అవే కష్టాలు..! | same problems in banks | Sakshi
Sakshi News home page

అవే కష్టాలు..!

Published Fri, Feb 3 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM

అవే కష్టాలు..!

అవే కష్టాలు..!

బ్యాంకుల వద్ద తగ్గని రద్దీబ్యాంకుల వద్ద తగ్గని రద్దీపెద్ద నోట్లు రద్దు అయి మూడు నెలలు కావస్తున్నా ప్రజలకు మాత్రం ఇక్కట్లు తొలగడం లేదు. కుభీర్‌ మండలకేంద్రంలోని యూనియన్  బ్యాంకు, దక్కణ్‌ గ్రామీణ బ్యాంకుల వద్ద ఖాతాదారులకు నిత్యం గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. గురువారం ఉదయం 5 గంటలకే పలువురు యూనియన్  బ్యాంకుకు చేరుకొని క్యూ కట్టారు. గంటలతరబడి నిల్చొన్నా రూ. 10వేలకు మించి ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కోరోజు వరుసలో ఉండగానే డబ్బులు అయిపోతుండడంతో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంటోందని అంటున్నారు. ఓ వైపు ఏటీఎంలు పనిచేయక, బ్యాంకుల్లో సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో కరెన్సీ కష్టాలు తీరడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆంక్షలు పూర్తిస్థాయిలో ఎత్తివేసి గతంలో వలే డబ్బులు చెల్లించాలని వరు కోరుతున్నారు.    – కుభీర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement