Kunduz province
-
మసీదులో మారణకాండ
కాబూల్: పశ్చిమ అఫ్గానిస్తాన్ కుందుజ్ ప్రావిన్సులోని గోజార్ ఇ సయీద్ అబాద్ మసీదులో శుక్రవారం సంభవించిన పేలుడులో 60మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ అల్‌జజీరా వెల్లడించింది. అయితే కుందుజ్ ఆస్పత్రి అధికారి ఒకరు పేలుడులో 25మంది మరణించారని, 51మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు అధికారిక బఖ్తార్ న్యూస్ ఏజెన్సీ ఈ పేలుళ్లలో 46మంది మరణించారని, 140మంది గాయపడ్డారని తెలిపింది. ఇవన్నీ ప్రాథమిక గణాంకాలేనని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. దేశ పాలనపగ్గాలు తాజాగా చేపట్టిన తాలిబన్లకు ఈ పేలుడు సవాలుగా మారింది. పేలుడులో మొత్తం 100 మంది మరణించడం లేదా గాయపడడం జరిగిందని కుందుజ్ ప్రావిన్స్ తాలిబన్ పోలీసు అధికారి ఒబైదా ప్రకటించారు. గాయపడినవారి కన్నా మరణించినవారే ఎక్కువగా ఉండొచ్చన్నారు. షియాల రక్షణకు తాలిబన్లు కట్టుబడిఉన్నారని భరోసా ఇచ్చారు. అఫ్గాన్ పగ్గాలు తాలిబన్ల చేతికి వచ్చాక జరిగిన పెద్దదాడిగా దీన్ని భావిస్తున్నారు. దాడిని షియాల మతపెద్ద అలిమి బల్ఖి ఖండించారు. తాలిబన్లు షియాలకు రక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రార్ధనాస్థలాల రక్షణకు ఉంచిన ఆయుధాలను తాలిబన్లు తీసుకుపోయినందున, వీటిని రక్షించాల్సిన బాధ్యత కూడా వాళ్లదేనన్నారు. ఐసిస్ హస్తం మసీదులో జరిగిన ఘోర పేలుడుకు కారకులెవరో తొలుత తెలియరాలేదు. అయితే పేలుడు జరిగింది షియా ముస్లింలకు చెందిన మసీదు కావడంతో ఐసిస్‌పైనే అందరికీ తొలుత అనుమానం వచ్చింది. ఇందుకు తగ్గట్లే తామే ఈ పేలుళ్లు జరిపామని ఐసిస్ అనుబంధ సంస్థ ఐసిస్– కే వారి మీడియా ఏజెన్సీ అమాక్ న్యూస్‌లో ప్రకటించింది. ఇదే అంశాన్ని ఎస్ఐటీఈ ఇంటిలిజెన్స్ గ్రూపు నిర్ధారించింది. షియా హజారాలను లక్ష్యంగా చేసుకొనే ఆత్మాహుతి దాడి చేసినట్లు ఐసిస్–కే టెలిగ్రామ్ ఛానెల్లో ప్రకటించుకుంది. గతంలో పలుమార్లు షియా మైనారీ్టలపై ఐసిస్ దాడులు చేసిన చరిత్ర ఉంది. అమెరికా సైన్యాలు వైదొలిగిన అనంతరం ఐసిస్ ఉగ్రవాదులు అఫ్గాన్‌లో దాడులు ముమ్మరం చేశారు. ముఖ్యంగా షియాలపై ఐసిస్–కే యుద్ధాన్నే ప్రకటించింది. తాజాదాడులను ఐరాస ఖండించింది. పేలుడుపై తమ పత్య్రేక దళాలు దర్యాప్తు జరుపుతున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా చెప్పారు. ప్రస్తుతం పోలీసులు అక్కడ ఆధారాలను సేకరిస్తున్నారు. ఒకప్పుడు కొన్నిప్రాంతాలకే పరిమితమైన ఐసిస్ దాడులు ఇప్పుడు పలు చోట్ల జరగడం తాలిబన్లతో పాటు అఫ్గాన్ పొరుగుదేశాలను కూడా కలవరపరుస్తోంది. -
అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి
కాబూల్: అఫ్గాన్ భూభాగాలను తాలిబన్ సేనలు మెరుపువేగంతో తన అధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ప్రావిన్స్‌లపై పట్టుకోసం అఫ్గాన్ సైన్యం, తాలిబన్ మూకల మధ్య పోరుతో దేశంలో యుద్ధమేఘాలు మరింతగా కమ్ముకున్నాయి. తాజాగా మరో మూడు ప్రావిన్స్‌ల రాజధానులను తాలిబన్ దళాలు ఆక్రమించాయి. తాజాగా బదఖ్షాన్ రాజధాని ఫైజాబాద్, బాగ్లాన్ రాజధాని పోలి–ఖుమ్రీ, ఫరాహ్ ప్రావిన్స్ రాజధాని తాలిబన్ వశమయ్యాయి. దీంతో అఫ్గాన్ ఈశాన్య ప్రాంతమంతా తాలిబన్ల అధీనంలోకి వచ్చింది. కుందుజ్ ఎయిర్‌పోర్ట్‌లోని సైనిక స్థావరాన్ని తాలిబన్లు ఆక్రమించారు. దీంతో తాలిబన్లపై ప్రతిదాడులు చేసి వారు తోకముడిచేలా చేసేందుకు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రంగంలోకి దిగారు. బాల్ఖ్ ప్రావిన్స్‌లోని స్థానికసైన్యాల నేతలైన అబ్దుల్ రషీద్ దోస్తుమ్ తదితరులను సాయం కోరేందుకు అక్కడికి చేరుకున్నారు. వారం వ్యవధిలోనే ఆరు ప్రావిన్స్‌ల రాజధానులు తాలిబన్ చేతచిక్కాయి. మరోవైపు, కీలక దేశ ‘కస్టమ్స్ ఆదాయ మార్గాలను’ తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆర్థికమంత్రి ఖలీద్ పయేందా పదవికి రాజీనామా చేసి, దేశం వదిలి పారిపోయారని ఆర్థికశాఖ అధికార ప్రతినిధి మొహమ్మద్ రఫీ తబే చెప్పారు. ఉపసంహరణ ఆగదు: బైడెన్ అఫ్గాన్ సైన్యానికి తోడుగా ఉండేందుకు ఆ దేశంలోనే అమెరికా సేనలు ఉండబోతున్నాయని, సేనల ఉపసంహరణకు బ్రేక్ పడుతుందన్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొట్టిపారేశారు. ‘మా బలగాలు అమెరికాకు రావడం ఖాయం. ఇప్పటికే అఫ్గాన్‌లో 20ఏళ్లకాలంలో దాదాపు రూ.74లక్షల కోట్లు ఖర్చుపెట్టాం. 3లక్షల మంది అఫ్గాన్ సైనికులకు శిక్షణ ఇచ్చాం. ఇకపై అఫ్గాన్ సేనలు తమ కోసం, తమ దేశం కోసం పోరాడాల్సిందే’అని బైడెన్ వ్యాఖ్యానించారు. కాగా, దేశ సైన్యంలో మరింతగా పోరాటస్ఫూర్తిని పెంచేందుకు ఆర్మీ చీఫ్ స్టాఫ్‌గా జనరల్ హిబాతుల్లా అలీజాయ్ను రక్షణశాఖ నియమించినట్లు స్థానిక మీడియా ప్రకటించింది. Heart breaking scenes from #Kunduz province #Afghanistan 😰 pic.twitter.com/QjRzNa6XwQ — Khalid Amiri - خالد امیري (@KhalidAmiri01) August 8, 2021 -
అఫ్గాన్‌లో 30 మంది పౌరుల మృతి
కుందుజ్: అఫ్గానిస్తాన్‌లో గురువారం నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. కుందుజ్ ప్రావిన్సులో ఈ దాడులు జరిగాయి. గత నెలలో కుందుజ్ ప్రావిన్సును తాలిబాన్ ఉగ్రవాదులు ఆక్రమించారు. ఈ ఏడాది కుందుజ్‌పై వారు ఆధిపత్యం సాధించడం ఇది రెండోసారి. తాలిబాన్‌తో అఫ్గాన్–అమెరికా దళాలు పోరాడుతుండగా ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే నాటో వైమానిక దాడులు జరిపినట్లు అనుమానిస్తున్నారు.