ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: పోలవరం ప్రాజెక్టుతో జిల్లాలోని భద్రాచలం, పాల్వంచ డివిజన్ల కు ముప్పు పొంచి ఉందని, ఈ రెండు డివిజన్లను సీమాంధ్రలో కలపాలనే కుట్రలను వ్యతిరేకించాలని టీజేఏసీ నేతలు పిలుపునిచ్చారు.
ఈ మేరకు శుక్రవారం టీఎన్‌జీఓ కార్యాలయంలో జిల్లా జేఏసీ సమావేశం కూరపాటి రంగరాజు అధ్యక్షత జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడు తూ భద్రాచలం, పాల్వంచ డివిజన్లను ముంచేందుకు జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గిరిజనులను కాపాడాల్సిన అవసరం, బాధ్యత ప్రజా ప్రతినిధులు, ప్రజలపై ఉందన్నారు. మలి విడత ఉద్యమం నాలుగున్నర సంవత్సరాలు సాగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిం దని, తెలంగాణ బిల్లును ఉభయ సభ ల్లో ఆమోదించడం శుభ పరిణామమన్నారు.
సుదీర్ఘ పోరాటాలకు సహకరించిన జిల్లా ప్రజలకు, ఉద్యోగ, కుల, వాణిజ్య, విద్యార్థి సంఘాలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్ర బిల్లును ఆమోదించేందుకు కృషిచేసిన అన్ని రాజకీ య పక్షాలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామని, రాష్ట్రాన్ని అభివృద్ధిపథం లో నడిపేందుకు అందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, లాయర్ల జేఏసీ చైర్మన్ తిరుమలరావు, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తవిడిశెట్టి రామారావు, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోడి లింగయ్య, టీఎన్‌జీవోస్ టౌన్ అధ్యక్షుడు వల్లోజు శ్రీనివాసరావు, పూసపాటి శ్రీనివాసరావు, డ్రైవర్ల సంఘం టౌన్ అధ్యక్షుడు రామారావు పాల్గొన్నారు.
పోలవరంతో పొంచిఉన్న ముప్పు
Published Sat, Feb 22 2014 1:57 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement