమటపల్లి తదితర గ్రామాల్లో ఉదయం నుంచి చిన్ని కృష్ణుడుకి పూజలు నిర్వహించి, సాయంత్రం యువత ఉట్టికొట్టి వేడుకలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికలు వేషధారణలతో అందరినీ ఆకట్టుకున్నారు. రాత్రి వరకు వేడుకలు నిర్వహించి ఉట్టికొట్టిన విజేతలకు పలు ఆకర్షణీయ బహుమతులను ప్రదానం చేశారు. బొబ్బిలి టౌన్లో... బొబ్బిలి టౌన్ : పట్టణంలో వాడవాడల్లో శ్రీకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక యాదవ వీధిలో ఇటీవల ఏర్పాటు చేసిన శ్రీకృష్ణుని విగ్రహానికి ఆ వార్డు మాజీ కౌన్సిలర్ వైఎస్ఆర్ సీపీ నాయకులు బీసపు చిన్నారావు పూలమాల వేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్టణం నుంచి వందలాది మంది భక్తులు హాజర య్యారు. అనంతరం యాదవ వీదిలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. గీతా ధ్యాన మందిరంలో అష్ట ప్రహరి నగర సంకీర్తన పార్వతీపురం టౌన్ : స్థానిక జగన్నాథపురంలోని శ్రీ గీతా ధ్యానమందిరంలో రెండు రోజులుగా జరుగుతున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. దీనిలో భాగంగా గురువారం ధ్యానమందిరంలో ఒడిశాకు చెందినశ్రీ చైతన్య రామ్ యోగిచే అఖండ హరినామ సంకీర్తన పరిసమాప్తిని చేపట్టారు. దీనంలో భాగంగా గోకుల కృష్ణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం హరినామ సంకీర్తన లతో, బళ్లవేషధారణాలతో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు చింతల రామస్వామి సారధ్యంలో అఖండ నామ సంకీర్తన (అష్ట ప్రహరి)ని ప్రారంభించారు. దీనిలో భాగంగా ‘గోపాలకృష్ణుని’ అర్చన, పంచామృత అభిషేకం, హోమం, అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు. రాయగడకు చెందిన రాధాకృష్ణ మందిర సంకీర్తన బృందం, ఒడిశాలోని సంత సోరిపిల్లికి చెందిన బంకుతుల్య సంకీర్తన మండలి, కుంబారిపుట్టికి చెందిన నీలోఛక్రో సంకీర్తన మండలిచే ఏర్పాటు చేసిన 24 గంటల భజన కార్యక్రమంలో భాగంగా జగన్నాథపురం నుంచి పట్టణ ప్రధాన రహదారిలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని చేపట్టారు. రాధాకృష్ణుల వేషధారణలో ఊరేగింపు చేపట్టారు. బెలగాంలో... బెలగాం : స్థానిక పాఠశాలలు, ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వవిజ్ఙాన విద్యాలయం, ఆదిత్య పాఠశాలలో విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా చిన్నారులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. స్థానిక సాయినగర్ కాలనీలో ఉన్న సాయిబాబ మందిరంలో ఉట్టి కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నోరు తెరవరాకన్నయ్యా..!
‘ఊహూ’ అంటాడు, తల అడ్డంగా ఊపుతూ. చెవి మెలిపెడుతుంది తల్లి యశోద! ‘ఆ..’ అంటాడు. అంతే! యశోద నోరు తెరవాల్సి వస్తుంది! చిన్నారి కన్నయ్య నోట్లో... పదునాలుగు భువన భాండమ్ములు! ఆ ‘భాండమ్ము’లలో మిల్క్ మైసూర్‌పాక్, మలై పేడా, పనీర్ కలాకండ్, డ్రైఫ్రూట్ లడ్డూ, శ్రీఖండ్... ఉన్నాయని ‘భాగవతం’లో పోతన ప్రత్యేకంగా చెప్పలేదు కానీ... ఉండే ఉంటాయి. లిటిల్ కృష్ణకు పాలు, వెన్న ఇష్టం కదా! అందుకే ఈ కృష్ణాష్టమికి మనం... ఆయన పేరు చెప్పుకుని మిల్క్ స్వీట్‌ని నోట్లో వేసుకుందాం. జయకృష్ణా... ముకుందా... మురారీ.... డ్రైఫ్రూట్ లడ్డూ కావలసినవి: ఖర్జూరాలు, ఎండుకొబ్బరి, పుచ్చకాయ గింజలు, కర్బూజా గింజలు, పిస్తా, జీడిపప్పు, బాదంపప్పు... మొత్తం కలిపి అరకేజీ ఉండాలి. (నచ్చిన ఏ గింజలనైనా వాడుకోవచ్చు); బెల్లం - అరకేజీ; పటికబె ల్లం - మూడు టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను; నెయ్యి - టేబుల్ స్పూను. తయారి: డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. (పొడిలా అయిపోకూడదు) ఖర్జూరాలను బాగా సన్నగా కట్‌చేయాలి. మందపాటి పాత్రను స్టౌ మీద ఉంచి, అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కరిగాక, మంట తగ్గించి, డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి. ఖర్జూరం తరుగు, ఏలకుల పొడి, పటికబెల్లం వేసి వేయించి బాగా కలిశాక పక్కన ఉంచుకోవాలి. బెల్లం తురుము, రెండు టేబుల్ స్పూన్ల నీరు ఒక పాత్రలో వేసి బెల్లాన్ని కరిగించి వడబోస్తే, తుక్కు బయటకు పోతుంది. ఈ మిశ్రమానికి టేబుల్ స్పూన్ నెయ్యి జతచేయాలి. ఉండపాకం వచ్చేవరకు ఉంచాలి; పటికబెల్లం జతచేయాలి; ఈ మిశ్రమాన్ని డ్రైఫ్రూట్స్ మీద పోసి బాగా కలిపి మరోమారు స్టౌ మీద ఉంచి కాసేపు ఉడికించాలి; కిందకు దించి ఉండలు చేయాలి. శ్రీఖండ్ కావలసినవి పెరుగు - రెండు కప్పులు; చల్లటి పాలు - 2 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - చిటికెడు; పంచదార - అరకప్పు; జాజికాయ పొడి - చిటికెడు; ఏలకులపొడి - చిటికెడు; బాదంపప్పులు - 2 (గార్నిషింగ్ కోసం) తయారి: (గడ్డపెరుగు లేకపోతే, ఇంట్లో ఉన్న పెరుగును ఒక వస్త్రంలో వేసి మూట కట్టి, సుమారు నాలుగైదు గంటలు వేలాడదీయాలి. నీరంతా పోయి, గట్టి పెరుగు మిగులుతుంది) చిన్నపాత్రలో పాలు తీసుకుని, స్టౌ మీద ఉంచి గోరువెచ్చన చేసి, కిందకు దింపి, కుంకుమ పువ్వు జత చేసి బాగా కలిపి 5 నిముషాలు పక్కన ఉంచాలి. మరొక పాత్రలో పెరుగు, పంచదార వేసి బాగా కలపాలి. రెండూ బాగా కలిసేలా చిలకాలి. కుంకుమపువ్వు జతచేసిన పాలు కలపాలి. ఏలకులపొడి జత చేయాలి. గ్లాసులలో పోసి, బాదంపప్పులతో, కుంకుమపువ్వుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఖాయం కావలసినవి: బెల్లం తురుము - కప్పు; శొంఠి, పిప్పళ్లు, మిరియాలు, జీలకర్ర, వాము, కరక్కాయ - అన్నీ సమపాళ్లలో (కప్పు బెల్లంతో సమానంగా ఉండాలి); నెయ్యి - కప్పు తయారి: శొంఠి, పిప్పళ్లు... ఈ పదార్థాలను బాణలిలో దోరగా వేయించాలి. మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఒక పాత్రలో శొంఠి, పిప్పళ్ల... మిశ్రమం, బెల్లం తురుము వేసి బాగా కలపాలి. నెయ్యి జతచేస్తూ ఉండలు చేసుకోవాలి. (ఇది బాలింతలకు పథ్యంగా పెడతారు. ఈ ఖాయం శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పదార్థం) మిల్క్ మైసూర్‌పాక్ కావలసినవి: పాలపొడి - కప్పు; పంచదార - కప్పు; నీరు - అర కప్పు; మైదా - రెండు టేబుల్ స్పూన్లు; నెయ్యి - కప్పు; ఉప్పు - చిటికెడు. తయారి: ఒక పాత్రలో పంచదార, నీరు పోసి తీగపాకం వచ్చేవరకు స్టౌ మీద ఉంచాలి ఒక పాత్రలో పాలపొడి, మైదా, ఉప్పు, టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపి ఈ మిశ్రమాన్ని పంచదార పాకంలో వేసి, స్టౌ మీద ఉంచి రెండు మూడు నిముషాలు బాగా కలిపి మంట తగ్గించాలి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి జతచేసి, మరో మూడు నిముషాలు ఉంచాలి ఈ మిశ్రమం పాత్ర నుంచి విడివడుతుండగా మరో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి, మంట తగ్గించాలి ఒక పెద్ద ప్లేట్‌కి నెయ్యి రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి, బాగా చల్లారాక మనకు ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి. మలై పేడా కావలసినవి: కండెన్స్డ్ మిల్క్ - ఒక టిన్; పాలు - ఒకటిన్నర కప్పులు; కార్న్‌ఫ్లోర్ - టీ స్పూన్; సిట్రిక్ ఆసిడ్ - అర టీ స్పూను; ఏలకులపొడి - టీ స్పూన్; నెయ్యి - టేబుల్ స్పూన్; ఫుడ్ కలర్ (పసుపు రంగు) - నాలుగు చుక్కలు తయారి: పాన్ వేడి చేసి అందులో నెయ్యి వేసి కరిగించాలి కండెన్స్డ్ మిల్క్, పాలు, సిట్రిక్ ఆసిడ్ (కొద్దిగా నీటిలో వేసి బాగా కలపాలి) వేసి కలపాలి బాగా దగ్గరపడేవరకు ఆపకుండా కలుపుతుండాలి చిన్నపాత్రలో రెండు టేబుల్ స్పూన్ల నీరు పోసి అందులో కార్న్‌ఫ్లోర్ వేసి పేస్ట్‌లా కలిపి, పాల మిశ్రమంలో వేయాలి విడివడేవరకు బాగా కలుపుతుండాలి రంగునీరు జతచేయాలి పెద్ద ప్లేట్లోకి తిరగబోసి పేడాల మాదిరిగా తయారుచేయాలి ఏలకులపొడితో గార్నిష్ చేయాలి. పనీర్ కలాకండ్ కావలసినవి: తాజా పనీర్ - ముప్పావు కప్పు (ఉప్పు లేని పనీర్); పాలపొడి - 8 టేబుల్ స్పూన్లు; పంచదార - పావు కప్పు; తాజా క్రీమ్ - అర కప్పు; ఏలకులపొడి - రెండు టేబుల్ స్పూన్లు; బాదంపప్పులు - 10. తయారి అన్ని పదార్థాలను ఒక పాత్రలో వేసి స్టౌ మీద ఉంచి మంట తగ్గించి, ఆపకుండా కలుపుతూ సుమారు 15 నిముషాలు ఉంచాలి మిశ్రమం బాగా చిక్కబడ్డాక దించేయాలి ఒక ప్లేట్లో ఈ మిశ్రమాన్ని పోసి, సమానంగా పరిచి, చల్లారాక, నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేయాలి బాదం పప్పులతో గార్నిష్చేయాలి. (తాజా పనీర్ వాడితే మంచిది) సేకరణ డా.వైజయంతి