Kubhir
-
అవే కష్టాలు..!
బ్యాంకుల వద్ద తగ్గని రద్దీబ్యాంకుల వద్ద తగ్గని రద్దీపెద్ద నోట్లు రద్దు అయి మూడు నెలలు కావస్తున్నా ప్రజలకు మాత్రం ఇక్కట్లు తొలగడం లేదు. కుభీర్ మండలకేంద్రంలోని యూనియన్ బ్యాంకు, దక్కణ్ గ్రామీణ బ్యాంకుల వద్ద ఖాతాదారులకు నిత్యం గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. గురువారం ఉదయం 5 గంటలకే పలువురు యూనియన్ బ్యాంకుకు చేరుకొని క్యూ కట్టారు. గంటలతరబడి నిల్చొన్నా రూ. 10వేలకు మించి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోరోజు వరుసలో ఉండగానే డబ్బులు అయిపోతుండడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటోందని అంటున్నారు. ఓ వైపు ఏటీఎంలు పనిచేయక, బ్యాంకుల్లో సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో కరెన్సీ కష్టాలు తీరడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆంక్షలు పూర్తిస్థాయిలో ఎత్తివేసి గతంలో వలే డబ్బులు చెల్లించాలని వరు కోరుతున్నారు. – కుభీర్ -
యూడీసీని నిలదీసిన అంగన్వాడీ కార్యకర్తలు
ముథోల్, న్యూస్‌లైన్ : స్థానిక ఐసీడీఎస్ కార్యాలయ ఆవరణలో యూడీసీ మహేశ్‌ను అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం నిలదీశారు. ప్రాజెక్టు పరిధిలోని కుభీర్, భైంసా, లోకేశ్వరం, తానూర్, ముథోల్ మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు టీఏ, డీఏ బిల్లుల విషయమై ప్రశ్నించారు. ఏడాదిగా బిల్లులు రావడం లేదని, అంగన్వాడీ కేంద్రాల అద్దె చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టీడీఏ, డీఏ, కట్టెల బిల్లులు ఇవ్వాలని కోరితే పర్సంటేజీ అడుగుతున్నాడని ఆరోపించారు. ఐసీడీఎస్ పరిధిలోని 300 మంది అంగన్వాడీ కార్యకర్తలు రూ.6వేల చొప్పున చెల్లిస్తే బిల్లులు చేస్తానని అంటున్నాడని పేర్కొన్నారు. నెలనెల కోడిగుడ్లు ఇవ్వడం లేదని తెలిపారు.