ksr
-
Analyst Vijay: బస్సులో జనాన్ని తరలించారు వాళ్లు చెప్పే సోది వినలేక పారిపోయారు
-
రఘురామరాజుకు ఒక రూల్? కృష్ణ రెడ్డికి ఒక రూలా?
-
ఒకవైపు డబ్బులు లేవు అంటారు.. మరోవైపు విలాసాలకు ఖర్చు పెడుతున్న కూటమి సర్కార్
-
అంకెల గారడీ చేస్తే ప్రజల ఆదాయం పెరిగిపోతుందా?
-
స్టార్ హోటల్లో IAS అధికారుల భార్యలు.. ప్రభుత్వం సిగ్గు పడాల్సిన విషయం
-
KSR LIVE Show: పోసానిపై కుట్ర.. బాబుకి టీచర్ల చెంప దెబ్బ
-
కృష్ణా జలాల వాటాపై తోడు దొంగలాట
-
AP MLC Results 2025: షాక్ లో టీడీపీ, జనసేన
-
పోసానికి 10 రోజుల రిమాండ్ విధించిన జడ్జి
-
రెడ్ బుక్ దెబ్బ జీవీ రెడ్డి అవుట్
-
అప్పుడు చెత్త పన్ను అంటూ ఏడ్చాడు ఇప్పుడు పిఠాపురంలో అదే చేస్తున్నాడు
-
ఆంధ్రప్రదేశ్ అప్పు లపై కూటమి సర్కారు తప్పుడు ప్రచారం
-
రాజకీయాల్లోకి రీ-ఎంట్రీ ప్రచారంపై చిరంజీవి క్లారిటీ
-
అసత్య కథనాలు అల్లుతున్న ఎల్లో మీడియా
-
మార్గదర్శి స్కాం దేశంలోనే చాలా పెద్దది: మిథున్ రెడ్డి
-
కిరణ్ రాయల్ చేసిన మోసాలపై ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేసిన లక్ష్మి
-
మహిళలపై పవన్ కు ఉన్న గౌరవం ఇదేనా? అని ప్రశ్నలు
-
డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ గూండాగిరి
-
తెలంగాణ రాజకీయాలో పద్మ వార్ : KSR
-
నాడు ఎన్టీఆర్‌కు జరిగిందే నేడు బాబుకు జరుగుతుందా ?
-
ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా కోడి పందేలు, జాదాలు
-
పండుగ పూట బీజేపీలో జనసేన విలీనం..!? బాలకృష్ణ వేధింపులు
-
ఎప్పుడు తొక్కిసలాటలు జరగలేదా!
-
రాష్ట్ర ప్రజలపై అమరావతి భారం
-
హైదరాబాద్- బెంగుళూరుకు ఇన్వెస్టర్లు వస్తున్నారని స్పష్టీకరణ
-
KSR: గ్రూప్ 2లో బాబు భజన
-
ప్రజలను మాయ చేసేందుకు విజన్ 2047 పేరుతో 420 డ్రామా
-
గుడి భూములనే వదలలేదు..బడి భూములు ఎంత..
-
నాగబాబుకు మంత్రి పదవి!
-
చంద్రబాబు చానా ముదురు..
-
చంద్రబాబు మరో డైవర్షన్...
-
సోషల్ మీడియా పోస్టులపై కేసులో విచారణకు వచ్చామంటూ హల్ చల్
-
టీడీపీ నేతలపై ఫిర్యాదు తీసుకోవడానికి వెనకాడారు: YSRCP నేతలు
-
ఏపీలో పోలీసులను అడ్డుపెట్టుకుని నిరంకుశత్వం
-
పవన్ సంచలన వ్యాఖ్యలు.. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కౌంటర్..
-
లడ్డు వ్యవహారం తరువాత తిరుమలలో బ్రాహ్మణుల పరిస్థితి
-
KSR: ఏపీ మహిళలకు బాబు బిగ్ షాక్.. ఒక సిలిండర్ మాత్రమే..!
-
మార్చి వరకు ఒకటే గ్యాస్
-
భవిష్యత్తు కోసం బాబు గారి ప్లానింగ్ అన్ని అమ్మేసి అస్సాం కు ఆంధ్రను..!
-
ఎన్నికల సమయంలో బాబు లోకేష్ లు విదేశాలకు వెళ్ళింది అందుకే
-
మద్యం మాఫియా సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే
-
KSR: న్యూస్ పేపర్స్ టాప్ హెడ్ లైన్స్
-
కేసీఆర్ కేజీ టు పీజీ కథ చెప్పి చేసిన మోసం
-
KSR : ఈరోజు ముఖ్యాంశాలు
-
అగ్గిపెట్టెలకు 23 కోట్లా..! లక్షకోట్ల స్టీలాప్లాంట్ స్కాం..
-
మోడీని బాగా పొగిడారు.. స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు అడగలేదు
-
ఈవీఎంలపై అనుమానాలు బలపర్చిన హర్యానా ఫలితాలు!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లపై మళ్లీ చర్చ మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ఫలితాలను అంగీకరించేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి తగ్గట్టుగానే కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సందర్భంగా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో కనిపించిన తేడాను విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు వీరు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన చోట్ల ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్ 70 శాతం మాత్రమే ఉంటే.. బీజేపీ గెలిచిన స్థానాల్లో 99 శాతం ఉండటం ఎలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని కేరళ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.హిస్సార్, మహేంద్ర ఘడ్, పానిపట్ జిల్లాలలో ఈవీఎం బ్యాటరీల ఛార్జింగ్ 99 శాతం ఉందని కాంగ్రెస్ గుర్తించింది. అంటే ఇక్కడ ఈవీఎంల టాంపరింగ్ జరిగిందన్న అభియోగాన్ని మోపుతున్నారు. నౌమాల్ అనే శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర సింగ్ ఈవీఎంల బాటరీ ఛార్జింగ్‌పై అభ్యంతరం చెబుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు కూడా. తొమ్మిది ఓటింగ్ యంత్రాల నెంబర్లు ఇస్తూ, వాటిలో బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. దీనిని బట్టి ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టాంపరింగ్ జరిగిందన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగి ఉంటే ప్రజాస్వామ్యానికి అది పెను ప్రమాదమే అవుతుంది. ఎన్నికలు ఒక ఫార్స్ గా మిగిలిపోతాయి.ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు గురి అవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో మాదిరే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితం ప్రజలను గందరగోళంలో పడేసిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా పలు ప్రజాస్వామ్య దేశాలలో ఈవీఎంలు వాడడం లేదని, పేపర్ బాలెట్నే వాడుతున్నారని, దేశంలోనూ పేపర్ బాలెట్ రావాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన దేశానికి మార్గదర్శకత్వం వహించారని అనుకోవాలి.ఏపీలో ఈవీఎంల టాంపరింగ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈ ఆరోపణలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు కాని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా మాక్ ఓటింగ్ చేస్తామంటూ ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా వ్యవహరించారు. ఉదాహరణకు ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల డేటానున వీవీప్యాట్ స్లిప్‌లతో పోల్చి చూపాలని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకు అవసరమైన ఛార్జీలను కూడా చెల్లించారు. కానీ ఈ పని చేయాల్సిన ఎన్నికల అధికారులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేసేందుకు ప్రయత్నించారు. అభ్యర్థి అంగీకరించక పోవడంతో కొత్త డ్రామాకు తెరలేపుతూ.. వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని నమూనా ఈవీఎంలో మాక్ పోలింగ్ జరుపుతామని ప్రతిపాదించారు. ఇందుకు వైసీపీ అభ్యర్థి ససేమిరా అన్నారు. హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదాలు జరిగాయి. తీర్పు రిజర్వులో ఉంది. చిత్రంగా రెండు నెలలు అయినా తీర్పు వెలువడలేదు. ఈ పరిణామాలన్నీ ప్రజల సందేహాలకు మరింత బలం చేకూర్చాయి.విజయనగరం జిల్లాలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి అప్పల నరసయ్యలు కూడా బాలినేని మాదిరిగానే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. కానీ ఫలితం మాత్రం తేల లేదు. అధికారులు వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని భీష్మించుకున్నారు. మరోవైపు పోలింగ్ జరిగిన రెండు నెలలైనా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అధికారులు తమకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవంటూ తప్పించుకున్నారు. ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల ఏదో మతలబు ఉందని చాలామంది అభిప్రాయపడే స్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈవీఎంల మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు చేశారు. అందుకు తగ్గ ఉదాహరణలూ ఇచ్చారు. ఈ సందేహాలన్నింటిపైఎన్నికల సంఘం తగిన వివరణ ఇచ్చి ఉంటే అనుమానాలు బలపడకపోవును. ఇంకోపక్క వీవీప్యాట్ స్లిప్‌లను పోలింగ్ తరువాత 45 రోజుల పాటు భద్రపరచాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కాదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులు పది రోజులకే స్లిప్‌లు దగ్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.వీవీప్యాట్ స్లిప్‌లు ఉండీ ప్రయోజనం ఏమిటి?లెక్కించనప్పుడు వివిపాట్ స్లిప్‌ల రూపంలో ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అన్న ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తూ జవాబిచ్చేందుకు నిరాకరించడం ఎంత వరకూ సబబు?హర్యానా అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని ఢంకా భజాయించి మరీ చెప్పాయి. ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చూచాయగా కూడా చెప్పలేదు. బీజేపీకి మద్దతిచ్చే జాతీయ ఛానళ్లు కూడా ఇదే మాట చెప్పాలి. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఫలితాలు బీజేపీకి అనుకాలంగా రావడం గమనార్హం.కౌంటింగ్ మొదలైన తరువాత గంటన్నర పాటు కాంగ్రెస్ పార్టీ 20 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తరువాత బీజేపీ చాలా నాటకీయంగా పుంజకోవడమే కాకుండా.. మెజార్టీ మార్కును దాటేసింది కూడా. కౌంటింగ్ సందర్భంగా ఆయా రౌండ్ల ఫలితాల వెల్లడి విషయంలోనూ ఎన్నికల సంఘం చాలా ఆలస్యం చేసిందని, దీని వెనుక కూడా కుట్ర ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది.ప్రజలు నిజంగానే ఓటేసి బీజేపీని గెలిపించి ఉంటే అభ్యంతరమేమీ ఉండదు కానీ.. ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది. ఏపీలో ఇదే తరహా పరిణామాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ వంటివారు స్పందించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ నైతికంగా వ్యవహరించినట్లు అయ్యేది. తాజా పరిణామాలతో తన వాదనను బలంగా వినిపించే అవకాశమూ దక్కేది. అప్పట్లో సందీప్ దీక్షిత్ అనే కాంగ్రెస్ నేత ఏపీలో ఓట్ల శాతం పెరిగిన వైనం, ఈవీఎం ల తీరుపై విమర్శలు చేసినా, వాటికి ఈసీ స్పందించలేదు. ఇంకా పెద్ద స్థాయి నేతలు మాట్లాడి ఉండాల్సింది.ట్యాంపరింగ్ సాధ్యమేనా?సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేపథ్యంలో ఈవీఎంల టాంపరింగ్ పెద్ద విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. కానీ ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం మానేసి, కేంద్రంలో ఉన్న పార్టీకి తొత్తుగా పనిచేస్తోందన్న విమర్శలు ఎదుర్కుంటోంది. టాంపరింగ్ అవకాశం ఉంటే జమ్ము-కాశ్వీర్ లో కూడా జరిగేది కదా అని కొందరు వాదిస్తున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, అన్ని చోట్ల చేయాలని లేదు. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతం కనుక కేంద్ర పెత్తనం అక్కడ ఎలాగూ సాగుతుంది. కానీ ఉత్తర భారత దేశం మధ్యలో ఉండే హర్యానాలో బీజేపీ ఓటమి పాలైతే దాని ప్రభావం పరిసర రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉందని భయపడి ఉండవచ్చని, అందుకే సెలెక్టివ్‌గా టాంపరింగ్ జరిగి ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది.2009 ముందు వరకు ఈవీఎంలపై ఆరోపణలు పెద్దగా రాలేదు. 2009లో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడమే కాకుండా, టాంపరింగ్ ఎలా చేయవచ్చో, కొందరు నిపుణుల ద్వారా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. 2014లో ఆయన విభజిత ఏపీలో గెలిచిన తరువాత మాత్రం దీని ప్రస్తావనే చేయలేదు. 2019లో ఓటమి తర్వాత ఈవీఎంలపై కోర్టుకు వెళ్లిన వారిలో ఈయన కూడా ఉన్నారు.ఆ క్రమంలోనే సుప్రీం కోర్టు వీవీప్యాట్ స్లిప్ లపై మార్గదర్శకాలు ఇచ్చింది. అయినా సరే ఎన్నికల అధికారులు వాటిని పట్టించుకోకపోవడం విశేషం. 2024లో టీడీపీ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఈవీఎంల టాంపరింగ్ ఊసే ఎత్తలేదు. పలు ఆరోపణలు వస్తున్నా, వారు కిమ్మనకపోవడం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రజలలో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పవచ్చు.ఈసీ ప్రజల సంశయాలు తీర్చకుండా ఇప్పటిలాగానే వ్యవహరిస్తే దేశంలో ఎవరూ ఎన్నికలను నమ్మని పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తాయి. భవిష్యత్తులో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలలో ఈ సమస్య మళ్లీ ముందుకు రావచ్చు. 2029 లోక సభ ఎన్నికలు బాలెట్ పత్రాలతో జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు కేంద్రం అంగీకరించకపోతే ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉంటుందా అన్నది అప్పుడే చెప్పలేం. బ్యాలెట్ పత్రాల పద్దతి ఉంటే రిగ్గింగ్ జరగదా? జరగదని చెప్పజాలం.1972 లో పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ సీపీఎం ఎన్నికలను బహిష్కరించింది. ఆ తర్వాత 1978 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు సీసీటీవీల వ్యవస్థ వచ్చింది కనుక బ్యాలెట్ పత్రాల రిగ్గింగ్‌ను కొంతమేర నిరోధించవచ్చు. ఈవీఎంల వ్యవస్థ వల్ల సులువుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా, వాటిని మానిప్యులేట్ చేస్తున్నారని జనం నమ్మితే మాత్రం ఈవీఎంలు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు అవుతుంది. ఏది ఏమైనా ఈవీఎంల టాంపరింగ్ కు అవకాశం లేని టెక్నాలజీని వాడాలి. లేదా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడమే మంచిది కావచ్చు. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హర్యానా ఫలితాలు బయట పెట్టిన నిజం..
-
అధికార మదం తలకెక్కితే.. జస్టిస్ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు
-
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై కొమ్మినేని రియాక్షన్..
-
KSR Live Show: విద్య వద్దు.. మద్యం ముద్దు
-
వందరోజుల్లో చంద్రబాబు.. పచ్చి అబద్ధాలు, కుట్రలు.. నెవ్వర్ బిఫోర్ - ఎవ్వర్ ఆఫ్టర్
-
జానీ మంచి కళాకారుడు..!
-
మచ్చ లేని మహా నాయకుడు అతని మృతి దేశానికే తీరని లోటు
-
బాబు బోట్ల ఎపిసోడైపై కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు..
-
KSR: కృష్ణలంకను కాపాడిన జగన్..
-
రాష్ట్రం మునిగిపోతుంటే.. చంద్రబాబు నిద్రపోతున్నాడు
-
బాబూ తాళాలు ఎక్కడ?
-
మార్గదర్శికి హైకోర్టు భారీ షాక్
-
రోజుకు 405 కోట్లు అప్పు KSR చంద్రబాబు సరికొత్త రికార్డు
-
సాయిరెడ్డిపై ఎల్లో కుట్ర.. బాబు పిచ్చి ( శ్వేత ) పత్రం
-
గురువు కోసం రేవంత్ నీచ రాజకీయాలు
-
YSRCP ఓటమిపై పిచ్చి కూతలు.. రేవంత్ రెడ్డికే భారీ నష్టం
-
చంద్రబాబు, లోకేష్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు
-
టీడీపీ సర్కార్ పై NBDA సీరియస్
-
గెలిచేది జగనే ..ఎందుకంటే..
-
కూటమి ఓటమిని ఒప్పుకున్న ABN రాధాకృష్ణ
-
పిన్నెల్లి వీడియో ముందు ఏం జరిగింది..?
-
తెలంగాణలో సన్నబియ్యం రాజకీయం..
-
KSR : సన్నబియ్యం రాజకీయం..! ఎవరి వాదన కరెక్ట్ ?
-
రామోజీ ఈ వయసులో ఇదేం పని... ఇప్పటికైనా మారకపోతే..
-
వైఎస్ జగన్ విస్పష్ట సందేశం
-
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
-
మోదీ వ్యాఖ్యలకు కొమ్మినేని కౌంటర్..
-
పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్
-
సీఎం రమేష్ ను కలవడంపై కొమ్మినేని విశ్లేషణ
-
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
-
విలవిల లాడిన వృద్ధులు.. 30 మందికిపైగా మృతి..!
-
పవన్ కళ్యాణ్ ఊగిపోయే స్పీచ్ కి కొమ్మినేని అదిరిపోయే సెటైర్లు
-
భువనేశ్వరి తిట్ల దండకం.. ఇదే అసలు నిజం
-
నారా భువనేశ్వరి ఆడియోపై కొమ్మినేని షాకింగ్ కామెంట్స్
-
నా చెల్లెళ్ళు అంటూ పద్దతిగా మాట్లాడారు.. అది సీఎం జగన్ సంస్కారం..!
-
ముస్లిం రిజర్వేషన్లపై పచ్చ పత్రికలకు పెద్ద కష్టం.. కొమ్మినేని విశ్లేషణ...
-
బస్సు యాత్ర దెబ్బకు రామోజీ కి మైండ్ బ్లాక్
-
పెళ్ళాం అనే పదం తప్పయితే పవన్ కు రాజీవ్ కౌంటర్
-
తానా సభల పేరుతో అమ్మాయిలను.. కోమటి జయరాం చరిత్ర ఇది
-
మట్టి మనుషులు వెధవలంట.. ఓటర్లను కొనేస్తారంట..!
-
రాయి వేసిన దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న బోండా ఉమా
-
సీఎం రమేష్ మీటింగ్ పై కొమ్మినేని కామెంట్స్
-
చంద్రబాబు సెల్ఫ్ గోల్..!
-
సీఎం జగన్ ను హత్య చేసేందుకే..రిమాండ్ రిపోర్ట్ నిజాలు..!
-
పవన్ కళ్యాణ్ చాలా హానికరం.. సీఎం జగన్ దాడిపై కొమ్మినేని షాకింగ్ నిజాలు
-
షర్మిలతో చాలా నష్టం..!
-
ఇక రామోజీరావు తప్పించుకోలేడు.. కొమ్మినేని కామెంట్స్
-
రామోజీ రావు సుప్రీం కోర్టు తీర్పుపై కొమ్మినేని విశ్లేషణ
-
చంద్రబాబు, షర్మిల.. చిత్ర విచిత్ర విన్యాసాలు: KSR
-
చంద్రబాబు విధ్వంసం.. వాలంటీర్ వ్యవస్థ ధ్వంసం
-
"జనసైనికులు బ్లేడ్ బ్యాచ్..?" ఘోరంగా అవమానించిన పవన్
-
పురందేశ్వరిని అడ్డుపెట్టుకొని చంద్రబాబు కొత్త పన్నాగం
-
ఈనాడు చెత్త రాతలకి కొమ్మినేని అదిరిపోయే కౌంటర్
-
చంద్రబాబు వ్యాఖ్యలపై BJP నేతల్లో తీవ్ర అసహనం
-
కడప ఎంపీగా రఘురామ కృష్ణంరాజు పోటీ ?
-
రామోజీరావు,ABN రాధాకృష్ణ బట్టలు విప్పుకొని తిరగడమే: KSR
-
జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యలుకు కొమ్మినేని స్ట్రాంగ్ కౌంటర్
-
వంగా గీతను బ్రతిమిలాడినా పవన్ కొమ్మినేని షాకింగ్ విషయాలు
-
ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పేపర్ ఫేక్ న్యూస్ పై KSR విశ్లేషణ
-
ఈనాడు న్యూస్ పేపర్స్ టాప్ హెడ్ లైన్స్
-
ఆ ఒక్క కారణంతో సూరికి టికెట్ ఇవ్వలేదు
-
ఏపీలో ఒకే విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ ఎన్నికలు
-
పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయం: KSR
-
ఈనాడు మరియు ఆంధ్రజ్యోతి పేపర్ ఫేక్ న్యూస్ పై KSR విశ్లేషణ
-
బయటపడ్డ ప్రశాంత్ కిషోర్ కుట్ర కోణం..!
-
కాపులను బాబుకు బానిసలుగా ఉండాలంటున్న పవన్
-
మాటలని మొహం చూపించటానికి సిగ్గు లేని బాబు
-
పవన్ కు ముద్రగడ లేఖ పై కొమ్మినేని విశ్లేషణ
-
బూతులు తిట్టిన వారికే టికెట్స్ ఇచ్చిన బాబు: KSR
-
KSR: ఆరోగ్యానికి హానికరం చంద్రబాబు, పవన్
-
లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి మాస్టర్ ప్లాన్...?
-
రామోజీరావుని దేవుడు కూడా కాపాడలేడు
-
చంద్రబాబు,పవన్ కళ్యాణ్ కి అసలు సినిమా మొదలైంది.
-
సిద్ధం సభపై ఈనాడు పిచ్చి రాతలు.. రామోజీపై కొమ్మినేని ఫైర్..!
-
KSR Live Show: పవన్ కు సీఎం పదవి?
-
మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలకు కొమ్మినేని స్ట్రాంగ్ కౌంటర్
-
పూర్తిగా మైండ్ దొబ్బింది ఫైనల్ స్టేజ్ లో చంద్రబాబు
-
స్విచ్ లో చంద్రబాబు టంగ్ స్లిప్
-
రేవంత్‌తో కలసి సీఎం జగన్ పై కుట్ర ?
-
పెళ్లి ఒక్కడితో సంసారం ఇంకొకడితో కొమ్మినేని కామెంట్స్
-
షర్మిలకు స్థిమితం లేదు: బీజేపీ నేత
-
షర్మిల గురించి మనం అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు
-
చరిత్రలో ముందెన్నడు లేని రీతిలో మద్దతు ధర
-
టుడే న్యూస్ పేపర్ టాప్ హెడ్ లైన్స్
-
పెద్ద తప్పు చేస్తున్నారు..షర్మిల పై KSR ఫైర్
-
ఎల్లో మీడియా చెత్త రాతలపై కొమ్మినేని సంచలన వ్యాఖ్యలు
-
100 రోజుల వలస పక్షి..షర్మిల వ్యాఖ్యలపై కొమ్మినేని రియాక్షన్
-
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించిన కొమ్మినేని శ్రీనివాసరావు
-
బాబు బరువు తగ్గారంటూ పచ్చ అబద్ధం
-
పక్క పార్టీల పథకాలు కాపీ కొడుతున్న చంద్రబాబు..!
-
పచ్చ విషం గక్కడమే పనిగా పెట్టుకున్నరామోజీరావు
-
స్టేల బాబుపై కేఎస్ఆర్ కామెంట్..
-
కెఎస్ఆర్ లైవ్ షో @ 14 అక్టోబర్ 2022
-
KSR కామెంట్ : హరీష్ రావు వ్యాఖ్యలపై కేఎస్ఆర్...
-
కెఎస్ఆర్ లైవ్ షో 10 September 2022
-
కెఎస్ఆర్ లైవ్ షో @ 05 September 2022
-
ఏది నిజం?
-
కెఎస్ఆర్ లైవ్ షో 14 September 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 01 September 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 14 July 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 13 July 2021
-
కెఎస్ఆర్ లైవ్ షో 23 June 2021
-
ఏపీ బీజేపీని వదలని అయోమయం!
దివంగత తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుకు తన కుటుంబం వల్ల అవమానాలు ఎదురైతే, ఆయన వల్ల మాత్రం కుటుంబ సభ్యులు మంచి గౌరవమే పొందగలుగుతున్నారు. తాజాగా ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి పొందడం విశేషం. గతంలో తెలుగుదేశంలో సంక్షోభం వచ్చినప్పుడు పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావు తొలుత చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. అప్పట్లో దగ్గుబాటికి ఉప ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు ఆఫర్ చేసి ఎగవేశారు. దాంతో కొద్ది కాలానికే వెంకటేశ్వరరావు మళ్లీ ఎన్.టి.రామారావు వైపునకు వచ్చారు. కానీ రామారావు మరణించడంతో ఎన్టీఆర్ టీడీపీ(లక్ష్మీపార్వతి) తరపున రాజ్యసభకు దగ్గుబాటి ఎన్నికయ్యారు. తదుపరి మళ్లీ టీడీపీలోకి రావాలని ఆయన యత్నించారు కానీ, చంద్రబాబు రానివ్వలేదు. తదుపరి కొంతకాలం దగ్గుబాటి బీజేపీతో అనుబంధం పెట్టుకున్నా, అనూహ్యంగా కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఆ సమయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కీలక భూమిక పోషించేవారు. ఆయన పురందేశ్వరిని కూడా రాజకీయాలలోకి తీసుకు రావాలని, బాపట్ల నుంచి ఎంపీగా పోటీచేయించాలని ప్రతిపాదించారు. దాంతో భర్త పర్చూరు నుంచి అసెం బ్లీకి పోటీచేయగా, పురందేశ్వరి కాంగ్రెస్ పక్షాన బాపట్ల నుంచి, ఆ తర్వాత విశాఖపట్నం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆమె మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో సభ్యురాలు అయ్యారు. మంచి గౌరవమే పొందారు. కానీ ఉమ్మడి ఏపీ విభజన సమయంలో పురందేశ్వరి, కావూరి సాంబశివరావు వంటి వారు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలోకి వచ్చారు. అప్పట్లో ఆమెకు విశాఖ సీటు ఇవ్వడానికి బీజేపీ, టీడీపీ కూటమి అంగీకరించలేదు. అది కాకపోయినా గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు లోక్‌సభ స్థానాలలో ఏదో ఒకటి కేటాయించాలని ఆశించారు. కాని వాటికి కూడా చంద్రబాబు, అప్పట్లో బీజేపీలో ముఖ్యుడుగా ఉన్న మరో నేత ఒప్పుకోలేదని అంటారు. దాంతో చివరికి ఆమె రాజంపేట నుంచి పోటీచేసి పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దాంతో రాజకీయంగా ఆమె వెనుకబడినట్లయింది. కాని పార్టీ నాయకత్వం వారు బీజేపీ మహిళా మోర్చా ఇన్చార్జీ పదవిని ఆమెకు ఇచ్చారు. ఆ తర్వాత 2019లో విశాఖపట్నం నుంచి బీజేపీ తరపున పురందేశ్వరి పోటీచేసినా డిపాజిట్ కోల్పోవలసి వచ్చింది. తదుపరి ఆమె రాష్ట్ర పార్టీలో క్రియాశీలకంగానే ఉన్నా, ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం ద్వారా ఆమెకు మంచి గుర్తింపే ఇచ్చినట్లయింది. దానికి పలు రకాల కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు. వెంకటేశ్వరరావు గత ఎన్నికలలో వైఎస్సార్ సీపీ తరపున అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన అంత క్రియాశీలంగా లేరు. ఈ నేపథ్యంలో మళ్లీ పురందేశ్వరికి రాజకీయంగా బీజేపీలో ప్రాధాన్యత కొంత పెరిగింది. తెలంగాణలో సామాజిక సమీకరణల మాదిరే ఏపీలో కూడా అక్కడ ఉన్న సామాజికవర్గాల సమీకరణను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఈమెకు ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చని భావిస్తున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించగా, ఆయన పార్టీ భావజాలం, రాజకీయ పరిస్థితులు అన్నటిని గమనంలోకి తీసుకుని పనిచేస్తున్నారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతిని ఆయన ఇప్పటికీ ఎండగడుతున్నారు. టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో 7,200 కోట్లు ఖర్చు పెడితే అందులో జరిగిన అవినీతిని తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈయనకు ముందు అధ్యక్షుడుగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పూర్తిగా టీడీపీ ట్రాప్‌లో పడిపోయి రాజకీయంగా దెబ్బతిన్నారన్న విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఈ తరుణంలో పురందేశ్వరి నియామకం ద్వారా కమ్మ సామాజికవర్గాన్ని కొంత మేర ఆకట్టుకోవాలన్నది కేంద్ర బీజేపీ పెద్దల భావనగా చెబుతున్నారు. కాని పురందేశ్వరి ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఇచ్చిన తొలి ఇంటర్వూ్యలో ఆమె చేసిన వ్యాఖ్యలు పార్టీని ఆత్మరక్షణలో పడేశాయన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రత్యేకించి అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలన్నది పార్టీ నిర్ణయం అని చెప్పడం ద్వారా ఆమె విమర్శలకు గురవుతున్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చే పత్రికకు ఇంటర్వూ్య ఇవ్వడం, అందులో ఆమె టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారేమో అన్న అభిప్రాయం కలిగేలా కథనం ఉండడం విమర్శలకు దారి తీస్తోంది. మొదటి ఇంటర్వూ్యలోనే ఆమె రాజకీయ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లు అనిపిస్తుంది. ఆమె రాయలసీమలోని రాజంపేటనుంచి గతంలో పోటీచేసిన విషయాన్ని విస్మరించారు. ఆమె తండ్రి ఎన్టీఆర్‌ను రాయలసీమ విశేషంగా ఆదరించింది. హిందూపూర్‌లో ఎన్టీఆర్ మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికైతే, ఆ తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణను ఒకసారి, మరో సోదరుడు బాలకృష్ణను రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకుని ఆ ప్రాంతం గౌరవించింది. అది ఒక కోణం అయితే బీజేపీ ఇప్పటికీ హైకోర్టును కర్నూలులో పెట్టాలని కోరుకుంటోంది. కానీ పురందేశ్వరి వ్యాఖ్యలు మాత్రం బీజేపీ కన్నా టీడీపీకి ఉపయోగపడేవిగా మారినట్లు కనిపించాయి. రాయలసీమలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని, సీఎం కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలన్న బీజేపీ నేతలు చేసిన డిక్లరేషన్‌లో ఆమె భాగస్వామిగా ఉండి ఉండాలి. ఈ పరిస్థితిలో రాయలసీమను గౌరవించే విధంగా ఆమె వ్యాఖ్యానించి ఉండాల్సింది. అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని కోరుకున్న ఆమె ఆ రాజధానికి కావల్సిన లక్ష కోట్ల రూపాయల నిధులను కేంద్రం నుంచి తెప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇవ్వగలరా? పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి వీలు లేదన్న టీడీపీ వాదనతో ఆమె కూడా ఏకీభవిస్తున్నారా? అమరావతి కుంభకోణంపై సోము వీర్రాజు వ్యాఖ్యలతో ఆమె ఏకీభవిస్తున్నారా? లేదా?మూడు రాజధానుల అంశంపై కేంద్రం జోక్యం చేసుకోబోదని, అది రాష్ట్రం ఇష్టమని ఇప్పటికే ప్రకటన వచ్చింది. కాని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారు ఇలా మాట్లాడడం ద్వారా బీజేపీ డబుల్ గేమ్ ఆడుతోందన్న విమర్శకు ఆస్కారం ఇస్తోంది. పైగా, బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో మూడు రాజధానులు ఎందుకు ఉన్నాయో ఆమె వివరణ ఇవ్వాలి. పలు రాష్ట్రాలలో హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీలు వంటివి వేర్వేరుగా ఉన్న విషయం కూడా గుర్తు చేసుకోవాలి. కేంద్రంలో కానీ, పార్లమెంటులో కానీ బీజేపీకి వైఎస్సార్సీపీ ఇస్తున్న మద్దతును విస్మరించి మాట్లాడడం అంటే రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమే అవుతుంది. కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను మెచ్చుకున్న సంగతి ఆమె విస్మరించారు. మరో కేంద్ర మంత్రి ఆర్.కె. సింగ్ ఏపీలో అమలు అవుతున్న స్కీములు దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. కాని ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా మాట్లాడడం ద్వారా సమతుల్యతను కోల్పోయారు. ఇప్పుడు ఆమె లక్ష్యం వైసీపీనా, టీడీపీనా?అన్నది నిర్ణయించుకోవాలి. ఏపీలోనే ఆమె కేంద్రీకరించదలిస్తే సరైన వ్యూహం ఉండాలి. అవేమీ లేకుండా ఆమె మాట్లాడారు. టీడీపీని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించకుండా కేవలం వైసీపీని, ఆ పార్టీ తీసుకున్న విధాన పరమైన నిర్ణయాలను టీడీపీ మీడియాలో విమర్శించడం ద్వారా ఆమె జాతీయ నాయకురాలిగా కాక జాతి నేతగానే వ్యవహరించారంటూ వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్య కొంత తీవ్రంగానే ఉన్నప్పటికీ, అందుకు ఆమె అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఆమె ఏపీ గురించి సోయతోనే మాట్లాడారా అన్న ప్రశ్న కూడా వస్తుంది. గతంలో ఆమె తండ్రి ఎన్.టి.రామారావుకు వ్యతిరేకంగా అనేకసార్లు కోర్టు తీర్పులు వచ్చినప్పుడు అవి ఆరుకోట్ల ప్రజలకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పులు అని ఆయన వ్యాఖ్యానించిన సంగతి పురందేశ్వరికి గుర్తు ఉండకపోవచ్చు. అంతేకాదు. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలతో సహా మరికొందరిపై ఏసీపీ కేసు రావడం, వాటిని ప్రచారమే చేయకూడదని ఏపీ హైకోర్టు తీర్పు వంటివాటిని కూడా జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పురందేశ్వరి సమర్థిస్తారా? లేదా అన్నది చెప్పాలి. ఒక వేళ ఆమె వాటిపై తన అభిప్రాయాలు చెబితే, ఆ పత్రిక వేయకపోతే ఆ విషయం అయినా ఆమె వెల్లడించాలి. లేకుంటే ఏపీలో బీజేపీని పైకి తీసుకురావడంతో పురందేశ్వరి ఏదైనా పాత్ర పోషిస్తారనుకున్నవారికి ఆమె నిరాశే మిగిల్చినట్లవుతుంది. అమరావతి రాజధాని ఒకటే ఉండాలని ప్రచారం చేయడం ద్వారా ఆమెకు వ్యక్తిగతంగా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయేమో తెలియదు. కాని రాజకీయంగా వైసీపీని ఇరుకున పెట్టాలని చెబితే మాత్రం ఆమె సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది. పురందేశ్వరి ఇలాగే రాజకీయం కొనసాగిస్తే, అటు సామాజికవర్గాన్ని ఆకట్టుకోలేక, ఇటు వ్యూహం లేకుండా టీడీపీవారికి ,ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియాకు కరసాధనంగా మాత్రమే ఉపయోగపడితే ఆమెకు రాజకీయంగా ఒరిగేది శూన్యమే అవుతుందని చెప్పకతప్పదు. ఏది ఏమైనా ఒకటి మాత్రం వాస్తవం. ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేయడం ద్వారా ఆయన పరువును గంగలో కలపడంలో కీలక భూమిక పోషించిన ఎన్.టి.ఆర్.కుటుంబం మొత్తం చిన్నల్లుడు చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకుని బయటకు రాలేకపోతోంది. ఆ తర్వాత కాలంలో దగ్గుబాటి కుటుంబం పూర్తిగా చంద్రబాబు చేతిలో అవమానాల పాలైంది. ఇప్పుడు పురందేశ్వరి టీడీపీ అనుకూల లైన్లో వెళుతున్నారా అన్న సందేహం రావడానికి ఆస్కారం ఏర్పడింది. నిజంగానే పురందేశ్వరి కూడా అదే దిశలో పయనిస్తే ఏపీలో బీజేపీ సాధించేది జీరోనే అని చెప్పక తప్పదు. మరొక్క మాట. ఎన్.టి.ఆర్. ఆంధ్రులం దరిలో ఆత్మగౌరవ నినాదాన్ని ప్రేరేపించగలిగారు. కానీ అది ఆయన కుటుంబంలోనే కొరవడడం విషాదమే అనిపిస్తుంది. కొమ్మినేని శ్రీనివాసరావు వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు