kurapati ranga raju
-
ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తా
ఖమ్మం: ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతూ వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు అన్నారు. జిల్లా శిశుసంక్షేమశాఖ ఉద్యోగుల సంఘం సమావేశం ఆదివారం ఖమ్మంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో జిల్లా ఉద్యోగులు స్పందించిన తీరు మరువలేమన్నారు. ఆరు దశాబ్దాలుగా సాగిన తెలంగాణ ఉద్యమం విజయం సాధించిందని, ఇప్పుడు ఉద్యోగుల హక్కులను కూడా సాధించుకోవాలని అన్నారు. బంగారు తెలంగాణ రూపొందాలంటే ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు వర్గాలకు చేరేలా ఉద్యోగులు ప్రయత్నించాలని కోరారు. ఉద్యోగులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించవద్దని అన్నారు. కార్యక్రమంలో స్త్రీ సంక్షేమశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయరామ్‌నాయక్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కత్తుల రవి, అచ్యుత్‌రామ్, నాయకులు రామయ్య, వల్లోజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పోలవరంతో పొంచిఉన్న ముప్పు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టుతో జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ డివిజన్ల కు ముప్పు పొంచి ఉందని, ఈ రెండు డివిజన్లను సీమాంధ్రలో కలపాలనే కుట్రలను వ్యతిరేకించాలని టీజేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం టీఎన్జీఓ కార్యాలయంలో జిల్లా జేఏసీ సమావేశం కూరపాటి రంగరాజు అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడు తూ భద్రాచలం, పాల్వంచ డివిజన్లను ముంచేందుకు జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గిరిజనులను కాపాడాల్సిన అవసరం, బాధ్యత ప్రజా ప్రతినిధులు, ప్రజలపై ఉందన్నారు. మలి విడత ఉద్యమం నాలుగున్నర సంవత్సరాలు సాగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిం దని, తెలంగాణ బిల్లును ఉభయ సభ ల్లో ఆమోదించడం శుభ పరిణామమన్నారు. సుదీర్ఘ పోరాటాలకు సహకరించిన జిల్లా ప్రజలకు, ఉద్యోగ, కుల, వాణిజ్య, విద్యార్థి సంఘాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదించేందుకు కృషిచేసిన అన్ని రాజకీ య పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథం లో నడిపేందుకు అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, లాయర్ల జేఏసీ చైర్మన్ తిరుమలరావు, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తవిడిశెట్టి రామారావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోడి లింగయ్య, టీఎన్జీవోస్ టౌన్ అధ్యక్షుడు వల్లోజు శ్రీనివాసరావు, పూసపాటి శ్రీనివాసరావు, డ్రైవర్ల సంఘం టౌన్ అధ్యక్షుడు రామారావు పాల్గొన్నారు. -
బిల్లు ఆమోదించేవరకూ ఉద్యమం
సత్తుపల్లి, న్యూస్‌లైన్ : వెయ్యి మంది తెలంగాణ అమరవీరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని.. పార్లమెంట్లో బిల్లు ఆమో దం పొందేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీజేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు స్పష్టం చేశారు. స్థానిక కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి జరిగిన సకలజనుల భేరి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ, యూపీఏ ప్రకటన వెలువడి 60 రోజులు కావస్తున్నా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై నోట్ పెట్టకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యమం సాగుతోందని.. ఏపీఎన్జీఓలు హైద్రాబాద్‌లో ఉంటూ.. ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులు కలిసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ వాదులంతా ఏకమై సకలజనుల భేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం జిల్లా నుంచి 25 వేల మందిని తరలిస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియను అడ్డుకుంటే కాంగ్రెస్, సీమాంధ్ర పార్టీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తి ఆపలేదని.. సకల జనులభేరికి స్వచ్ఛందం గా తరలి రావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జ్ నూకల నరేష్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం, సీమాంధ్రులు కళ్లు తెరిచేలా హైద్రాబాద్‌కు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ టీజేఏసీ నాయకులు వెంకటపతిరాజు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బానిసలుగా ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు మాట్లాడటం గర్హనీయమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలను బంతిలాగ ఆడుకుంటున్నారని.. ఆరు బాళ్లలో ఆరు సిక్సర్లు కొట్టినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని అన్నారు. టీజేఏసీ కన్వీనర్ చిత్తలూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సత్తుపల్లి టీజేఏసీ చైర్మన్ కూకలకుంట రవి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాలడుగు శ్రీనివాస్, టీచర్స్ టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, లాయర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు తిరుమలరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, దండు ఆదినారాయణ, వందనపు భాస్కర్‌రావు, ఎస్కె అయూబ్‌పాషా, జగదీష్, బి.మధుసూదన్‌రాజు, చెంచురెడ్డి, ముత్యారత్నం, దొడ్డా రమేష్, శ్రీను, రామ్‌నాయక్, ఎ.రాము, వెంకన్న, అద్దంకి వెంకటరత్నం, తడికమళ్ల యోబు, నాగమణి, సంధ్య, షహనాజ్‌బేగం, సోయం కమల పాల్గొన్నారు.