జనవరిలో ముక్కంటికి కుంభాభిషేకం
రూ.10కోట్లతో అభివృద్ధి పనులు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: ముక్కంటీశుని ఆలయంలో కుంభాభిషేకాన్ని 2015 జనవరిలో నిర్వహించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈవో రామచంద్రారెడ్డి గురువారం ముఖ్యమైన అధికారులు, ప్రధాన అర్చకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000లో కుంభాభిషేకం నిర్వహించారని, తర్వాత 2012లో జరగాల్సి ఉండగా వారుుదా పడుతూ వస్తోందని చెప్పారు.
ప్రధాన అర్చకులు బాబు గురుకుల్ మాట్లాడుతూ 12 ఏళ్లకొకసారి జరగాల్సిన కుంభాభిషేకాన్ని వాయిదా వేయడంతోనే ఆలయానికి కొన్ని ఇబ్బందులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ క్రమంలో రెండు గంటలపాటు కుంభాభిషేకంపై చర్చలు సాగాయి. 2015 జనవరిలో కుంభాభిషేకాన్ని ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు. స్వామివారి ధ్వజస్తంభానికి ఉన్న రాగి తొడుగును తొలగించి, రూ. 5 కోట్లతో బంగారు తొడుగు ఏర్పాటు చేస్తారు. మే నెలలో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు.