కుందుజ్: అఫ్గానిస్తాన్‌లో గురువారం నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. కుందుజ్ ప్రావిన్సులో ఈ దాడులు జరిగాయి. గత నెలలో కుందుజ్ ప్రావిన్సును తాలిబాన్ ఉగ్రవాదులు ఆక్రమించారు.
ఈ ఏడాది కుందుజ్‌పై వారు ఆధిపత్యం సాధించడం ఇది రెండోసారి. తాలిబాన్‌తో అఫ్గాన్–అమెరికా దళాలు పోరాడుతుండగా ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే నాటో వైమానిక దాడులు జరిపినట్లు అనుమానిస్తున్నారు.
అఫ్గాన్‌లో 30 మంది పౌరుల మృతి
Published Fri, Nov 4 2016 9:24 AM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM
Advertisement
Advertisement