ఇరువర్గాల కొట్లాట
పెరవలి, న్యూస్‌లైన్ : ఇరువర్గాల కొట్లాటలో ఐదుగురు తీవ్ర గాయూలపాలవ్వగా, గ్రామస్తుల దాడిలో పెరవలి ఎస్సై గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. తీపర్రు వేబ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ట్రాఫిక్ నిలిచిపోవడంతో గ్రామ ఉప సర్పంచ్ కుందుల భూపతి సంఘటనా స్థలానికి వెళ్లి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేస్తుండగా ఆర్టీసీ బస్సు వెళ్లే సమయంలో కానూరు వైపు వెళ్తున్న ఆటోలో ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక దశలో ఆర్టీసీ డ్రైవర్‌ను కొట్టడానికి వెళ్తుండగా భూపతి అడ్డుకోవడంతో అతనిపై తిరగబడి చేయి చేసుకోవడంతో గొడవ ప్రారంభమైంది. ఆ సమయంలో వేబ్రిడ్జి వద్ద ఉన్న వ్యక్తులు పరుగున వచ్చి ఆటో ప్రయూణికులతో కలబడ్డారు. విషయం తీపర్రు గ్రామస్తులకు తెలియడంతో అధిక సంఖ్యలో వచ్చి ఆటోలో ఉన్న వ్యక్తులను బంధించి తీవ్రంగా గాయపరిచారు. అదే సమయంలో కానూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున జనం వచ్చి రోడ్డుపై బైఠాయించడంతో 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయూరుు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెరవలి ఎస్సై, సిబ్బంది గాయపడిన యలగన రాజు, దుర్గయ్యలను 108లో తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రోడ్డుపై కూర్చున్న కానూరు గ్రామస్తులు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదని ఎస్సైకు చెప్పడంతో గాయపడిన వారికి వైద్యం అందించి, కారకులైన వారిపై కేసు నమోదు చేస్తానని చెప్పి ఇరువర్గాలను అక్కడ నుంచి పంపేశారు.
ఈ విషయం రుచించని కానూరు గ్రామస్తులు సోమవారం ఉదయం 11 గంటలకు తీపర్రు వేబ్రిడ్జి వద్దకు ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లపై పెద్ద సంఖ్యలో చేరుకుని దొరికిన వారిని దొరికినట్లు కర్రలు, రాడ్డులతో కొట్టారు. సమాచారం అందుకున్న ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వేబ్రిడ్జి వద్ద ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో పాటు వేబ్రిడ్జికి సంబంధించిన కంప్యూటర్ రూమ్‌ను పూర్తిగా ధ్వంసం అయ్యూరుు. వీటితో పాటు 3 మోటార్ సైకిళ్లు, 2 సైకిళ్లు ధ్వంసం చేశారు. తీవ్ర ఆగ్రహంతో ఉన్న కానూరు గ్రామస్తులు పొక్లెయిన్ డ్రైవర్ ఆకుల వెంకటేశ్వర్లును తీవ్రంగా కొట్టి ట్రాక్టర్లో వేసుకుని గ్రామానికి తీసుకుని వె ళ్లిపోయారు.
ఎస్సైపై దాడి
తీపర్రు వేబ్రిడ్జి వద్ద సోమవారం తీపర్రు, కానూరు గ్రామస్తులు కర్రలు, రాడ్డులతో కొట్టుకుంటున్నారని సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఇరువర్గాలను చెదరగొడుతుండగా కానూరు గ్రామస్తులు తీవ్ర ఆగ్ర హంతో ఎస్సైపై దాడికి దిగారు. కేసు కట్టమంటే రాజీ చేయడానికి చూస్తావా అంటూ కొందరు ఎస్సై కాలర్ పట్టుకుని గిరగిరా తిప్పారు. ఎవరు ఎవరిని కొడుతున్నారో తె లియని గందరగోళ పరిస్థితి నెలకొనడంతో పోలీ సులు లాఠీఛార్జీ చేశారు. పొక్లెయిన్ డ్రైవర్‌ను తీసుకుపోయారని స్థానికులు చెప్పడంతో ఎస్సై సిబ్బం దితో కలిసి కానూరు వెళ్లారు.
ఎస్సైపై దాడి జరిగి నట్లు తణుకు సీఐకు సమాచారం ఇవ్వడంతో తణు కు రూరల్ ఎస్సై, ఉండ్రాజవరం ఎస్సై సిబ్బందితో సంఘటనా స్థలానికి వచ్చారు. కానూరు పంచాయతీ కార్యాలయం వద్ద దాడికి కారణమైన వ్యక్తులను పిలిచి తనపై దాడి చేసిన వ్యక్తిని అప్పగించాలని ఎస్సై కోరడంతో దాడిలో పాల్గొన్న వ్యక్తులు ఎవరు ఎవరిని కొట్టారో తెలియదని, మమ్మలందర్ని తీసుకువెళ్లండని తెలపడంతో ఎస్సై అక్కడి నుంచి తిరిగి వచ్చారు. పెరవలి స్టేషన్లో ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశారు. ఎస్సైపై దాడి చేసిన వారిపై కూడా కేసు నమోదు చేశామని ఎస్సై ఎంవీఎస్ మూర్తి తెలిపారు.