Kudupudi Chittabbai
-
కుడిపూడి చిట్టబ్బాయి చివరి మాటలు
-
మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి చివరి మాటలు ..
-
మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూత
-
మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కాకినాడ ప్రైవేట్ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. చిట్టబ్బాయి మృతితో కోనసీమలో తీవ్ర విషాదం అలుముకుంది. కుడిపూడి చిట్టబ్బాయి మృతి పట్ల వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పలువురు వైఎస్సార్సీపీ నాయకులు చిట్టబ్బాయి మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ధర్మాన ప్రసాదరావు సంతాపం.. కుడిపూడి చిట్టబ్బాయి మరణం చాలా బాధాకరమని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. చిట్టబ్బాయి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చిట్టబ్బాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: దారుణం: తల్లి, ఇద్దరు పిల్లల హత్య మాస్క్ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి -
కుడిపూడి చిట్టెబ్బాయికి జగన్ పరామర్శ
హైదరాబాద్ : నగరంలోని సిటీ న్యూరో సెంటర్లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టెబ్బాయిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న (మంగళవారం) పరామర్శించారు. చిట్టెబ్బాయి ఆరోగ్య పరిస్థితి గురించి ఆస్పత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్ వెంట పార్టీ నేతలు విశ్వరూప్, చలమలశెట్టి సునీల్, కురసాల కన్నబాబు ఉన్నారు. తాను ఆస్పత్రిలో చిట్టెబ్బాయిని కలిశానని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని వైఎస్ జగన్ వైఎస్ఆర్ సీపీ ట్విట్టర్ అకౌంట్ లో ఓ ఫోటోను కూడా పెట్టారు. సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి గారిని పరామర్శినంచిన వైఎస్ జగన్ గారు pic.twitter.com/jDfbEg1IBD — YSR Congress Party (@YSRCParty) 25 July 2017 -
ఏమప్ప రాజప్పా! అంత లేదులే
రాజమండ్రి : తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే హక్కు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్పకు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుడుపూడి చిట్టబ్బాయి పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో ప్రత్యర్థుల దాడిలో మృతి చెందిన కృష్ణారావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లిన సందర్భాన్ని పురస్కరించుకుని చినరాజప్ప చేసిన వ్యాఖ్యలను చిట్టబ్బాయి బుధవారం తీవ్రంగా ఖండించారు. గొట్టుముక్కలలో జగన్ చెప్పింది అక్షర సత్యమని, టీడీపీ అధికారాన్ని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని అరాచకాలు సృష్టిస్తోందని అన్నారు. టీడీపీ అధికారం చేపట్టాక తమ పార్టీ నేతలు, అభిమానులు, సాధారణ ప్రజలు 19 మంది హత్యకు గురయ్యారన్నారు. హత్యారాజకీయాల గురించి మాట్లాడే హక్కు టీడీపీ నేతలకు లేదన్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుతంత్రాలు పన్నినా, హత్యా రాజకీయాలకు పాల్పడ్డా తమ పార్టీ శ్రేణులు భయపడరని పేర్కొన్నారు. వాటన్నింటినీ తిప్పికొడుతూ ప్రజల పక్షాన పోరాడతామన్నారు. ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు అధికారం ఇస్తే వారినే భయభ్రాంతులను చేస్తున్నారన్నారు. ప్రజలు ఈ చర్యలను గమనిస్తున్నారని హెచ్చరించారు.