కూచిపూడి కళాకారులకు ఆహ్వానం
అనంతపురం కల్చరల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా సాంస్కృతిక శాఖ ఈనెల 23న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 1000 మంది నృత్య కళాకారులతో కూచిపూడి మహా బృంద నాట్య ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు యువజన సంక్షేమ శాఖ అధికారిణి గీతా గాంధీ వాణి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రదర్శనలో పాల్గొనడానికి కూచిపూడి కళాకారులందరికీSఅవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి గల వారు ఈనెల 11లోపు జిల్లా యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.