breaking news
Kurnool Bus Fire Accident
-
బస్సు ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీకి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై అత్యవసర విచారణ జరపాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ), కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి సోమవారం ఫిర్యాదు చేశారు. బస్సుపై 16 పెండింగ్ చలాన్లు ఉన్నాయని, అయినా ఆ బస్సు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగిందన్నారు. అనుమతి లేకుండా స్లీపర్ సీట్లు అమర్చారని..అలాగే పెద్ద సంఖ్యలో ఫోన్ల రవాణాకు ప్రయత్నించారని పేర్కొన్నారు. వీటన్నింటి వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ప్రమాదాలకు కారకులైన ప్రభుత్వం, రవాణా శాఖపై కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
గాలిలో దీపమైన భద్రత
అదుపులేని ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణికుల ప్రాణాల్ని గాలిలో దీపాలుగా చేస్తున్నాయి. కర్నూలు దగ్గరలో జరిగిన అగ్ని ప్రమాదంలో బస్సు లోనే ఆహుతి అయిన 19 మానవ ప్రాణాలు ఈ దుఃస్థితికి ఉదాహరణ. ఆ ప్రమాద కారణాలు ప్రత్యక్షంగా ఏవైనప్పటికీ, అలాంటి ప్రమాదం ఏర్పడ టానికి పరోక్షంగా దోహదపడిన పరిస్థితుల్ని చక్కదిద్దడానికి పూనుకోకపోతే మళ్లీ మళ్లీ అలాంటి దురదృష్టకర సంఘటనలు పెచ్చరిల్లుతాయి. ఈ దుర్ఘటన జరిగాక ఆంధ్రప్రదేశ్‌లో సంబంధిత అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల్లో 360కి పైగా అతిక్రమణలు గుర్తించారు. నలభై బస్సుల్ని సీజ్ చేశారు. కళ్లెదుట ప్రతి రోజూ లక్షలాది మంది ప్రయాణించే బస్సులు ఒక్కరోజు తనిఖీలోనే పదుల సంఖ్యలో ప్రయా ణింప వీలుగాని కండిషన్లో ఉన్నా యంటే వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్థమవుతోంది. మితిమీరి లాభాలు పొందడా నికి ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు గడ్డి కరి చినా, వాటిని నియంత్రించే వ్యవస్థకు ఏమైంది? ఆల్ఇండియా పర్మిట్లు ఈశాన్య రాష్ట్రాల్లో తీసుకోవడం, బళ్ళు ఇక్కడ తిప్పడంలోనే అవినీతి జాడ లున్నాయి. సిటింగ్‌కి అనుమతి తీసుకుని, స్లీపర్‌గా మార్చి ప్రయాణికుల రక్షణను రోడ్డున పడేస్తే, అధికారులు గమనించలేక పోతున్నారా? అగ్నిమాపక నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిన చోట చూసీచూడనట్లు వది లేయడం ఎంత దారుణం! గత రెండు రోజుల్లో నమోదైన అతిక్రమణల కేసులు చూస్తే అర్థమయ్యేది ఏమిటంటే నిబంధనలు పాటించే వారికన్నా అతిక్రమించే వాళ్లే ఎక్కువగా ఉన్నారు. నియంత్రించాల్సిన వ్యవస్థలు అలసత్వంతోనో, అవినీతితోనో కళ్లు మూసుకొంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే జరిగే తనిఖీల హడావిడి రెండ్రోజుల తర్వాత పూర్తిగా అటకెక్కుతుంది. తర్వాత షరా మామూలే! పాడె మారువేషంలో స్పీడుగా తిరుగుతుంది రోడ్ల మీద!!ఇదీ చదవండి : బిగ్‌బీ దివాలీ గిఫ్ట్ : నెట్టింట ట్రోలింగ్ మామూలుగా లేదుగా!ఈ స్థితి మారాలి. రోడ్డు నిబంధనల్ని నిక్కచ్చిగా పాటించేలా చూడాలి. స్పీడు అతిక్రమించితే బైక్‌నైనా సీజ్ చెయ్యాలి. భారీగా పెనాల్టీ వెయ్యాలి. ప్రజా రవాణా వాహనాల్ని ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ కండిషన్లో ఉండేలా నియంత్రించాలి. రోడ్డు ప్రమాదాల్లో విలువైన ప్రాణాల్ని కోల్పోతున్నాం. సరైన చర్యల ద్వారా వాటిని బాగా తగ్గించగలం. ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి.– డా.డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ -
బైకర్ శివశంకర్ 6 గంటలు ఏం చేశాడంటే..? కర్నూల్ ఘటనపై షాకింగ్ నిజాలు
-
కర్నూలు బస్సు ప్రమాదం.. రమేష్ కుటుంబాన్ని వెంటాడుతున్న ప్రమాదాలు
సాక్షి,అమరావతి: హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ బస్సు(డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారు జామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసింది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన గోళ్ల రమేష్(31) కుటుంబాన్ని ప్రమాదాలు వెంటాడుతున్నాయి.సోమవారం కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన రమేష్ కుటుంబసభ్యుల అంత్యక్రియల్లో పాల్గొని ఇంటికి వెళ్తుండగా వారి కుటుంబసభ్యులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో రమేష్ కుటుంబసభ్యుల ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. వింజమూరు (మం) గోళ్ళవారి పల్లి నుండి విజయవాడ వెళ్తుండగా కారు టైర్ పంచర్ కావడంతో కల్వర్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
Shyamala: దమ్ముంటే సమాధానం చెప్పండి.. కర్నూల్ బస్సు ఘటనపై...
-
‘కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది’
సాక్షి,తాడేపల్లి: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరేశ్యామల ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యంతో నేరాలు పెరుతున్నాయని అన్నారు. కర్నూలు బస్సు ప్రమాదంపై ఆమె మీడియాతో మాట్లాడారు.కర్నూలు బస్సు ప్రమాదం వెనుక కూడా మద్యమే కారణం. వైఎస్ జగన్ యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించారు.కానీ చంద్రబాబు అలా కాదు యాభై ఇళ్లకు ఒక మద్యం బెల్టు షాపును పెట్టారు. ఎవరిది సంక్షేమ పాలనో, ఎవరిది సంక్షోభ పాలనలో జనానికి తెలిసిందిచంద్రబాబు పాలనలో పరిశ్రమలు వస్తాయనీ, ఉద్యోగాలు వస్తాయని భావించారు. తీరా చూస్తే మద్యం తయారీ పరిశ్రమలు వచ్చాయి. వైఎస్ జగన్ హయాంలో తెచ్చిన సంస్కరణలను క్లోజ్ చేసి, ఊరూరా మద్యం షాపులు పెట్టారు. ఏ ఊర్లోకి వెళ్లినా బెల్టుషాపుల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది.మద్యం దందా ఏపీలో వ్యవస్తీకృతం అయింది. నేరగాళ్లకు ప్రభుత్వమే మంచి అవకాశం కల్పిస్తోంది. కర్నూలు బస్సు దగ్ధం వెనుక విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం అమ్మకాలే కారణం. బస్సు ప్రమాదం వెనుక కారణాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మద్యం వలనే ప్రమాదం జరిగిందన్నది వాస్తవం కాదా?. హైవే పక్కన మద్యం దుకాణాలు ఉన్న సంగతి తెలీదా?.లక్ష్మీపురంలోని మద్యం బెల్టు షాపు సీసీ పుటేజీని ఎందుకు బయట పెట్టటం లేదు?.ఆ ఊర్లో ఏకంగా మూడు బెల్టు షాపులు ఉన్నమాట వాస్తవం కాదా?.క్యూ ఆర్ కోడ్ ఉందని చెప్పిన ప్రభుత్వం బైకర్ కొనుగోలు చేసిన మద్యానికి స్కాన్ చేశారా?. ఏపీలో లక్షన్నర మద్యం బెల్టుషాపులు ఉన్నాయి.ఈ బస్సు ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.తప్పు చేసినా తప్పించుకోవటం చంద్రబాబుకు అలవాటే. రాష్ట్రంలో మహిళలు-చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలకు కూడా మద్యమే కారణం.చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ మద్యం విచ్చలవిడి తనంపై ఎందుకు మాట్లాడరు? అరోగ్యశ్రీ నిలిపివేత, మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ, కల్తీ ఆహారంతో ఆస్పత్రి పాలవుతున్న విద్యార్థుల గురించి ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు?. మద్యం వద్దు, మెడికల్ కాలేజీలే ముద్దు అని జనం అంటున్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. -
కన్నీటి వీడ్కోలు.. కర్నూలు ఘటన మృతుల అంత్యక్రియలు
-
నిజాలు దాచి 'బెల్ట్' ఫుటేజీ మాయం
-
అసలు ముద్దాయిలు ఈ నలుగురు.. కర్నూల్ బస్సు ఘటనపై రాచమల్లు షాకింగ్ నిజాలు
-
డ్రైవర్, బస్సు యాజమాన్యంపై కేసు నమోదు
-
కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు.. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్ర అస్వస్థతకు గురైన గుణసాయి అనే ప్రయాణికుడు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కోలుకుంటున్నాడు. మచిలీపట్నంకు చెందిన ఈయన ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. బస్సులో ప్రయాణిస్తుండగా మంటలు రావడంతో ఆ పొగ పీల్చి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో అతని ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్కు గురయ్యాయి. దీంతో అతన్ని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చేరి్పంచారు. వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆర్‌ఐసీయులో ఉంచి వైద్యం అందిస్తున్నారు. శనివారం వరకు విషమంగా ఉన్న అతని ఆరోగ్యం వైద్యుల కృషి ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడింది. ఆస్పత్రిలో చేరిన ఎర్రిస్వామి.. బస్సు ప్రమాదంలో కీలక సాక్షిగా ఉన్న ఎర్రిస్వామి శనివారం రాత్రి ప్రభుత్వాస్పత్రిలో కడుపునొప్పితో చేరాడు. బైక్ నుంచి అతను కింద పడటంతో కడుపు వద్ద గీరుకుపోయింది. దీనికితోడు పలుచోట్ల నొప్పులు ఉండటంతో కుటుంబసభ్యుల కోరిక మేరకు పోలీసులు అతన్ని ఆసుపత్రిలో చేరి్పంచారు. అతనికి అ్రల్టాసౌండ్ స్కాన్, ఎక్స్‌రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేసిన వైద్యులు.. లోపల ఎలాంటి గాయాల్లేవని నిర్ధారించారు. మరికొన్ని పరీక్షలు చేసి కోలుకుంటే డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిసింది.స్వగ్రామానికి చేరిన తల్లీకుమార్తె మృతదేహాలుమరోవైపు.. బస్సు ఘటనలో సజీవ దహనమైన తల్లీకుమార్తె మృతదేహాలు ఆదివారం అర్ధరాత్రి స్వస్థలానికి చేరుకున్నాయి. డీఎన్ఏ పరీక్షల నిమిత్తం శుక్రవారం రాత్రి సంధ్యారాణి తల్లి, చందన తండ్రి నుంచి నమూనాలు సేకరించగా, ఆదివారం ఉదయం ఫలితాలు రావడంతో అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, వారు కర్నూలుకు వెళ్లారు. సాయంత్రం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో మెదక్ మండలం శివాయిపల్లికి తరలించారు. వాటిని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం అంత్యక్రియలు జరగనున్నాయి. -
మద్యం రాసిన మరణ శాసనం..
-
అదే కర్నూలు బస్సు ప్రమాదానికి మూల కారణం: రాచమల్లు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: బెంగుళూరు-హైదరాబాద్ జాతీయరహదారిపై జరిగిన బస్సు దహనం ఘటన ప్రమాదం కాదని ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇరవై నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని.. ఈ ఘటనలో సీఎం చంద్రబాబే ప్రథమ ముద్దాయని రాచమల్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏరులై పారుతున్న మద్యమే.. ఈ ప్రమాదానికి కారణమని ఆయన తేల్చి చెప్పారు. ప్రమాదం జరగడాని కంటే ముందు జాతీయ రహదారి సమీపంలోని బెల్టుషాపులో మద్యం కొనుగోలు చేసిన బైకిస్టే.. మద్యం మత్తులో ఇంత పెద్ద ప్రమాదానికి కారణమయ్యారని వెల్లడించారు. దీనికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం(ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే..బెంగుళూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బస్సు దహనం ఘటన దురదృష్టవశాత్తూ జరిగిన ప్రమాదం కాదు.. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం, స్వార్థంతో జరిగిన హత్యలివి. ఈ హత్యల్లో మొదటి ముద్దాయి ముఖ్యమంత్రి చంద్రబాబే అయితే, ఎక్సైజ్ శాఖ మంత్రి రెండో ముద్దాయి, జాతీయ రహదారిపై మద్యం అమ్ముతున్న బెల్టుషాపు నిర్వాహకుడు మూడో ముద్దాయి కాగా.. బెల్టుషాపు లేకుండా చేయాల్సిన ఎక్సైజ్ అధికారి నాలుగో ముద్దాయి కాగా ఐదో ముద్దాయి రవాణాశాఖ అధికారులు, ఆరో ముద్దాయి బస్సు ఓనరు, ఏడో ముద్దాయి డ్రైవరు, ఎనిమిదో ముద్దాయి బైక్ డ్రైవర్ వీరందరూ కలిసి వీరి ఉసురు పోసుకున్నారు. జాతీయ రహదారిమీద తిరగడానికి కావాల్సిన ఫిట్ నెస్ సహా ఏ అనుమతలూ లేకుండానే ఆ బస్సు తిరుగుతోంది. అధికారుల ఉదాసీనతకు నిదర్శనం ఇది.ఆదాయమే లక్ష్యంగా ఏటీఎం- ఎనీటైం మందు..రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఇదే విషయాన్ని మేం ప్రతిరోజూ నెత్తీనోరూ మొత్తుకుని చెబుతున్నా పట్టించుకున్నపాపాన పోలేదు. రాష్ట్రంలో ఇప్పుడు రోజులో ఇరవై నాలుగు గంటలూ, వారానికి ఏడు రోజులూ ఎనీ టైమ్ మందు( ఏటీమ్) అందుబాటులో ఉంటుంది. బడి, గుడి, వీధి సందు, జాతీయ రహదారి, గ్రామీణ రోడ్లు అక్కడా ఇక్కడా అని లేదు.. కూటమి పాలనలో ఇప్పుడు ఎక్కడైనా మద్యం అందుబాటులో ఉంటుంది. తాగొచ్చు, తాగి ప్రమాదాలు చేసి మనుషులను చంపొచ్చు.. ఏం జరిగినా ప్రభుత్వానికి మాత్రం ఆదాయమే ముఖ్యం. నకిలీ మద్యం అమ్మి వేల కోట్లు సంపాదించడం, ఆ డబ్బును ఎన్నికల్లో ఖర్చు పెట్టి గెలవడమే వారి లక్ష్యం. తనకు అధికారం, తన మనుషులకు వేల కోట్ల డబ్బు సంపాదనే చంద్రబాబు పాలసీ.రవాణాశాఖ అధికారులు ప్రైవేటు బస్సులకు సంబంధించిన అనుమతులు, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్‌లు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత బస్సులు రోడ్డెక్కేలా అనుమతులు ఇవ్వాలి. అన్ని అనుమతులు, పేపర్లు లేకుండా రాష్ట్రంలో ఏ ప్రైవేటు బస్సు అయినా రోడ్డెక్కి జరగరానిది జరిగితే అది ప్రమాదం కాదు.. నిస్సందేహంగా హత్యగానే భావిస్తాం. హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు, ఇది ముమ్మూటికీ హత్యే. దీన్ని నేను డిజిటల్ బుక్ లో ఎంటర్ చేస్తాను.ఇకపై ప్రొద్దుటూరు రోడ్లపై అనుమతులు లేకుండా వచ్చిన వాహనాల వల్ల ప్రమాదం జరిగినా దాన్ని హత్యగానే ఈ జాతీయ రహదారిపై ఏ ప్రమాదం జరిగినా హత్యగానే భావించి డిజిటల్ బుక్ లో నమోదు చేస్తాను. వైయస్.జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీటిని హత్యలుగానే భావించి కేసులు నమోదు చేస్తాం. కూటమి ప్రభుత్వానికి మనుషులు ప్రాణాలంటే లెక్కలేకుండా పోయింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు నిద్రలోనే గాల్లో కలిసిపోయాయి. బెల్టుషాపుల్లో తాగిన మద్యం, అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం. మీరు, మీ కుటుంబాలు మాత్రం బాగుండాలి. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు స్పెషల్ ప్లైట్లు, హెలికాప్టర్ లలో తిరుగుతారు. ప్రజలు మాత్రం కాలి బూడిదన్నా కావాలి, లేదంటే మీరు తయారు చేసిన నకిలీ మద్యం తాగి అన్నా చావాలి. కనికరం లేని దుర్మార్గ ప్రభుత్వమిది.రాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా.. ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులుతో ప్రజలు ప్రాణాలను హరిస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగినది ప్రమాదం కాదు. అమాయకులైన 20 మందిని ప్రభుత్వమే పొట్టన పెట్టుకుంది. బెల్టుషాపుల్లో విచ్చలవిడి మద్యం అమ్మకాలే ఈ ప్రమాదానికి కారణం. ఈ ప్రమాద ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబు సహా అందరూ నిందితులే.. వీరి నేరాన్ని డిజిటల్ బుక్‌లో ఎంటర్ చేయనున్నట్టు రాచమల్లు తెలిపారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరందరికీ శిక్ష పడేలా చేయడం ఖాయమని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. -
అడ్డంగా దొరికిపోయిన బాబు..? ఎక్సైజ్ విచారణలో వెలుగులోకి సంచలన నిజాలు
-
కూటమి ఖాతాలో మరో ఘనకార్యం.. ప్రమాదం వెనుక టీడీపీ నకిలీ మద్యం ?
-
మద్యం కొంటున్న బైకర్.. CCTV వీడియో వైరల్
-
కర్నూలు బస్సు ప్రమాదం.. చంద్రబాబు బెల్ట్ షాపుదే ఆ పాపం
-
కర్నూలు ప్రమాదం: వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులే.. సజ్జనార్ వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదంపై(Kurnool Bus Fire Accident) హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్(VC Sajjanar) స్పందించారు. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.కర్నూలు బస్సు ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది. మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!. వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?.సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి. చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది’ అని పోస్టు చేశారు. Drunk drivers are terrorists. Period.Drunk drivers are terrorists and their actions are nothing short of acts of terror on our roads. The horrific #Kurnool bus accident, which claimed the lives of 20 innocent people, was not an accident in the truest sense. It was a preventable… pic.twitter.com/oXTp0uOt2k— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 26, 2025 -
డ్రైవర్లపై కేసు నమోదు.. బస్సు ప్రమాదానికి అసలు కారణం ఇదే!
-
మీ బెల్ట్ షాప్స్ కారణంగా అమాయకులు బస్సులో కాలి బూడిద అయ్యారు
-
కర్నూలు బస్సు ప్రమాదంలో సంచలన నిజాలు వెల్లడించిన పోలీసులు..
-
కొంపముంచిన నారా వారి మద్యం దుకాణాలు
-
కర్నూలు బస్సు ప్రమాదం.. ఆ ఇద్దరిపై కేసు నమోదు
కర్నూలు జిల్లా: చిన్న టేకూరు వద్ద జరిగిన కావేరీ ట్రావెల్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందికొండ పోలీస్ స్టేషన్లో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ1గా వి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్, ఏ2గా వి కావేరి ట్రావెల్స్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేటకు చెందిన ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. డ్రైవర్‌తో పాటు యజమానిపై రెండు సెక్షన్ల కింద BNS 125(a), 106(1) సెక్షన్లు పోలీసులు నమోదు చేశారు.కాగా, 19 మంది సజీవ దహనానికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్య అర్హత లేకున్నప్పటికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. ప్రమాదం నేపథ్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుటుంబ నేపథ్యం, ప్రవర్తన, అలవాట్లపై అధికారులు ఆరా తీశారు. ఈయన 5వ తరగతి వరకే చదువుకున్నాడని, అయితే టెన్త్ ఫెయిల్ అయినట్లు సర్టిఫికెట్ ఇచ్చి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని గుర్తించారు.మొదట లారీ క్లీనర్‌గా, తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు. 2004లో లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు ఢీకొనడంతో అప్పట్లో లారీ క్లీనర్ మృతి చెందాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్‌గా మానేసి కొన్నాళ్లు ట్రాక్టర్ కొని స్వగ్రామంలో వ్యవసాయం చేశాడు. తర్వాత ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌గా ఏడెనిమిదేళ్ల నుంచి వెళ్తున్నాడని తెలిసింది. లక్ష్మయ్య తండ్రి రాములు రెండు నెలల కిందట మృతి చెందాడు. ఇతనికి భార్య, ఓ కుమారుడు, ఓ కుమార్తె, ఒక సోదరుడు, ఇద్దరు అక్కలు ఉన్నారు. లక్ష్మయ్యకు అప్పుడప్పుడు మద్యం సేవించే అలవాటు ఉందని సమాచారం. -
కర్నూలు బస్సు ప్రమాదం.. ఎలా జరిగిందంటే..? ఎవరి పాపం ఎంత?
-
ఆ ఒక్కరు ఎవరు?
సాక్షి ప్రతినిధి కర్నూలు: కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతైన బస్సులో టిక్కెట్లు ముందుగా బుక్ చేసుకున్న 40 మందిలో ఓ వ్యక్తి చివరి నిమిషంలో బస్సు ఎక్కక పోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇదే క్రమంలో ముందుగా టిక్కెట్ బుక్ చేసుకోకుండా ఆరంఘర్‌లో బస్సు ఎక్కిన ఓ వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో 19 మంది మృతుల్లో 18 మందికి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి ఫోరెన్సిక్ వైద్యులు డీఎన్ఏ నమూనాలు సేకరించారు. మరో మృతుని బంధువులు మాత్రమే రాలేదు. కలెక్టరేట్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్లకు కూడా ఎవ్వరూ ఫోన్ చేయలేదు. ఎవరైనా రెండు రోజులుగా కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా ఉండి, వ్యక్తి మిస్సయ్యారని భావిస్తే కంట్రోల్ రూంకు ఫోన్ చేయాలని కలెక్టర్ సిరి తెలిపారు. ఈ వ్యక్తి బంధువులు వస్తే, వారి డీఎన్ఏ సేకరించి, దాంతో సరిపోలిన డీఎన్ఏ ఉన్న మృతదేహాన్ని అప్పగిస్తారు. ఒకటి రెండు రోజుల్లో డీఎన్ఏ రిపోర్టులు రానున్నాయి. ఆ వెంటనే 18 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహానికి సంబంధించి సంబంధితులు ఎవరూ రాకపోతే మార్చురీలోనే ఉంచనున్నారు. ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్లో పరిశోధన బస్సు ప్రమాదం, ప్రమాద తీవ్రత కారణాలపై ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ) అధికారులు పరిశోధన చేస్తున్నారు. ఇప్పటి వరకు బస్సు ప్రమాదంపై ఎలాంటి ప్రాథమిక నివేదిక ఇవ్వలేదని, మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని ఫోరెన్సిక్ అధికారులు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఫోరెన్సిక్ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు.. బైక్ పెట్రోల్ ట్యాంకు పేలి మంటలు చెలరేగడంతో పాటు బస్సు డీజిల్ ట్యాంకు పక్కన లైటింగ్, ఇతర అవసరాల కోసం వినియోగించే రెండు పెద్ద బ్యాటరీలు పేలాయి. దీనివల్ల పేలుడు సంభవించింది. అలాగే ప్రయాణికుల సెల్ఫోన్లతో పాటు లగేజీ క్యారియల్‌లో ఉన్న 200 సెల్ఫోన్లలో కొన్ని పేలాయి. అయితే సెల్ఫోన్లు పేలడంతో ప్రమాద తీవ్ర పెరగలేదని వారు చెబుతున్నారు. గతంలో మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో జరిగిన జబ్బార్ బస్సు ట్రావెల్స్‌లో కూడా బ్యాటరీలు పేలాయని చెప్పారు. ప్రస్తుత బస్సు ప్రమాదంలో మాత్రం సెల్ఫోన్లలో కొన్ని మాత్రమే కాలిపోయాయని, తక్కినవన్నీ బాక్సులో అలాగే ఉన్నాయని తెలిపారు. డడీఎన్ఏ నమూనాలు విమానంలో తీసుకెళ్లేందుకు నిరాకరణబస్సు ప్రమాదంలో మృతుల గుర్తింపు అందుకే ఆలస్యం! కర్నూలు (హాస్పిటల్): కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి డీఎన్ఏ నమూనాలతో పాటు వారి కుటుంబీకుల రక్త శాంపిల్స్‌ను విమానంలో విజయవాడ తీసుకెళ్లేందుకు నిరాకరించినట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మృతదేహాల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు తీసి డబ్బాల్లో భద్రపరిచారు. వాటిని విమానంలో విజయవాడ తరలించేందుకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే చివరి నిమిషంలో విమానంలో డీఎన్ఏ నమూనాలు తీసుకెళ్లేందుకు నిరాకరించారని సమాచారం రావడంతో వైద్యులు నిట్టూర్చారు. దీంతో రాత్రి 2 గంటల సమయంలో మొత్తం మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలతో పాటు కుటుంబీకుల రక్త శాంపిల్స్‌ను మహాప్రస్థానం వాహనంలో మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ లే»ొరేటరీకి పంపించారు. సాధారణంగా కర్నూలు నుంచి విజయవాడకు వాహనంలో వెళ్లేందుకు 8 నుంచి 12 గంటల సమయం పడుతుంది. అదే విమానంలో అయితే గంటలో వెళ్లిపోవచ్చు. ప్రమాదాలు జరిగినప్పుడు మృతదేహాలు గుర్తించలేని స్థితిలో ఉన్న సమయంలో డీఎన్ఏ పరీక్షల నివేదిక అనివార్యమైనప్పుడు.. సమయాన్ని ఎంతగా తగ్గిస్తే అంత త్వరగా బాధితులకు సాంత్వన చేకూర్చవచ్చు. విమానంలో వాటిని తరలించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు అంగీకరించకపోవడం విమర్శలకు తావిస్తోంది. విమానంలో పంపి ఉంటే డీఎన్ఏ నివేదికలు 12 గంటలు ముందుగా వచ్చే అవకాశం ఉండేది. ప్రస్తుతం డీఎన్ఏ పరీక్షల నివేదికలు రావాలంటే సోమవారం వరకు ఆగాల్సిందే. అప్పటివరకు మృతదేహాల కోసం వారి కుటుంబసభ్యులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
ప్రత్యక్ష నరకం!
కర్నూలు (హాస్పిటల్): ‘ఎవరి శరీరానికైనా కొంచెం నిప్పు తగిలితే సుర్రుమంటుంది. కానీ అత్యధిక వేడితో శరీరం కాలిపోతున్నా వారికి తెలియలేదంటే పరిస్థితి ఎంతటి భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బస్సు మంటల్లో కాలిపోతున్నప్పుడు వెలువడిన విష వాయువులు పీల్చడం వల్ల అందులో ప్రయాణిస్తున్న వారు స్పృహ కోల్పోయారు. ఇదే సమయంలో మంటలు వారిని దహించేసి ఉంటాయి’ అని కర్నూలు మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టి.సాయిసుదీర్ వెల్లడించారు. కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మంటల్లో కాలిపోయి మరణించిన విషయం తెలిసిందే. కాళ్లు, చేతులు బూడిదైపోగా.. మిగిలిన మొండేల నుంచి డీఎన్ఏ పరీక్ష కోసం శాంపిల్స్ సేకరించారు. శనివారం వరకు 18 మంది మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని మంగళగిరిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించారు. రెండు రోజుల్లో నివేదికలు రానున్నాయి. మరో గుర్తు తెలియని వ్యక్తి కుటుంబీకుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన బస్సును సునిశితంగా పరిశీలించిన డాక్టర్ సాయిసు«దీర్ శనివారం ‘సాక్షి’తో పలు విషయాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘వరంగల్‌లో రైలు ప్రమాదం తర్వాత ఒకేసారి మంటల్లో కాలిపోయి కుప్పగా, ముద్దగా మారిన మృతదేహాలను ఇప్పుడే చూస్తున్నా. ఘటన స్థలాన్ని చూడగానే అయ్యో పాపం.. ఏమిటీ దారుణం అని బాధపడ్డాను. కాలిన బస్సు ఎక్కి మృతదేహాలను పరిశీలించాను. బస్సు తగలబడుతున్నప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు ఎంతగా ప్రయత్నించారో ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ముందున్న తలుపు తెరుచుకోకపోవడంతో వెనుక వైపునకు వెళ్లేందుకు అందరూ ప్రయత్నించినట్లున్నారు.ఇదే సమయంలో వారిని కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్ వంటి విపరీతమైన విష వాయువులు కమ్మేసి ఉంటాయి. ఈ వాయువులు ఒకేసారి పీల్చడం వల్ల అందరూ ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఇలా బస్సు మధ్యలో కొందరు, చివరలో కొందరు కుప్పకూలిపోయినట్లు కనిపించారు. అదే సమయంలో వ్యాపించిన మంటలకు వారు ఆహుతై ఉంటారు. ఇలాంటి మంటలు నిమిషాల వ్యవధిలోనే మనిషిని ముద్దగా, బొగ్గుగా మార్చేస్తాయి. దాదాపుగా అన్ని మృతదేహాలకు శరీరంలో కేవలం తల, మొండెం మాత్రమే మిగిలాయి. పుర్రెలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకుంటే రాలిపోతున్నాయి. బస్సులో ఇలాంటి దృశ్యాలను చూసి చలించిపోయాను. కొద్దిసేపటి తర్వాత తేరుకుని నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఏయే ఏర్పాట్లు కావాలో.. అక్కడున్న అధికారులకు వివరించాను. ఇందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సహకరించారు. తాత్కాలిక మార్చురీలో పోస్టుమార్టం పోస్టుమార్టం నిర్వహించేందుకు నాతో పాటు ఫోరెన్సిక్ ప్రొఫెసర్ డాక్టర్ పి.బ్రహ్మాజీ మాస్టర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ కె.నాగార్జున, డాక్టర్ పి.హరీష్‌కుమార్, డాక్టర్ వి.సురేఖ, డాక్టర్ ఎండి. మహమ్మద్ సాహిల్‌తో పాటు 10 మంది పీజీలు కలిసి ఆరు బృందాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్కరు మూడు చొప్పున మృతదేహాల చొప్పున పోస్టుమార్టం చేశాం. ప్రమాదం జరిగిన స్థలంలోనే తాత్కాలిక మార్చురీ గదిని ఏర్పాటు చేయించాం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ పోస్టుమార్టం నిర్వహించాం. మరికొన్ని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు డీఎన్ఏ పరీక్ష కోసం నమూనాలు తీశాం. మృతదేహాల్లో కండరాల టిష్యూ, దంతాలు, తొడ ఎముకలను నమూనాలుగా సేకరించాం. మిగిలిన మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి కాబట్టి ఏ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్ష అనివార్యమైంది. కుటుంబ సభ్యుల డీఎన్ఏతో పోలచ్చి చూసి పోలీసుల సమక్షంలో మృతదేహాలను వారి రక్త సంబం«దీకులకు అప్పగిస్తాం. చాలా మంది శరీరాలు బొగ్గుగా, ముద్దగా, బూడిదగా మారినా, వారి శరీరాలపై ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల మెడల్లో మంగళసూత్రాలు, చేతి గాజులు, చైన్లు వంటివి కాలకుండా కనిపించాయి. బంగారు ఆభరణాలు కరిగిపోవాలంటే ఇంకా ఎక్కువ వేడి అవసరం. -
బైకర్ శివశంకర్ అక్కడికక్కడే మృతి... గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి
-
వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ.. అసలు జరిగింది ఇదే..
సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ వీడింది. దర్యాప్తులో పలు కీలక విషయాలను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. బైక్ నడిపిన శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రి స్వామి(నాని)గా గుర్తించారు. శివశంకర్, ఎర్రి స్వామి ఇద్దరూ లక్ష్మీపురం గ్రామం నుండి అర్ధరాత్రి తర్వాత సుమారు 2 గంటల సమయంలో తుగ్గలి దిశగా బయలుదేరారు. ఎర్రి స్వామిని వదిలి.. తిరిగి రావడం కోసం శివశంకర్ బయలుదేరినట్లు తెలిసింది.బైక్ (పల్సర్)పై ప్రయాణించిన వీరు కియా షోరూం సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రాత్రి 2.24 గంటలకు రూ.300 పెట్రోల్ కొట్టించుకుని తిరిగి బయలుదేరారు. బయలుదేరిన కొద్ది సేపటికే చిన్న టేకూరు సమీపంలో బైక్ స్కిడ్ అవడంతో రోడ్డు కుడి వైపున ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్ నడిపిన శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.ప్రమాద స్థలంలో శివశంకర్‌కు సాయం చేయడానికి ప్రయత్నించిన ఎర్రి స్వామి.. బైక్‌ను రోడ్డుపై నుంచి తీయబోయే సమయంలోనే బస్సు బైక్‌ను ఢీకొట్టి.. కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. బస్సు కింద మంటలు రావడంతో భయపడిన ఎర్రి స్వామి అక్కడి నుంచి తన స్వగ్రామమైన తుగ్గలికి వెళ్లిపోయాడు. ఈ ప్రమాదంపై ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. -
Bus Incident: పోలీసుల విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు
-
కర్నూలు బస్సు ఘటనలో షాకింగ్ ట్విస్ట్
-
కర్నూలు బస్సు ప్రమాదంలో వెలుగులోకి సంచలన విషయాలు
-
బస్సులో ఉండాల్సిన రక్షణ వ్యవస్థలు
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ప్యాసింజర్లు మరణించడం అత్యంత దురదృష్టకరం. ఇలాంటి ఘటనలు ప్రయాణికుల భద్రతపై ఆందోళనలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ, స్లీపర్ బస్సుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన భద్రతా వ్యవస్థలు, వాటిని ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడానికి కింది భద్రతా వ్యవస్థలు, సదుపాయాలు ఎంతో అవసరం అవుతాయి.ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక భద్రత)అగ్నిప్రమాదాల వల్ల బస్సుల్లో తీవ్రత అధికంగా ఉంటుంది. ఏసీ, స్లీపర్ బస్సుల్లో కిటికీలు తెరవడానికి వీలులేకపోవడం, తక్కువ ఎంట్రీ/ ఎక్జిట్ మార్గాలు ఉండడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఇంజిన్ లేదా ఇతర భాగాల్లో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు, పొగ వచ్చినప్పుడు వెంటనే డ్రైవర్‌ను, ప్రయాణికులను అప్రమత్తం చేసే సెన్సార్ ఆధారిత అలారం వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా, సులభంగా ఉపయోగించగలిగే కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ ఫైర్ ఎక్స్‌టింగ్యుషర్లు ఉండాలి.ఎమర్జెన్సీ ఎక్జిట్సాధారణ ఎంట్రీ/ ఎక్జిట్ ద్వారాలు కాకుండా బస్సులో కనీసం రెండు సులభంగా తెరవగలిగే అత్యవసర ద్వారాలు (కిటికీలు లేదా హాచ్లు) తప్పనిసరిగా ఉండాలి. ఈ మార్గాలను స్పష్టంగా గుర్తించేలా ఏర్పాటు చేయాలి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిప్రమాదం తీవ్రతను తగ్గించడానికి ఇంధన సరఫరాను ఆటోమేటిక్‌గా నిలిపివేసే వ్యవస్థ ఉండాలి.ఫస్ట్ ఎయిడ్ (ప్రథమ చికిత్స) కిట్ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో బ్యాండేజీలు, యాంటీసెప్టిక్ వైప్స్, కత్తెర, పట్టీలు, నొప్పి నివారణ మందులు (చిన్న గాయాలు, తలనొప్పి, వాంతులు మొదలైన వాటికి), బర్న్ క్రీమ్స్ వంటి ప్రాథమిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉంచాలి. డ్రైవర్, అటెండర్లు ఈ పరికరాలను ఉపయోగించడంపై శిక్షణ పొంది ఉండాలి.ఇతర భద్రతా అంశాలుఅత్యవసర పరిస్థితుల్లో (ముఖ్యంగా అగ్నిప్రమాదం లేదా బస్సు నీటిలో పడినప్పుడు) కిటికీల అద్దాలు పగలగొట్టి బయటపడేందుకు ఉపయోగపడే సేఫ్టీ హ్యామర్లు బస్సులో కనీసం 4-6 చోట్ల ఏర్పాటు చేయాలి.స్లీపర్ బెర్త్‌ల్లో ఇవి లేకపోయినా సీటింగ్ విధానం ఉన్న బస్సుల్లో కచ్చితంగా సీట్ బెల్ట్‌లు ఉండాలి.ప్రమాదం జరిగినప్పుడు డ్రైవర్‌ను, ఇతరులను అప్రమత్తం చేయడానికి ఉపయోగించే అత్యవసర బటన్ ఉండాలి.ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు కూడా మార్గాలు కనిపించేలా అత్యవసర లైటింగ్ వ్యవస్థ ఉండాలి.భద్రతా వ్యవస్థలను ఉపయోగించే విధానంఅగ్నిప్రమాదం సంభవించినప్పుడు మొదట డ్రైవర్‌ను, తోటి ప్రయాణికులను వెంటనే అప్రమత్తం చేయాలి. అత్యవసర బటన్‌ను నొక్కాలి. అగ్ని ప్రమాద సమయంలో దగ్గరలో ఉన్న ఫైర్ ఎక్స్టింగ్యుషర్ను ఉపయోగించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాలి. మంటలు అదుపు తప్పితే వెంటనే బయటకు వెళ్లాలి. ప్రమాద సమయాల్లో అత్యవసర ద్వారాలు లేదా కిటికీలు (సేఫ్టీ హ్యామర్‌తో పగలగొట్టి) ద్వారా బయటకు రావాలి.బస్సు నుంచి బయటకు వచ్చిన తర్వాత గాయాలు తగిలిన వారికి ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లో ఉన్న యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేసి, బ్యాండేజీ వేయాలి. ఎక్కువగా రక్తస్రావం అవుతుంటే శుభ్రమైన గుడ్డ లేదా ప్యాడ్‌తో గాయంపై గట్టిగా నొక్కి పట్టుకోవాలి. వీలైనంత త్వరగా వైద్య సాయం అందేలా చూడాలి.ఇదీ చదవండి: భారత్‌లో సొంతింటి కోసం తంటాలు.. కానీ చైనాలో.. -
ఫుల్ గా తాగి వచ్చి.. బైక్ పై స్టంట్లు చేస్తూ..! పెట్రోల్ బంక్ ఉద్యోగి సంచలన నిజాలు
-
Bus Fire: 50 లక్షలు ఇవ్వాల్సిందే.. అంజాద్ బాషా రియాక్షన్
-
ఆరోజు జగన్ కోటి రూపాయలు ప్రకటిస్తే..! నువ్వు 2 లక్షలు ఇస్తావా?
-
జగన్ హయాంలో కోటి ఇచ్చాడు నువ్వు 2 లక్షలు ఇచ్చి ఏం చేసినట్టు..
-
కర్నూలు ఘటన.. మరో షాకింగ్ ట్విస్ట్!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. బైక్.. బస్సునుగానీ, బస్సును.. బైక్ గానీ ఢీ కొట్టలేదని తెలుస్తోంది. అయితే బైక్ ప్రమాదానికి గురైన తర్వాతే.. బస్సు దానిని ఈడ్చుకెళ్లిందని, ఈ క్రమంలోనే ఘోర ప్రమాదం జరిగిందని తాజాగా పోలీసులు నిర్ధారించుకున్నట్లు సమాచారం. కర్నూలు బస్సు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాదానికి కారణంగా భావిస్తున్న బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. అతని నుంచి పోలీసులు సేకరించిన వివరాలు ఇలా ఉన్నాయి..శివశంకర్‌తోపాటు అతని స్నేహితుడు ఎర్రి స్వామి ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటాక వర్షంలో వెళ్తుండగా.. చిన్నటేకూరు వద్ద బైక్ స్కిడ్ అయ్యి ఇద్దరూ పడిపోయారు. డివైడర్‌కు బలంగా తల ఢీ కొట్టడంతో శంకర్ బలమైన గాయమై అక్కడికక్కడే చనిపోయాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి.. రోడ్డు పక్కనే కూర్చుని పోయాడు. సరిగ్గా అదే సమయంలో.. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్‌ను వీ కావేరీ ట్రావెల్స్ బస్సు ఈడ్చుకెళ్లింది. కాస్త దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి ప్రమాదం సంభవించింది. అది చూసి భయపడిపోయిన శివశంకర్ స్నేహితుడు ఎర్రి సామి అక్కడి నుంచి పోరిపోయాడు. సీసీ ఫుటేజీ, సెల్‌ఫోన్ నెంబర్ల ఆధారంగా అతన్ని పట్టుకున్న పోలీసులు.. అతని స్టేట్మెంట్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎర్రి స్వామిని పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఎర్రిస్వామిని రహస్యంగా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఎర్రిస్వామి ఇచ్చే స్టేట్మెంట్ కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: కర్నూలు ఘటన.. ఎట్టకేలకు డ్రైవర్ అరెస్ట్ -
మా పిల్లల ప్రాణాలు తీస్తారా? డ్రైవర్ కు ఉరిశిక్ష వేయాల్సిందే!
-
శవపేటికగా మారిన స్లీపర్ బస్..!
-
బైకర్ శివ శంకర్ CCTV ఫుటేజ్.. అతని ఫ్రెండ్ ఎక్కడ..?
-
400 సెల్ఫోన్లు పేలితే ఇంత తీవ్రత ఉంటుందా?
కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా కొత్త కోణాన్ని గుర్తించాయి. ప్రమాదానికి ఇతర అంశాలు కారణమైనా, బస్సు లగేజీ క్యాబిన్లో ఉన్న సుమారు 400 మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిపాయి.ఘటన జరిగిందిలా..కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోంది. అయితే ప్రాథమిక వివరాల ప్రకారం.. బస్సు ఒక బైకును ఢీకొట్టగానే ఆ బస్సు కింద బైకు ఇరుక్కుపోయింది. దాన్ని కొంత దూరం ఈడ్చుకెళ్లడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ మంటలు తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. అధిక వేడి వల్ల ఈ ఫోన్లలో వాడే బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి.బ్యాటరీలు పేలడం వల్ల భారీ శబ్దం వచ్చి మంటలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మంటలు లగేజీ క్యాబిన్ పైభాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వేగంగా వ్యాపించాయి. లగేజీ క్యాబిన్ పైభాగంలో, అంటే బస్సు మొదటి భాగంలో ఉండే సీట్లు, బెర్తుల్లో ఉన్నవారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకున్న ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో బయటపడలేకపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మాత్రం తన సీటు పక్కన ఉండే కిటికీ నుంచి తప్పించుకున్నాడు. ప్రాథమికంగా ఫొరెన్సిక్ అధికారులు చెప్పిన పైవివరాల ప్రకారం బస్సు ఢీకొనడం వల్ల మంటలు ప్రారంభమైనప్పటికీ మొబైల్ ఫోన్లలోని బ్యాటరీల పేలుడే ప్రమాద తీవ్రతను పెంచింది.లిథియం అయాన్ బ్యాటరీలుమొబైల్ ఫోన్లలో సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ బ్యాటరీలు అధిక శక్తి సాంద్రత కలిగి ఉండటం వల్ల చిన్న పరిమాణంలో ఎక్కువ శక్తిని నిల్వ చేయగలవు. అయితే ఇవి వేడెక్కినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తాయి.ఈ బ్యాటరీలు పేలేందుకు కారణాలుఈ బ్యాటరీలకు వేడి తగిలితే పేలే అవకాశం ఉంటుంది. బస్సు ప్రమాదంలో జరిగింది ఇదే. బయట నుంచి అగ్ని ప్రమాదం కారణంగా వేడి ఎక్కువై పార్శిల్ క్యాబిన్లోకి వచ్చింది. దాంతో ఫోన్లలోని బ్యాటరీలు వేడై పేలిపోయాయి.బ్యాటరీ పూర్తిగా నిండిన తర్వాత కూడా ఛార్జింగ్ కొనసాగడం వల్ల బ్యాటరీ లోపల ఉష్ణోగ్రత పెరుగుతుంది.బ్యాటరీ లోపల అనోడ్, కాథోడ్ పొరలు దెబ్బతినడం లేదా పటిష్టమైన తయారీ విధానాలు అనుసరించకపోవడంతో అవి ఒకదానితో ఒకటి తాకితే పేలిపోతాయి.పూర్తిగా బ్యాటరీ అయిపోయేంత వరకు వేచి చూసి ఒక్కసారిగా ఛార్జింగ్ పెట్టినా పేలే అవకాశం ఉంటుంది.బస్సు ఢీకొన్న సందర్భంలో పార్శిళ్లు, అందులోని వస్తువులు గట్టిగా కొట్టుకోవడం వల్ల బ్యాటరీ నిర్మాణంలో మార్పులు వచ్చి అంతర్గత షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.బ్యాటరీ పేలుడు వెనుక రసాయన చర్యలులిథియం అయాన్ బ్యాటరీ పేలడాన్ని ‘థర్మల్ రన్అవే’ అని కూడా పిలుస్తారు. అధిక వేడిమి లేదా షార్ట్ సర్క్యూట్ కారణంగా బ్యాటరీ సెల్లో ఉష్ణోగ్రత నిర్ణీత పరిమితి దాటినప్పుడు థర్మల్ రన్అవేకు దారి తీస్తుంది. మొదట కాథోడ్, అనోడ్లను వేరు చేసే సెపరేటర్ (పాలిమర్) కరిగిపోతుంది. సెపరేటర్ కరగడం వల్ల కాథోడ్, అనోడ్ నేరుగా ఒకదాంతో ఒకటి తాకి ఇంటర్నల్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుంది. దీనివల్ల మరింత ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. అధిక ఉష్ణోగ్రత వద్ద అందులోని కెమికల్స్ విచ్ఛిన్నం కావడం మొదలవుతుంది. అదే సమయంలో ఎలక్ట్రోలైట్ (బ్యాటరీ లోపల ఉండే ద్రవం) వేడెక్కి ఆవిరై మండే స్వభావం గల హైడ్రోకార్బన్ వాయువులను విడుదల చేస్తుంది.ఈ చర్యలో విడుదలైన ఆక్సిజన్, ఇతర మండే వాయువులు అధిక వేడి వల్ల మరింత తీవ్రంగా పేలిపోతాయి. ఒక సెల్ పేలడం వల్ల విడుదలైన వేడి పక్కనే ఉన్న ఇతర మొబైళ్లకు వ్యాపించి అవి కూడా థర్మల్ రన్అవేకు గురవుతాయి. ఈ గొలుసుకట్టు చర్య కారణంగా బస్సు లగేజీ క్యాబిన్లో వందల కొద్దీ ఫోన్లు వరుసగా పేలి భారీ శబ్దంతో అగ్ని తీవ్రత పెరగడానికి కారణం కావచ్చు.లిథియం బ్యాటరీలతో జాగ్రత్త - నాగసాయి, ఏసీపీ, సిటీ సెక్యూరిటీ వింగ్, సైబరాబాద్కర్నూలు బస్సు అగ్ని ప్రమాద సంఘటన దురదృష్టకరం. క్లూస్ టీమ్ ప్రాథమికంగా విచారించిన అంశాలను బట్టి బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో కింద ఇరుక్కుపోయి మంటలు చెలరేగాయి. అవికాస్తా పార్శిల్ క్యాబిన్‌కు వ్యాపించి అందులోని మొబైళ్లు ఒక్కసారిగా పేలాయి. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది. సాధారణంగా ఫోన్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీలకు పేలే గుణం ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా అవి పేలే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఫోన్లు వాడటం జీవితంలో భాగమైంది. ఈ క్రమంలో యూజర్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఛార్జింగ్ చేసేటప్పుడు లేదా సాధారణంగా ఉపయోగించేటప్పుడు ఫోన్‌ను ఎండలోగానీ, కారు డాష్బోర్డ్ల్లో, స్టవ్ లేదా రేడియేటర్ వంటి అధిక వేడిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో పెట్టకూడదు. వేడి పెరిగితే బ్యాటరీ పేలే ప్రమాదం ఉంటుంది.ఎల్లప్పుడూ ఫోన్ తయారీదారు సిఫార్సు చేసిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్‌ను మాత్రమే ఉపయోగించాలి.నాసిరకం ఛార్జర్లు ఓవర్ఛార్జింగ్కు లేదా అధిక వేడికి దారితీయవచ్చు.ఫోన్‌ను రాత్రంతా లేదా ఎక్కువ సేపు ఛార్జింగ్‌లో ఉంచడం మానుకోండి. 80 నుంచి 90 శాతం వరకు ఛార్జ్ అయిన తర్వాత తీసివేయడం ఉత్తమం.ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్‌ను వాడడం మానుకోవాలి. దీనివల్ల వేడి పెరిగే ప్రమాదం ఉంది.ఛార్జింగ్ చేసేటప్పుడు ఫోన్‌ను దుప్పటి, దిండు లేదా మంచం వంటి గాలి ఆడకుండా ఉండే మెత్తటి ఉపరితలాలపై కాకుండా గట్టి, చల్లటి ఉపరితలం (టేబుల్)పై ఉంచండి.బ్యాటరీ స్థాయి 20 శాతం కంటే తక్కువకు పడిపోకుండా చూసుకోవడం మంచిది.ఫోన్‌ను కింద పడేయడం, బలంగా కొట్టడం లేదా వంచడం వంటివి చేయకండి. దీనివల్ల బ్యాటరీ లోపల షార్ట్ సర్క్యూట్‌కు దారితీయవచ్చు.మీ ఫోన్ బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే లేదా ఫోన్ వెనుక భాగం ఉబ్బినట్లయితే వెంటనే దాన్ని ఉపయోగించడం ఆపివేసి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. ఉబ్బిన బ్యాటరీలు చాలా ప్రమాదకరం.ఒక్క మొబైళ్లలోనే కాదు, ఇంట్లో వాడే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవీ వాహనాల్లోనూ లిథియం బ్యాటరీలు వాడుతున్నారు. వీటిని వాడే సమయంలో నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. -
ప్రమాదానికి ముందు.. మద్యం మత్తులో బైకర్..
-
కర్నూలు బస్సు ప్రమాదంలో బయటపడ షాకింగ్ వీడియో..
-
కర్నూలు ఘటన: బైకర్ శివశంకర్ వీడియో వైరల్
సాక్షి, కర్నూలు: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఈ వీడియో ద్వారా శివశంకర్ మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. బస్సు ప్రమాద ఘటనలో పల్నాడు జిల్లాలకు చెందిన డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివశంకర్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు బైక్‌కు పెట్రోల్ కొట్టించినట్టు వీడియోలో కనిపిస్తోంది. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో శివశంకర్‌తో పాటుగా అతడి స్నేహితుడు కలిసి పెట్రోల్ బంక్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత ఒక్కడే బైక్‌పై వెళ్లినట్టు వీడియోలో ఉంది. శివశంకర్ బంక్‌లో ఉన్న సమయంలో స్టంట్ చేయడం, తడబడుతున్నట్టుగా కూడా కనిపించింది. బైక్ స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లిన వెంటనే స్కిడ్ అయినట్టుగా వీడియోలో స్పష్టంగా ఉంది. దీంతో, అతడు మద్యం సేవించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండగా.. శివశంకర్ వచ్చిన బైక్ చాలా దారుణంగా ఉంది.. బైక్‌కు హెడ్‌లైట్ లేకపోవడం గమనార్హం. పైగా అతడు ర్యాష్ డ్రైవింగ్ చేసే విధంగా కనిపించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యపై ఉలిందకోండా పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును ప్రయాణికుడు రమేష్ ఫిర్యాదు చేయగా... బస్సు నడిపిస్తున్న ముత్యాల లక్ష్మయ్య, అతని సహచరుడు జి. శివనారాయణని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మయ్యపై సెక్షన్ 125/A, 106 C, సంబంధిత నిబంధనల ఆధారంగా కేసులు నమోదు చేసి, 19 మంది ప్రయాణికుల మరణానికి బాద్యుడుగా పేర్కొన్నారు. అలాగే, బస్సు మేనేజ్మెంట్ కూడా ఈ ఘటనకు బాధ్యులుగా ఉంచారు.ఇది కూడా చదవండి: కర్నూలు బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. వందల ఫోన్లు పేలడం వల్లే మంటలు..ఇదిలా ఉండగా.. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో నిద్రిస్తున్నప్పటికీ, అప్రమత్తమై పలువురి ప్రాణాలను కాపాడి హీరోగా ప్రశంసలు అందుకున్న రెండో డ్రైవర్ శివనారాయణ (30) ఇప్పుడు పోలీసుల అనుమానపు నీడలో చిక్కుకున్నాడు. విచారణలో అతడు తన వాంగ్మూలాన్ని మార్చడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అయితే, ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మయ్య.. నిద్రిస్తున్న రెండో డ్రైవర్ శివనారాయణను నిద్ర లేపాడు. వెంటనే స్పందించిన శివనారాయణ పొగతో నిండిపోయి, డోర్లు తెరుచుకోని స్థితిలో ఉన్న బస్సు కిటికీలను ఒక రాడ్‌తో పగలగొట్టి చాలా మంది ప్రయాణికులను బయటకు లాగాడు. "నన్ను మొదట బయటకు లాగింది ఒక యువకుడే. అతడే రెండో డ్రైవర్ అని నాకు తర్వాత తెలిసింది" అంటూ ప్రాణాలతో బయటపడిన సుబ్రమణ్యం అనే ప్రయాణికుడు చెప్పాడు. అనుమానాలకు కారణమేంటి?ప్రమాదం జరిగిన వెంటనే అసలు డ్రైవర్ లక్ష్మయ్య ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. పోలీసులు శివనారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా అతను తన వాంగ్మూలాన్ని మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. మొదట బస్సు ఒక వాహనాన్ని ఢీకొట్టిందని, అది తీవ్రమైన ప్రమాదం కావచ్చని లక్ష్మయ్య తనను నిద్రలేపాడని చెప్పాడు. తర్వాత బస్సు కింద మోటార్ సైకిల్ ఇరుక్కుపోయినట్లు గుర్తించామని తెలిపాడు. అయితే, ఆ తర్వాత మాట మార్చి 'అంతకుముందే జరిగిన వేరే ప్రమాదంలో మోటార్‌సైకిల్, దానిపై ఉన్న వ్యక్తి రోడ్డుపై పడి ఉన్నారని, అది గమనించని లక్ష్మయ్య వారిపై నుంచి బస్సును నడపడంతో మంటలు చెలరేగాయని' చెప్పినట్లు పోలీసులు తెలిపారు. బస్సు యజమానులు తమ సంస్థపై విచారణ జరగకుండా ఉండేందుకు డ్రైవర్లను తప్పుదారి పట్టించేలా ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
రాత్రి రెండున్నర.. నిమిషాల్లో అంతా బూడిదే..
-
బతుకులు బుగ్గి.. ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కితే పరలోకమే?
-
భరించలేనంత బాధ.. కర్నూల్ ఘటనపై రష్మిక ఎమోషనల్
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. ఈ ఘటన గురించి సినీ నటి రష్మిక మందన్న స్పందించారు. 'కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం నిమిషాల్లోనే తమ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుంటే చాలా బాధేస్తుంది. నిజంగా ఈ సంఘటన వినాశకరమైనది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా నివాళి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి.. దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా'అంటూ సోషల్‌మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేశారు.ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. నెల్లూరుకు చెందిన అనూష ఆ మంటల్లో ఎలాగైనా తన కుమార్తెను కాపాడుకోవాలని బిడ్డను కౌగిలించుకుని అలాగే కాలిపోయిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులున్నారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలను ధ్వంసం చేసి అతి కష్టంగా 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.The news from Kurnool has been weighing heavily on my heart. Imagining what those passengers must’ve gone through inside that burning bus is just unbearable..To think that an entire family, including little kids, and so many others lost their lives in minutes it’s truly…— Rashmika Mandanna (@iamRashmika) October 24, 2025 -
కర్నూలు ప్రమాదంలో కొత్త కోణం!.. 400 ఫోన్లు పేలడం వల్లే మంటలు
సాక్షి, అమరావతి: కర్నూలు చిన్నటేకూరు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ అగ్నిప్రమాదానికి గురైన ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో కొత్త కోణాన్ని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. బస్సు లగేజీ క్యాబిన్లో వందల సంఖ్యలో మొబైల్ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్ టీమ్స్ తెలిపాయి.వివరాల ప్రకారం.. ఫోరెన్సిక్ బృందాలు శుక్రవారం ఉదయం ఘటనాస్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించాయి. ఈ క్రమంలో బస్సులో మొబైల్ ఫోన్లను తరలించినట్టు గుర్తించాయి. ‘ప్రమాదం సందర్భంగా ట్రావెల్స్ బస్సు.. బైకును ఢీకొట్టగానే దాని ఆయిల్ ట్యాంక్ మూత ఊడిపడి అందులోని పెట్రోల్ కారడం మొదలైంది. అదే సమయంలో బస్సు కింది భాగంలో బైక్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లింది. ఈ క్రమంలో మంటలు ప్రారంభమయ్యాయి. ఇవి తొలుత లగేజీ క్యాబిన్‌కు అంటుకున్నాయి. అందులోనే 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉండటంతో అధిక వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయి. బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలడం వల్లే భారీ శబ్దం వచ్చింది. ఆ మంటలు లగేజీ క్యాబిన్ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌కు వ్యాపించాయి. దీంతో లగేజీ క్యాబిన్‌కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న వారికి తప్పించుకునే సమయం లేకుండా పోయింది. అందువల్లే బస్సు మొదటి భాగంలోని సీట్లు, బెర్తుల్లో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. బస్సు లోపల చిక్కుకున్న ప్రయాణికులు తప్పించుకునేందుకు యత్నించినా.. కుడివైపునున్న అత్యవసర ద్వారం తెరుచుకోకపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు’ అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన వెంటనే డ్రైవర్ బస్సును నిలిపి అతని సీటు పక్కన ఉండే కిటికీ డోరు నుంచి దిగి వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు అని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రమాద ఘటనలో తీవ్రత పెరగడానికి మొబైల్ ఫోన్ల పేలుడే కారణమని ప్రాథమికంగా తేలింది. సెల్ఫోన్లు పేలిపోయేందుకు అవకాశం ఉందా?ఛార్జింగ్ చేస్తూండగా సెల్ఫోన్లో మంటలు చెలరేగడం.. కొన్ని సందర్భాల్లో పేలిపోవడం మనం చూస్తూంటాం. అయితే కర్నూలు వద్ద శుక్రవారం తెల్లవారు జరిగిన బస్సు దగ్ధం ఘటనకు కూడా సెల్ఫోన్లు పేలిపోవడం కారణమని తాజాగా అనుమానిస్తున్నారు. మరి.. కేవలం రవాణా చేస్తున్నంత మాత్రన సెల్ఫోన్లు పేలిపోయేందుకు అవకాశం ఉందా? అంటే అవును అంటున్నారు నిపుణులు. చాలా అరుదుగా జరిగేదైనప్పటికీ ప్యాకెట్లలో ఉంచిన సెల్ఫోన్లు పేలిపోయేందుకు చాలా కారణాలే ఉంటాయని విశ్లేషిస్తున్నారు.వీరు చెబుతున్న దాని ప్రకారం.. బ్యాటరీలు డ్యామేజ్ అయినా.. కొంత ఎత్తు నుంచి కిందపడ్డా.. బ్యాటరీలకు చిల్లులు పడ్డా ఫోన్లో షార్క్ సర్క్యూట్ అయ్యేందుకు అవకాశం ఉంది. తద్వారా ఇవి పేలిపోగలవు. విపరీతమైన వేడి కూడా ఫోన్లు పేలిపోయేందుకు కారణం కాగలవు. మండే ఎండలో తలుపులన్నీ బిగించి సెల్‌ఫోన్‌ను కారులో ఉంచినా. విడికి వాటిల్లో ఉపయోగించే లిథియం-అయాన్ బ్యాటరీలు కరిగిపోతాయి. ఈ క్రమంలోనే పేలుడు సంభవించవచ్చు. కొన్ని కొత్తఫోన్లలో బ్యాటరీల్లోనే లోపాలు ఉండేందుకు అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చే టప్పుడు అనేక రకాల భద్రత పరీక్షలు నిర్వహిస్తూంటారు కానీ.. కొన్ని సందర్భాల్లో లోపాలున్న బ్యాటరీలు కూడా మార్కెట్లోకి వచ్చేస్తూంటాయి.పార్సెల్ ఆఫీసుల్లో పోలీసులు తనిఖీలు?ఈ ప్రమాదంలో ఫోన్లు పేలడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ పార్సిల్ ఆఫీసుల్లో.. ఆర్టీవో అధికారులు గానీ, పోలీసులు తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది. ఇలాంటి పేలుడు పదార్థాలకు ప్రధాన కారణంగా ఉన్నటువంటి మొబైల్ ఫోన్లను, సంబంధిత ఇతర వస్తువులను గాని బస్సులలో పంపించకూడదని ఇప్పటికైనా అధికారులు హెచ్చరించే అవకాశం ఏమైనా వుందా? చూడాల్సి ఉంది. -
ఈ ప్రమాదాలకు అసలు కారణం వారే
-
దీపావళికి వచ్చి బయలుదేరి సంక్రాంతికి వస్తామన్నారు.. చివరికి
-
అంతా 15 నిమిషాల్లోనే! నిద్రలేచి చూసేలోపే..
-
కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం
-
ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ
కర్నూలు (హాస్పిటల్)/ రావులపాలెం/ఇంకొల్లు(చినగంజాం): ఒక్కగానొక్క కుమారుడిని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. వారి ఆశలను నెరవేర్చి ఆ యువకుడు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించి కుటుంబానికి తోడుగా నిలబడ్డాడు. బస్సు ప్రమాదం ఆ యువకుడిని కబళించింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సీహెచ్.శ్రీనివాసరావు బ్యాంకులో అప్రెంటిస్‌గా పని చేస్తున్నారు. ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారుడు మేఘనాథ్‌తో పాటు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివాసం ఉంటోంది. మేఘనాథ్ బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉంటున్నాడు. దీపావళి పండుగకు హైదరాబాద్‌కు వచ్చిన మేఘనాథ్.. తిరిగి గురువారం రాత్రి బెంగళూరు బయలుదేరాడు. బస్సు ఎక్కానని రాత్రి 10.30 గంటలకు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అవే అతని చివరి మాటలయ్యాయి. అదే అతనికి చివరి పుట్టినరోజు ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా అంబోదల ప్రాంతానికి చెందిన కె.దీపక్‌కుమార్ (24) బెంగళూరులోని కేపీఎంజీ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతని తండ్రి కె.శ్రీనివాసరావు, తల్లి కె.లీలారాణి ఉద్యోగ రీత్యా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీపక్‌కుమార్ తన పుట్టిన రోజు 16వ తేదీతో పాటు దీపావళి పండుగను కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునేందుకు ఇటీవల హైదరాబాద్ వచ్చాడు. పుట్టిన రోజుతో పాటు పండుగను ఎంతో సంతోషంగా జరుపుకున్నాడు. ఆ ఆనంద క్షణాలను మూట గట్టుకుని బెంగళూరుకు గురువారం రాత్రి పయనమయ్యాడు. తాను బస్సెక్కానని ఇంటికి మెసేజ్ కూడా పెట్టాడు. బస్సు ప్రమాదం అతనికి ఇదే చివరి పుట్టిన రోజుగా మారుస్తుందని ఊహించలేకపోయాడు. తల్లీ కూతురు మృతి హైదరాబాద్‌కు చెందిన చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. ఆమె ఇటీవల దీపావళి పండుగ కోసం హైదారాబాద్‌కు వచ్చింది. ఎంతో వైభవంగా ఆమె కుటుంబ సభ్యులతో దీపావళి పండుగను జరుపుకుంది. అయితే తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు తల్లి సంధ్యారాణిని కూడా తన వెంట తీసుకెళ్లింది. దీంతో రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధం కావడంతో ఇద్దరూ విగత జీవులుగా మిగిలారు. మళ్లీ త్వరలో వస్తానంటూ.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభికి చెందిన చిట్టోజు మేఘనాథ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. ఆయన తండ్రి శ్రీనివాసాచారి గ్రామంలోని ఐఓబీలో బంగారం తూకం వేసే ఉద్యోగి. మేఘనాథ్ భార్య, ఇద్దరు పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. వీకెండ్లో మేఘనాథ్ నగరానికి వచ్చి వెళుతుంటాడు. ఇటీవల దీపావళి సెలవులకు వచ్చిన మేఘనాథ్.. బెంగళూరు వెళ్లేందుకు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కాక ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. మళ్లీ త్వరలో వస్తానని పిల్లలకూ చెప్పాడు. ఇది జరిగిన కొన్ని గంటలకే మేఘనాథ్ మృత్యు ఒడికి చేరాడని తెలిసి ఆ కుటుంబం రోదన వర్ణనాతీతం. మేఘనాథ్ తల్లిదండ్రులు శ్రీనివాసాచారి, విజయలక్ష్మి, చెల్లి యశ్వని ఘటనా స్థలానికి వెళ్లి గుండెలవిసేలా రోదించారు. వల్లభిలో విషాదం అలుముకుంది. -
కాలిపోతున్నాం.. కాపాడండి..
కర్నూలు (సెంట్రల్): కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో జాతీయ రహదారి–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు చివరి వరకు ప్రాణాలను కాపాడుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. బైక్‌ను బస్సు ఢీకొట్టి.. అలాగే 300 మీటర్ల మేర బైక్‌ను లాక్కు పోవడంతో తొలుత బస్సు ముందు భాగంలో మంటలు వ్యాపించాయి. దీంతో ముందు ఉన్న వారు బస్సు మధ్యకు వచ్చి ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేయడానికి విఫల యత్నం చేశారు. అంతలో మంటలు అలుము కోవడంతో ఎక్కువ మంది ఒకేచోట గుమికూడి కిందపడి పోయారు. ఈ క్రమంలో ‘కాలిపోతున్నాం.. కాపాడండి.. బయటకు లాగేయండి.. దేవుడా కాపాడు..’ అంటూ ఆర్తనాదాలు చేశారు. వారి అరుపులు బయటకు వినిపిస్తున్నా తాము ఏమీ చేయలేని పరిస్థితి అని అప్పటికే బస్సులోంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్న వారు తెలిపారు. తొలుత మంటలను అదుపు చేయడానికి నీళ్ల బాటిళ్లతో డ్రైవర్ ప్రయత్నం చేశాడని, అలా కాకుండా ఆయన ఎమర్జెన్సీ డోర్లను బద్దలు కొట్టి ఉంటే మరింత మంది ప్రాణాలతో బయటపడే వారని చెప్పారు.పెద్ద కుదుపు రావడంతో ఒక్కసారిగా లేచాం మాది కర్ణాటకలోని బసవ కల్యాణం. పనిపై హైదరాబాద్ వెళ్లి తిరిగి వెళ్తున్నాను. అర్ధరాత్రి 2.30 – 2.40 గంటల మధ్య ప్రమాదం జరిగింది. అందరూ నిద్రలో ఉన్నారు. అయితే ఒక్కసారిగా పెద్ద కుదుపు రావడంతో చాలా మంది నిద్ర లేచారు. నేనూ అప్పుడే లేచాను. ఏమి జరిగిందోనని చూసుకునేలోపే మంటలు వచ్చాయి. ఎమర్జెన్సీ విండోలు తెరుచుకొని వెళ్లాలని డ్రైవర్ అరిచాడు. వెంటనే నేను ముందుకు వెళ్లి డ్రైవర్ సీటులో నుంచి కిందకు దూకేశాను. – ఆకాష్, బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వ్యక్తి కాపాడండని అరుపులు వినిపించాయి ఒక్కసారిగా బాంబు పడ్డట్లు పెద్ద శబ్దం వినిపించడంతో రోడ్డు వైపు చూశాను. కొద్ది దూరంలో బస్సు మంటల్లో తగలబడిపోతూ కనిపించింది. పరుగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాను. అయితే పెద్ద ఎత్తున మంటలు వస్తుండడంతో ఏమీ చేయలేకపోయాను. బస్సులో నుంచి కాపాడండి.. మంటల్లో కాలిపోతున్నామని కేకలు వినిపించాయి. ఆడోళ్ల గోడు చెవులారా విన్నాను. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. నా జీవితంలో ఇలాంటి ఘటనను చూడలేదు. – మల్లికార్జున, నాయకల్లు (ఘటన స్థలికి సమీపంలోని కేఫ్‌లో సెక్యూరిటీ గార్డు) ఫైర్ ముందు నుంచి వచ్చింది బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో 2.30 గంటలప్పుడు బస్సు ముందు నుంచి ఫైర్ వచ్చింది. దీంతో అందరూ వెనక్కి వెళ్లారు. ఎమర్జెన్సీ డోర్ తెరచుకోకపోవడంతో వెనక డోర్‌ను పగలగొట్టే ప్రయత్నం చేశారు. నేను మధ్యలో ఉన్న గ్లాస్‌ను పగలగొట్టి దూకేశాను. బెంగళూరుకు ఇంటర్వ్యూ కోసం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. – అశ్విన్, హైదరాబాద్, కూకట్పల్లికళ్ల ముందే కాలిపోయారు బస్సు కళ్ల ముందే కాలిపోయింది. ఆ సమయంలో నేను మెలకువగా ఉండడంతో డ్రైవర్ సీటు నుంచి కిందకు దూకేశాను. నేను దూకిన తర్వాత ఒక్కసారిగా పెద్ద శబ్ధం వచి్చంది. ఆ తర్వాత మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఆర్పాలన్నా ఏమి చేయలేని పరిస్థితి. కాపాడాలని కేకలు వినిపించాయి. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితి శత్రువులకు కూడా రాకూడదు. – జయంత్ కుశ్వాల్, హైదరాబాద్ -
మృత్యుశకటం
బస్సు డ్రైవర్ చేసిన తప్పు 19 మంది సజీవ దహనానికి కారణమైంది! నిద్రలో ఉన్న వారిని శాశ్వత నిద్రలోకి పంపింది. కొన్ని కుటుంబాలను చిదిమేసి శాశ్వత చీకట్లు నింపింది. ఘటనా స్థలిని చూసిన వారి కంట నీరు తెప్పించింది. కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని కలచి వేసింది. నిమిషాల వ్యవధిలో కొన్ని కుటుంబాలు, కొన్ని కుటుంబాల పెద్ద దిక్కులు, భవిష్యత్ ఆశలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ప్రయాణికుల ఆర్తనాదాలు,చావు కేకలతో ఎన్హెచ్ృ44 భీతిల్లింది. మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా బొగ్గు, మసిగా మారాయి. ఈ భీతావహ ఘటన స్లీపర్ బస్సు ప్రయాణాలపై మరోమారు పెద్ద చర్చనే లేవనెత్తింది.సాక్షి ప్రతినిధి కర్నూలు/ కర్నూలు (హాస్పిటల్): హైదరాబాద్ నుంచి గురువారం రాత్రి బెంగళూరుకు బయలు దేరిన వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ కోచ్ (స్కానియా) బస్సు (డీడీ 01ఎన్9490) శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏకంగా 19 మంది సజీవ దహనమయ్యారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ఘటన వివరాలు ఇలా ఉన్నాయి... మొత్తం 44 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లతో హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 2.14 గంటలకు కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా దాటింది. 2.30 గంటలకు టాయిలెట్ కోసం కర్నూలులో ఆపారు. కొంత మంది మాత్రమే బస్సు దిగారు. మిగిలిన వారంతా గాఢనిద్రలో ఉన్నారు. ఆ తర్వాత బయలుదేరిన బస్సు చిన్నటేకూరు దాటగానే 2.45 గంటలకు ఓ బైక్‌ను ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న శివశంకర్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. అయితే ప్రమాదం తర్వాత కూడా ఆపకుండా డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. ఇదే పెను ప్రమాదానికి కారణమైంది. ఆ సమయంలో బస్సు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. బైక్‌ను ఢీకొట్టిన తర్వాత ముందుకు వెళ్లిపోతే ప్రమాదం తమపైకి రాదని భావించిన డ్రైవర్ బస్సును వేగంగా నడిపారు. శివశంకర్ రోడ్డు పక్కన పడిపోయాడు. బైక్ మాత్రం బస్సు కింద ఇరుక్కుపోయింది. దీంతో బస్సు బైక్‌ను 300 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ఆ రాపిడికి మంటలు రేగాయి. ఈ క్రమంలో బైక్ పెట్రోల్ ట్యాంకు పగిలిపోయి మంటలు చెలరేగాయి. బస్సు ఎడమ వైపు డోర్ల భాగంలో మంటలు కనిపించాయి. అప్పుడు డ్రైవర్ బస్సును ఆపాడు. డ్రైవర్ లక్ష్మయ్యతో పాటు మరో డ్రైవర్ వాటర్ బాటిళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈలోపు ముందు భాగంతోపాటు బస్సు మధ్య భాగంలో కూడా మంటలు వ్యాపించాయి. బైక్‌ను ఢీకొట్టడంతో బస్సు డోర్‌లోని సెన్సార్ వైర్లు తెగిపోయాయి. దీంతో డోర్ పూర్తిగా లాక్ అయి తెరుచుకోలేదు. దీంతో డ్రైవర్లు భయపడి ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులోంచి దూకేశారు. మంటల ధాటికి దట్టమైన పొగ బస్సు మొత్తం కమ్ముకుంది. ఒకరి ముఖం మరొకరికి కన్పించని పరిస్థితి. పొగ, మంటల ధాటికి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక ఆర్తనాదాలు పెట్టారు. క్షణాల్లో మంటలు డోర్ కర్టన్లు, బెడ్షీట్లు, బెడ్లకు అంటుకుని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. కొందరు మాత్రం బస్సు అద్దాలు పగులగొట్టి కిందకు దూకి గాయాలతో బయటపడ్డారు. తక్కిన వారు ప్రమాదం నుంచి తప్పించుకోలేక అగ్నికి ఆహుతయ్యారు. బస్సు మొత్తం నిమిషాల వ్యవధిలో పూర్తిగా దగ్ధమైంది. జాతీయ రహదారిపై వెళుతున్న వాహనదారులు ప్రమాద ఘటనను వీడియో, ఫొటోలు తీసి పోలీసు అధికారులకు పంపారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్‌తో మంటలను అదుపు చేశారు. డ్రైవర్లు సహా 27 మంది ప్రయాణికులు సురక్షితం హైదరాబాద్‌లో బస్సు ఎక్కడానికి 40 మంది టికెట్ బుక్ చేసుకున్నారు. వీరిలో ఒకరు వ్యక్తిగత కారణాలతో ప్రయాణం రద్దు చేసుకోవడంతో బస్సు ఎక్కలేదు. మిగతా 39 మందితోపాటు నలుగురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ లెక్కన 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆపై హైదరాబాద్ శివారు ప్రాంతం ఆరంఘర్‌లో టికెట్ ముందుగా బుక్ చేసుకోని ఒకరు బస్సు ఎక్కారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి బస్సులో 46 మంది ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే కర్ణాటకలోని బాగేపల్లిలో బస్సు దిగాల్సి ఉంది. మిగతా వారంతా బెంగళూరుకు వెళ్లాల్సిన వారే. వీరిలో ప్రమాదం తర్వాత 27 మంది ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాద సమయంలో అద్దాలు ధ్వంసం చేసి దూకడంతో పాదాలు, కాళ్లకు గాయాలయ్యాయి. కొంత మందికి తలపై కూడా చిన్నచిన్న గాయాలయ్యాయి. వీరిలో 23 మంది పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు కాగా.. మరో ఇద్దరు డ్రైవర్లు. తక్కిన 19 మంది చనిపోయారు. మృతుల్లో 17 మంది పెద్దలు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను పోలీసులు 108లో కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఇంకొందరు కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు కర్నూలు సమీపంలోని కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనపై ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రయాణికుడు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బస్సు యాజమాన్యంపై 125 (ఎ), 106 (1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఉలిందకొండ పీఎస్ ఎస్ఐ ధనుంజయ తెలిపారు. బస్సు డ్రైవర్లు శివనారాయణ, మిరియాల లక్ష్మయ్యను అదుపులోకి తీసుకుని ప్రమాద ఘటనకు దారితీసిన కారణాలపై విచారిస్తున్నారు. పనికి వెళ్లొస్తానని అటే వెళ్లిపోయాడు..అమ్మా డోన్ వద్ద పని ఉందంట. మాట్లాడుకుని మళ్లీ వస్తానని రాత్రి పోయినోడు మళ్లీ రాకుండానే పోయినాడు...అంటూ ఆ తల్లి గంటల తరబడి మార్చురీ వద్ద విలపిస్తున్న దృశ్యం కంటతడి పెట్టిస్తోంది. కర్నూలు జిల్లా కర్నూలు మండలం బి.తాండ్రపాడుకు గ్రామానికి చెందిన నాగన్న కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. ఆయన భార్య యశోదమ్మ ఇద్దరు కుమారులను పెంచి పెద్ద చేసింది. ఇందులో పెద్దవాడైన శ్రీహరి గౌండా పనిచేస్తుండగా చిన్నవాడైన శివశంకర్ గ్రానైట్ పనులకు వెళ్లేవాడు. శివశంకర్ ఎప్పటిలాగే గురువారం రాత్రి కూడా డోన్ వద్ద పని ఉందని మాట్లాడుకుని వస్తానని వెళ్లాడు. ఆ తర్వాత మళ్లీ తల్లికి ఫోన్ చేయలేదు. ఉదయం లేచే సరికి బైక్‌పై వెళుతూ బస్సు కింద పడి శివశంకర్ మృతిచెందాడని పోలీసులు చెప్పడంతో ఆ తల్లి గుండెలవిసేలా విలపించింది. అద్దాలు పగలగొట్టినా బయటకు రాలేని పరిస్థితి స్లీపర్ కోచ్ బస్సులో లోయర్, అప్పర్ బెర్త్‌లు ఉన్నాయి. అప్పర్ బెర్త్‌లో ఉన్నవారు అద్దాలు పగలగొట్టి సులభంగా బయటకు దూకారు. గాయాలతో బయటపడ్డారు. అప్పర్ బెర్త్ అద్దాలు ధ్వంసం చేస్తే బయటకు దూకేయొచ్చు. కానీ లోయర్ బెర్త్‌లో అద్దాలు ధ్వంసం చేసినా, ఐరన్ యాంగ్లర్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో మనిషి దూరలేని పరిస్థితి! అప్పర్ బెర్త్ లాగే, లోయర్ బెర్త్‌లు కూడా ఉండి ఉంటే అద్దాలు ధ్వంసం చేసి ఇంకొందరు కిందకు దూకి ప్రాణాలతో బయట పడే అవకాశం ఉండేది. గుర్తుపట్టలేని విధంగా మృతదేహాలు తెల్లవారుజామున 3.30 గంటలకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఇతర పోలీసులు బస్సును పరిశీలించారు. ఇనుప కడ్డీలు మినహా బస్సులో ఏమీ మిగల్లేదు. నల్లటి మసి దిబ్బలు మాత్రమే కన్పించాయి. తెల్లవారిన తర్వాత కలెక్టర్ సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్లా, డీఐజీ కోయ ప్రవీణ్‌తో పాటు వైద్యాధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. వీరి సమక్షంలో బూడిదను తొలగించి.. నల్లగా బొగ్గులా మారిన మాంసపు ముద్దలను అతి కష్టం మీద వెలికి తీశారు. మొత్తం 19 మృతదేహాలను ప్రత్యేక టెంట్లో ఉంచారు. వాటి నుంచి ఫోరెన్సిక్ అధికారులు డీఎన్ఏ పరీక్షల కోసం శాంపిల్స్ తీసుకున్నారు. మృతదేహాలకు వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. ఆ తర్వాత మృతదేహాలను కర్నూలు జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 14 మంది మృతుల కుటుంబ సభ్యుల డీఎన్ఏ శాంపుల్స్ కూడా వైద్యులు సేకరించారు.బస్సు ఆపి ఉంటే ప్రమాదం తప్పేది బస్సు బైక్‌ను ఢీకొట్టిన వెంటనే నిలిపేసి ఉంటే అసలు ప్రమాదమే జరిగేది కాదు. బైక్‌పై ప్రయాణించే శివశంకర్ మాత్రమే చనిపోయేవాడు. అయితే, ప్రమాదం తమపైకి రాకుండా ఉండేందుకు డ్రైవర్ లక్ష్మయ్య బస్సును అదే వేగంతోనే నడిపాడు. దీంతో బైక్ బస్సు కింద ఇరుక్కుపోవడం, 300 మీటర్ల మేర రోడ్డుకు రాపిడికి గురై పెట్రోలు ట్యాంకు పగలడం, మంటలు చెలరేగి బస్సుకు వ్యాపించడంతో పెను ప్రమాదం సంభవించింది. కాగా, బస్సు ప్రమాద ఘటన అధికారులతో పాటు అందరినీ తీవ్రంగా కలచి వేసింది. నేషనల్ హైవేపై అటు, ఇటు వెళ్లే వాహనదారులు బస్సును, అందులో బూడిదైన మృతదేహాలను చూసి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఫోరెన్సిక్ అధికారులు, పోలీసులు మృతదేహాలను వెలికి తీసి మాంసం ముద్దలను పక్కనే టెంట్‌లోకి తీసుకెళుతున్న దృశ్యాలను చూసి ఘటనాస్థలిలోని వ్యక్తులు చలించిపోయారు. పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఓ మహిళ మృతదేహంపై మంగళసూత్రం దండ కనిపించింది. బస్సు ప్రమాదం నుంచి బయటపడ్డ వారి వివరాలు 1. అశ్విన్‌రెడ్డి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 2. ఎం.సత్యనారాయణ, ఖమ్మం– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 3. జి.సుబ్రహ్మణ్యం, కాకినాడ– కర్నూలు అశ్విని హాస్పిటల్లో చికిత్స 4. గుణసాయి, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 5. ఆండోజు నవీన్‌కుమార్, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 6. నేలకుర్తి రమేష్, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 7. శ్రీలక్ష్మి, నెల్లూరు– గాయాలు లేకపోవడంతో బంధువుల ఇంట్లో బస 8. వేణు గుండ, ప్రకాశం జిల్లా– బెంగళూరు వెళ్లిపోయారు 9. శ్రీహర్ష, నెల్లూరు– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 10. శివ, బళ్లారి–బెంగళూరు వెళ్లిపోయారు 11. గ్లోరియా ఎల్సాశామ్ కేరళ– బెంగళూరు వెళ్లిపోయారు 12. ఎంజి. రామరెడ్డి, తూర్పుగోదావరి– హైదరాబాద్ వెళ్లిపోయారు 13. జయసూర్య, హైదరాబాద్– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 14. ఉమాపతి, హైదరాబాద్–బెంగళూరు వెళ్లిపోయారు 15. పంకజ్, బీదర్– పోలీస్ స్టేషన్లో ఉన్నారు 16. చరిత్, హైదరాబాద్– బెంగళూరు వెళ్లారు 17. హారిక, బెంగళూరు– కర్నూలు జీజీహెచ్‌లో చికిత్స 18. కీర్తి, హైదరాబాద్– హైదరాబాద్ వెళ్లారు 19. వేణుగోపాల్‌రెడ్డి, శ్రీసత్యసాయి జిల్లా– హిందుపురం వెళ్లారు 20. ఆకాష్, బీదర్– కర్నూలులో ఉన్నారు 21. మహమ్మద్ ఖైజర్, బెంగళూరు– బెంగళూరు వెళ్లారు 22. జయంత్ కుశ్వల, హైదరాబాద్– కర్నూలులో ఉన్నారు 23. కె.అశోక్, రంగారెడ్డి జిల్లా– కర్నూలు జీజీహెచ్ నుంచి డిశ్చార్జ్ 24. జశ్విత, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 25. అఖీర, నెల్లూరు– కర్నూలులో బంధువుల ఇంట్లో బస 26. మిర్యాల లక్ష్మయ్య (డ్రైవర్)– పల్నాడు జిల్లా27. శివనారాయణ (డ్రైవర్)– ప్రకాశం జిల్లాకంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంతోపాటు సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కర్నూల్ కలెక్టరేట్ 08518277305 కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి 9121101059, 9494609814, 9052951010 ఘటనాస్థలం 9121101061 పోలీసు కంట్రోల్ రూమ్ 9121101075మృతుల వివరాలుపేరు రాష్ట్రం 1. జి.ధాత్రి (27) పూనూరు, బాపట్ల, ఏపీ 2. జి.రమేష్ (31)3. అనూష (28) 4.శశాంక్ (7) 5.మన్విత (4) 6. కె. శ్రీనివాసరెడ్డి (39) రావులపాలెం ,ఆంధ్రప్రదేశ్ 7. చందన (23) తెలంగాణ8.సంధ్యారాణి (43) తెలంగాణ 9. అనూష (22) తెలంగాణ 10. గిరిరావు (48) తెలంగాణ 11.ఆర్గా బండోపాధ్యాయ(32) తెలంగాణ12. మేఘనాథ్ (25) తెలంగాణ13. ఫిలోమన్ బేబీ(64) కర్ణాటక14. కిషోర్‌కుమార్(41) కర్ణాటక15. ప్రశాంత్(32) తమిళనాడు16.యువన్ శంకర్‌రాజ్(22) తమిళనాడు 17. కె.దీపక్‌కుమార్ (24) ఒడిశా 18.అమృత్‌కుమార్ (18) బిహార్ 19.గుర్తు తెలియని వ్యక్తి (50) (ఆరంఘర్ వద్ద బస్ ఎక్కాడు) 20 శివశంకర్ (23, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి) బి.తాండ్రపాడు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్రాష్ట్రాల వారీగా మృతుల సంఖ్యఆంధ్రప్రదేశ్ 7 తెలంగాణ 6 కర్ణాటక 2 తమిళనాడు 2 బిహార్ 1 ఒడిశా 1 గుర్తుతెలియని వ్యక్తి 1 -
Kurnool Bus Accident: 15 నిమిషాల్లోనే అంతా జరిగిపోయింది
-
Kurnool: బస్సును తరలిస్తుండగా తిరగబడ్డ క్రేన్..
-
Kurnool Bus Fire Incident: డ్రైవర్ చేసిన పొరపాటు ఇదే..
-
Kurnool Bus Incident: ప్రాణానికి రూ.5 లక్షలు
-
‘స్లీపర్’లోనే ఎందుకీ ప్రమాదాలు?
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ఈ ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడగా, 27 మంది ప్రాణాలతో బతికిబయటపడ్డారు. అయితే బస్సులు అగ్ని ప్రమాదాలకు గురైన సమయంలో అత్యధికంగా ప్రాణానష్టమే కన్పిస్తుంది. ప్రధానంగా ప్లీపర్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైందంటే ప్రాణనష్టం అనేది భారీగా ఉంటుంది. పది రోజుల క్రితం రాజస్థాన్‌లోనూ ఇదేతరహా ప్రమాదం జరిగి 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. గత కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతోన్న ప్రమాద ఘటనలు ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. మరి ఈ ప్రమాదాలకు కారణాలేంటనేది ఒక్కసారి చూస్తే..!డ్రైవర్లకు అలసట.. నిద్రమత్తుసుమారు 250 కిలోమీటర్ల నుంచి 1,000 కి.మీ దాటే వరకూ కూడా ఎక్కువగా ప్రయాణికులు స్లీపర్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సులు రాత్రి వేళల్లోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ డ్రైవర్లకు అలసట అనేది కీలకంగా మారుతుంది. డ్రైవర్లు అలసట బారిన పడి, నిద్ర మత్తులోకి జారుకోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2018లో నిర్వహించిన ఓ సర్వేలో.. తాము డ్రైవింగ్ సమయంలో నిద్రమత్తుకు లోనవుతున్నట్లు 25 శాతం మంది డ్రైవర్లు ఏడేళ్ల నాడు నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడించారు. డిజైన్ సురక్షితమేనా?స్లీపర్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు డిజైన్ లోపం కూడా భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరగడానికి ప్రధాన కారణంగా కనబడుతోంది. బస్సులో పడుకోవడానికి ఏమీ ఇబ్బంది లేకపోయినా, బస్సులో బెర్త్‌లు, సీట్ల మధ్య ఉన్న గ్యాప్ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం సింగిల్ మనిషి మాత్రమే వెళ్లేలా ఉంటుంది. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇది కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఒకర్ని తోసుకుంటూ ఇంకొకరు వెళ్లడం మరింత గందరగోళాన్ని సృష్టించి తొక్కిసలాటకు కూడా కారణమయ్యే చాన్స్‌లు కూడా అత్యధికంగా అనేది నిపుణులు అభిప్రాయం. సీట్ల మధ్యలో పరిమిత స్థలం వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువమంది లోపల చిక్కుకుపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఎత్తు కూడా మరొక సమస్య. వీటి ఎత్తు 8-9 అడుగుల వరకు ఉంటుంది. బస్సు ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టంగా ఉంటుంది. రెండు-మూడు నిమిషాల్లో బయట పడితేనే..బస్సు ప్రమాదం జరిగినప్పుడు చాలా స్వల్ప సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. రెండు, మూడు నిమిషాల్లో తప్పించుకుంటే ప్రాణాలతో బయటపడుతున్నారు. లేకపోతే అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. స్లీపర్ బస్సులు సాధారంగా ఏసీ బస్సులే అధికంగా ఉంటాయి. ఏసీ బస్సుల్లో ప్రమాదం జరిగితే డోర్స్ ఓపెన్ కావడం కూడా కష్టమే. ఏమైనా అద్దాలు బ్రేక్ చేయాలంటే కూడా ఎంతో కొంత సమయం ఉండాలి. అంటే ఇక్కడ మేల్కొని ఉన్న ప్రయాణికులే ఎంతో కొంత ప్రతిఘటించి బయటకు వచ్చే చాన్స్ ఉంటుంది. ఆ కంగారు, తొందరలో మిగతా వారిని నిద్ర లేపే చాన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. నిద్ర నుంచి ప్రయాణికులు మేల్కొనే సరికి వారు ప్రమాదంలో చిక్కుకుని కొట్టుమిట్లాడుతున్న ఘటనలే మనకు తరచు కనిపిస్తూ ఉన్నాయి. చైనాలో అందుకే నిషేధించారా?చైనా స్లీపర్ బస్సులను పూర్తిగా నిషేధించింది. ఈ నిర్ణయం ప్రమాదాల సమయంలో ప్రయాణికులకు రక్షణ లేకపోవడం, సురక్షితంగా బయటపడే అవకాశం లేకపోవడం వంటి కారణాల వల్ల తీసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో ఈ అంశం మరింత చర్చకు వచ్చింది. చైనా, జర్మనీ వంటి దేశాలు స్లీపర్ బస్సులపై నిషేధం విధించగా, భారత్‌లో మాత్రం ఇంకా కఠిన చర్యలు తీసుకోలేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదీ చదవండి:కర్నూలు శివారులో ఘోరం.. -
కర్నూలు బస్సు ప్రమాదంలో తల్లీ కూతుళ్ల మృతి
సాక్షి, మెదక్: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లి కూతుళ్లు మృతి చెందారు. మెదక్ మండలం శివాయిపల్లికి చెందిన తల్లి సంధ్యారాణి కూతురు చందన మృతి చెందారు. సంధ్యారాణి తన కూతురు చందనను బెంగుళూరులో డ్రాప్ చేయడానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. సంధ్యారాణి భర్త ఆనంద్ గౌడ్ దుబాయ్‌లో ఓ ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తుండగా.. సంధారాణి భర్తతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు.కూతురు చందన బెంగళూర్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దీపావళీ పండగకు ముందు తల్లి సంధ్యారాణి దుబాయ్ నుండి రావడంతో కూతురు చందన కూడా తల్లి వద్దకు వచ్చి పండగకు పెద్దమ్మ ఇంటి వద్ద ఉన్నారు. నిన్న కూతురు చందన తిరిగి బెంగళూరు వెళ్తుండగా తల్లి సంధ్యారాణి కూడా వెళ్లారు. నిన్న సాయంత్రం 6 గంటలకు కావేరీ ట్రావెల్స్ బస్సులో సీట్ నెంబర్ L-14 , l-15 సీట్లు బుక్ చేసుకున్నారు. మూసాపేట్ బోర్డింగ్ పాయింట్లో తల్లి కూతుళ్లు బస్ ఎక్కినట్టుగా బంధువులు చెబుతున్నారు. -
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి కర్నూలు బస్సు ఘటనపై YSRCP నేతలు
-
కర్నూలు బస్సు ప్రమాదం: ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికుల వివరాలు
సాక్షి,కర్నూలు : కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారు జామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు (నంబర్ DD01 N9490) కర్నూలు ప్రజానగర్‌కు చెందిన శంకర్ పల్సర్ బైక్ ఢీకొట్టింది. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి. ప్రయాణికులు తేరుకునేలోపే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. కర్నూలు జిల్లా బస్సు ప్రమాద ఘటనలో గాయపడిన,సురక్షితంగా ఉన్న ప్రయాణికుల వివరాలు :బస్సు ప్రమాద ఘటనలో మృతుల వివరాలు:1. జె. ఫిలోమిన్ బేబీ (64)2. కిషోర్ (64)3. ప్రశాంత్ (32)4. ఆర్గా బందోపధ్యాయ (23)5. యువన్ శంకర్ రాజా (22)6. మేఘనాథ్ (25)7. ధాత్రి (27)8. అమృత్ కుమార్ (18)9. చందన మంగ (23)10. అనూష (22)11. గిరి రావు (48)12. కేనుగు దీపక్ కుమార్ (24)13. జి. రమేష్ 14. జి అనూష 15. మనిత16. కేశనాథ్ 17. సంధ్యారాణి 18. కర్రీ శ్రీనివాస రెడ్డి 19. పంచాల శివశంకర్ (ద్విచక్ర వాహనదారుడు) 20. బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన ఒకరి పేరు తెలియాల్సి ఉంది.సురక్షితంగా ఉన్న ప్రయాణికులు:శ్రీలక్ష్మి, జస్విత (8), అభీరా (1.8) కపర్ అశోక్ (27) అశ్విన్ రెడ్డి ఆకాశ్ జయంత్ కుశ్వాల్ – మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు)పంకజ్ ప్రజాపతి శివా గ్లోరియా ఎల్సా సామ్ – బెంగళూరుచారిత్ (21) మొహమ్మద్ ఖిజర్ (51) తరుణ్ (27) – బస్సులో ఎక్కకముందే ప్రయాణం రద్దు చేసుకున్నారుగాయపడిన ప్రయాణికులు:మన్నెంపల్లి సత్యనారాయణ (27), తండ్రి ఎం. రవి – సత్తుపల్లి, ఖమ్మం జిల్లాబడంత్ర జయసూర్య (24), తండ్రి సుబ్బరాయుడు – మియాపూర్, హైదరాబాద్అండోజ్ నవీన్ కుమార్ (26), తండ్రి కృష్ణాచారి – హయత్‌నగర్, హైదరాబాద్సరస్వతి హారిక (30), తండ్రి రంగరాజు – బెంగళూరునెలకుర్తి రమేష్ (36) – దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లాముసలూరి శ్రీహర్ష (25) – నెల్లూరు జిల్లాపునుపట్టి కీర్తి (28) – ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్వేణుగోపాల్ రెడ్డి (24) – తెలంగాణఎం.జి. రామరెడ్డి – తూర్పు గోదావరి జిల్లాఘంటసాల సుబ్రమణ్యం – కాకినాడ, ఆంధ్రప్రదేశ్గుణ సాయి – తూర్పు గోదావరి జిల్లా డ్రైవర్ల వివరాలు 1.లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత సంఘటనా స్థలం నుంచి పారిపోయారనే వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లక్ష్మయ్య పోలీసుల అదుపులో ఉన్నారు. 2.శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది.ప్రయాణికుల రాష్ట్రాలవారీగా: • తెలంగాణ రాష్ట్రం – 6 • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11 • మధ్యప్రదేశ్ – 1 • కర్ణాటక రాష్ట్రం – 4మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది. -
బస్సు ప్రమాదంపై హోంమంత్రి అనిత రియాక్షన్
-
Bus Accident: ఆ క్షణం ఏం జరిగింది..! చిన్న తప్పే కొంప ముంచిందా?
-
ఇంకెన్నాళ్లు ఈ మరణాలు... ప్రమాదంపై KA పాల్ సీరియస్
-
Travels Management: రాత్రి 3:30కి ప్రమాదం జరిగినట్టు సమాచారం ఉంది
-
బస్సు ప్రమాదంలో నెల్లూరుకు చెందిన కుటుంబం మృతి
-
Kurnool Accident: ప్రమాదం ఎలా జరిగిందో చూడండి
-
కర్నూలు ప్రమాదం.. ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో(Kurnool Bus Fire Accident) జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతిచెందారు. వారిని ఏపీకి చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణకు చెందిన అనూషరెడ్డిగా గుర్తించారు.వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27), తెలంగాణలోని యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తకొండూరుకు చెందిన అనూషరెడ్డి.. వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ధాత్రి ఇటీవల హైదరాబాద్‌లోని మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.అదే బస్సులో అనూషరెడ్డి కూడా వెళ్లారు. దీపావళికి స్వగ్రామానికి వచ్చిన ఆమె గురువారం రాత్రి బెంగళూరుకు బయల్దేరారు. ఖైరతాబాద్‌లో అనూషరెడ్డి బస్సు ఎక్కి ఈ దుర్ఘటనలో మృతిచెందారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అనూష మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు.ఇదిలా ఉండగా.. వేమురి కావేరి ట్రావెల్స్(vemuri Kaveri Travels) బస్సు ప్రమాదం బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణీకులు మృతి చెందిన విషయం తెలిసిందే. -
Kurnool Bus Incident: మీ కాళ్లు మొక్కుతా.. నా కొడుకు శవాన్నైనా చూపించండి
-
బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి.. కర్నూలు బస్సు ఘటనపై YSRCP నేతలు
-
బస్సు సూపర్ ఫిట్... మంత్రి క్లీన్ చిట్ పై SV మోహన్ రెడ్డి ఫైర్
-
కర్నూలు బస్సు ప్రమాదాన్ని కప్పిపుచ్చిన TDP మంత్రి
-
లోపల పొగ.. అన్ని లాక్ అయ్యాయి.. దేవుడిలా ఎవరో నా చెయ్యి పట్టుకోని..!
-
కర్నూలు ఘటన.. స్పందించిన ట్రావెల్స్ యాజమాన్యం
సాక్షి, ప్రకాశం: కర్నూలు బస్సు ప్రమాదంపై తీవ్ర విమర్శల వేళ.. వీ కావేరి ట్రావెల్స్ యాజమాన్యం(Vemuri Kaveri Travels Reaction) స్పందించింది. బస్సుకు ఫిట్నెస్ లేదని, పైగా సర్టిఫికెట్లు కూడా కాలపరిమితి చెల్లాయని, అపరిమిత చలాన్లూ ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. తమ బస్సుకు అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయంటూ యాజమాని వేమూరి వెంకటేశ్వర్లు పేరిట ఒక ప్రకటన వెలువడింది.‘‘రాత్రి ప్రమాదం జరిగినట్టుగా మూడు గంటల 30 నిమిషాలకు మాకు సమాచారం అందింది. వర్షం పడుతున్న టైంలో రోడ్డుపైన బైకర్ స్కిడ్ అయ్యి.. బస్సును ఢీ కొట్టి పడిపోయాడు. బైక్ మంటలు చెలరేగి బస్సు కిందకు రావడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది. ఆ సమయంలో మెయిన్ డోర్ వద్ద మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. రాడ్లతో మా డ్రైవర్లు అద్దాలు పగలకొట్టడంతో కొందరు బయటపడ్డారు. మా బస్సు కు సంబంధించి అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు వ్యాలిడ్లోనే ఉన్నాయి. బస్సులో మొత్తం 40 మంది రిజర్వ్డ్ ప్యాసింజర్ లు ఉన్నారు. అందరికీ మా ఏజెన్సీ తరఫున ఇన్సూరెన్స్ ఉంది. ప్రమాద ఘటనపై చింతిస్తున్నాం. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో ఉంది. అయితే.. ప్రమాదంలో వీ కావేరీ ట్రావెల్స్ యాజమాన్య నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోందని బస్సును పరిశీలించిన అధికారులు అంటున్నారు. కనీస ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదని అంటున్నారు. ‘‘ప్రమాద సమయంలో బస్సు వంద కిలోమీటర్ల వేగంతో ఉంది. మంటలు ఆర్పేందుకు ఫోమ్ బాటిల్ కూడా అందుబాబులో లేదు. సేఫ్టీ విండో బద్ధలు కొట్టడానికి సుత్తి కూడా అందుబాబులో లేదు’’ అని అధికారులు తెలిపారు. మరోపక్క.. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ప్రధాన కారణమని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బైక్‌ను ఢీ కొట్టిన వెంటనే బస్సును ఆపి ఉంటే మంటలు చెలరేగి ఉండేవి కాదని, మంటలు అంటుకున్నప్పుడైనా ప్రయాణికులను అప్రమత్తం చేసినా.. కనీసం డోర్ తెరిచినా.. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడి ఉండేవారేమోనని గాయపడిన కొందరు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులు, బైకర్ కలిపి ఇప్పటిదాకా 20 మంది మృతి చెందారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని అధికారులు భావిస్తున్నారు.ఇదీ చదవండి.. ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్ -
ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు..! బయటపడ్డ CCTV ఫుటేజ్
-
బస్సు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా.. గాయపడిన క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక, కర్నూలు ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణీకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో దగ్ధమైన బస్సులో 19 మృతదేహాలను వెలికితీశారు. ఫోరెన్సిక్ బృందాలు వీటిని బస్సులో నుంచి వెలికితీశాయి. ఈ ఘటన నుంచి 21 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరితో తెలంగాణకు సంబంధించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నుంచి పలువురు ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు. సూరారంలో ఇద్దరు, జేఎన్టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్సు ఎక్కారు. సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి సురక్షితంగా బయటపడగా.. మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ సిచ్చాఫ్ వస్తోంది. జేఎన్టీయూ వద్ద ఎక్కిన ముగ్గురిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరో ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్ వస్తున్నాయి. అంతేకాకుండా.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నుంచి బయలుదేరిన వారు ఇద్దరు ఉన్నారు. బెంగళూరుకు చెందిన తల్లీ కుమారులు పిలోమి నాన్ బేబీ(64), కిషోర్ కుమార్(41) ఇటీవల దీపావళి పండగకు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని కృషి డిఫెన్స్ కాలనీలోని బంధువు, సాఫ్ట్వేర్ ఉద్యోగి రాము ఇంటికి వచ్చారు.గురువారం సాయంత్రం పటాన్చెరు అంబేడ్కర్ కూడలి వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కి బెంగళూరు బయలుదేరారు. అయితే ఈ లోపే చిన్నటేకూరు వద్ద బస్సు ప్రమాదానికి గురవడంతో వీరు క్షేమంగా ఉన్నారా లేదా? అనేది తెలియడం లేదు. వారి ఆచూకీ కనుక్కునేందుకు రాము దంపతులు కర్నూలుకు బయలుదేరి వెళ్లారు. -
కర్నూలు ప్రమాదం: ప్రయాణికుల వివరాలు ఇవిగో..
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. కాగా, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై అగ్ని ప్రమాదానికి గురైంది. బైక్, బస్సు ఢీకొన్న కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ శివశంకర్ మృతి చెందాడు. ఇక, బస్సులు ప్రయాణించిన వారి జాబితా ఇలా ఉంది. బస్సు ప్రయాణికుల జాబితా ఇదే.. అశ్విన్‌రెడ్డి(36),జి.ధాత్రి(27),కీర్తి(30)పంకజ్(28), యువన్ శంకర్రాజు(22)తరుణ్(27), ఆకాశ్(31),గిరిరావు(48),బున సాయి(33), గణేశ్(30), జయంత్ పుష్వాహా(27)పిల్వామిన్ బేబి(64),కిశోర్ కుమార్(41)రమేష్, అతని ముగ్గురు కుటుంబ సభ్యులురమేష్(30), అనూష(22), మహ్మద్ ఖైజర్(51), దీపక్ కుమార్ 24అన్డోజ్ నవీన్‌కుమార్(26), ప్రశాంత్(32)ఎం.సత్యనారాయణ(28), మేఘనాథ్(25)వేణు గుండ(33), చరిత్(21), చందన మంగ(23)సంధ్యారాణి మంగ(43), గ్లోరియా ఎల్లెస శ్యామ్(28)సూర్య(24)హారిక(30), శ్రీహర్ష(24)శివ(24), శ్రీనివాసరెడ్డి(40), సుబ్రహ్మణ్యం(26)కె.అశోక్(27),ఎం.జి.రామారెడ్డి(50)ఉమాపతి(32), అమృత్ కుమార్(18), వేణుగోపాల్‌రెడ్డి(24).ప్రమాదం నుంచి తప్పించుకున్న 21 మంది వివరాలు.. -
అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం.. క్లెయిమ్ ప్రాసెస్ ఎలా?
అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతుంటుంది. తాజాగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదబారిన పడడంతో మంటలు చెలరేగి కొందరు ప్యాసింజర్లు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టంతోపాటు ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం ఏమిటనేది స్పష్టంగా వెల్లడికావాల్సి ఉంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సంబంధీకుల ప్రాణనష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. ప్రమాదంలో ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బీమా చేయించిన ఇతర విలువైన వస్తువుల నష్టాన్ని ఇన్సూరెన్స్ ద్వారా కొంత భర్తీ చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో బీమా ఎలా క్లెయిమ్ చేయాలో నిపుణులు సూచిస్తున్నారు.ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం ఎలాబీమా కంపెనీకి సమాచారం అందించాలి: అగ్నిప్రమాదం జరిగిన వెంటనే బీమా ప్రొవైడర్‌కు సమాచారం ఇవ్వండి. అవసరమైతే, అత్యవసర ఖర్చుల కోసం ముందస్తు ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించండి. సంఘటన జరిగిన తేదీ, సమయం, స్థలం వంటి ముఖ్యమైన వివరాలను అందించడంతో పాటు.. ఎంత నష్టం జరిగిందో అంచనా వేయండి.నష్టాన్ని డాక్యుమెంట్ చేయండి: అగ్నిప్రమాదం జరిగిన తరువాత.. స్థలాన్ని శుభ్రపరచడానికి ముందు.. అక్కడ పరిసరాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయండి. కాలిన వస్తువులను పారవేయకూడదు. బీమా కంపెనీ స్పందించడానికి ముందే రిపేర్ చేయడం వంటి చేయకూడదు.క్లెయిమ్ ఫైల్ చేయండి: ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారాన్ని ఆన్లైన్లో లేదా బీమా కంపెనీ కార్యాలయంలో సబ్మిట్ చేయండి. మీ ఫైర్ ఇన్సూరెన్స్ పాలసీ కాపీ, నష్టాన్ని తెలియజేసే ఫోటోలు, వీడియోలు, పాడైపోయిన వస్తువుల జాబితా వాటి విలువను తెలిపే రసీదులు లేదా ఇన్వాయిస్లు, అధికారిక నివేదిక వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించాల్సి ఉంటుంది.కంపెనీకి సహకరించండి: ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాన్ని అంచనా వేయడానికి ఒక వ్యక్తిని నియమించే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి సహకరించండి. తనకు అవసరమైన సమాచారం, పత్రాలను అందించాలి. నష్టపోయిన ఆస్తిని పరిశీలించడానికి అనుమతి ఇవ్వాలి.క్లెయిమ్ సెటిల్మెంట్: మీ క్లెయిమ్ ఆమోదం పొందిన తరువాత.. పాలసీ నిబంధనల ప్రకారం నష్టపరిహారం కంపెనీ చెల్లిస్తుంది. చెల్లింపు విధానం గురించి సంస్థ మీకు తెలియజేస్తుంది.Note: ఈ దశలు సాధారణ మార్గదర్శకాలు మాత్రమే. మీ నిర్దిష్ట పాలసీ, ఇన్సూరెన్స్ కంపెనీని అనుసరించి విధానాలు మారవచ్చు. కాబట్టి మీ పాలసీ డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఇన్సూరెన్స్ ప్రొవైడర్‌ను సంప్రదించండి.ఇదీ చదవండి: ఇండిపెండెంట్ ఇల్లు Vs అపార్ట్మెంట్లో ఫ్లాట్ -
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఘోర బస్సు ప్రమాదాలివే..
వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రవాణా భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిందైంది. ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొట్టి ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయి. 20 మందికిపైగా మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్-10 బస్సు ప్రమాదాలు (మృతుల సంఖ్య ఆధారంగా) పరిశీలిస్తే..2018-కొండగట్టు, జగిత్యాల జిల్లా, తెలంగాణమృతులు: 57RTC బస్సు ఓవర్‌లోడెడ్‌గా ఉండి ఘాట్ రోడ్డులో అదుపు తప్పి లోయలో పడింది. సెప్టెంబర్ 11న జరిగిన ఈ ఘోరం.. దేశంలోనే అదో పెద్ద ప్రమాదం. ఈ ఘటనలో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆ ‘మృత్యుఘాట్’ సంఘటన దృశ్యాలు పలువురి మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి. 2013-పాలెం, మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణమృతులు: 45అక్టోబర్ 30న బెంగళూరు నుంచి 51 మంది ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్న జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బస్సు ఓ కారును ఓవర్టేక్ చేస్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీజిల్ ట్యాంక్ లీక్ కావడంతో పేలుడు సంభవించింది. ఆ దుర్ఘటనలో మొత్తం 45 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.2012 – మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్బస్సు చెరువులోకి దూసుకెళ్లిందిమృతులు: 222025- కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొట్టి ట్యాంకర్ పేలడంతో మంటలు చెలరేగాయిమృతులు: 20+2010-అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ఓవర్స్పీడ్ బస్సు బోల్తా పడిందిమృతులు: 182014-మిర్యాలగూడ, నల్గొండ జిల్లా, తెలంగాణ- రైల్వే ట్రాక్‌పై నిలిచిపోయిన బస్సును రైలు ఢీకొంది.- మృతులు: 162019- వెల్దుర్తి, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ఓ వోల్వో బస్సు బైక్‌ను తప్పించబోయి తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టింది. మృతులంతా తెలంగాణలోని గద్వాల జిల్లాకు చెందినవారుమృతులు: 152015 – ఖమ్మం జిల్లా, తెలంగాణవిద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదంమృతులు: 132017-అరకు, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్APSRTC బస్సు లోయలో పడిపోయిందిమృతులు: 112021 – జల్లేరు వాగు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్RTC బస్సు వాగులో పడిపోయిందిమృతులు: 92019 – శ్రీశైలం ఘాట్ రోడ్, తెలంగాణపుణ్యక్షేత్ర దర్శన బస్సు లోయలో పడిందిమృతులు: 9 -
ఓవర్ స్పీడ్.. రూ. 23,000 చలాన్లు.. బయటపడ్డ ట్రావెల్స్ బండారం
-
కర్నూలు బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కర్నూలులో చోటుచేసుకున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బస్సులపై ప్రతీరోజు రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపడితే వేధింపులు అంటున్నారు. అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం అని వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ..‘కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుంది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్నా. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాం.కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరం.. చాలా బాధ కలుగుతుందిమృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న..బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి గారు వివరాలు తెలుసుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుండి తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఉంటే రవాణా శాఖ నుండి ఆదేశించాంఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి,… pic.twitter.com/LrveQHLJsO— Ponnam Prabhakar (@Ponnam_INC) October 24, 2025ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులు, రవాణా శాఖ కమిషనర్లతో సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాద్ నుండి బెంగళూరు తిరుగుతుంది. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. క్షతగాత్రులకు మంచి చికిత్స అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరాం’ అని చెప్పుకొచ్చారు. -
అయ్యో శివుడా!.. గుండెలవిసేలా రోదిస్తున్న యశోదమ్మ
సాక్షి, కర్నూలు: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైకర్ సహా 20 మంది మృతి చెందినట్టు సమాచారం. అయితే.. బస్సు, బైక్ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం సందర్బంగా బైక్‌ను బస్సు దాదాపు 300 మీటర్లు లాక్కెళ్లిపోయింది. ఈ ఘటనలో ప్రమాదానికి కారణమైన బైకర్ శంకర్ చనిపోయాడు. శంకర్‌ను కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన వ్యక్తిగా నిర్ధారించారు.కాగా, శివశంకర్ మరణంతో అతని తల్లి యశోద, కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఇలా మృతి చెందడం పట్ల విలపిస్తోంది. గ్రానైట్, పెయింటింగ్ పనులు చేసే శివశంకర్ నిన్న తెల్లవారుజామున డోన్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. బస్సు ముందుభాగంలోకి బైక్ వెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం కారణంగా బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా.. వారిలో ఇద్దరు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు 20 మంది చనిపోయినట్టు సమాచారం. ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో నల్లగొండకు చెందిన అనూషా రెడ్డి మృతి..ఇదిలా ఉండగా.. ఘటనా స్థలానికి ఫొరెన్సిక్ బృందం చేరుకుంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగిస్తున్నారు. అలాగే, ఘటన స్థలానికి రవాణా శాఖ అధికారులు చేరుకున్నారు. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని అధికారులు తెలిపారు. కావేరి ట్రావెల్స్ పేరిట ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసి బస్సు నడుపుతున్నారు. 2018 మే 2న రిజిస్ట్రేషన్ చేశారు. తల్లీకూతుళ్లు మిస్సింగ్.. ఈ బస్సుకు 2030 ఏప్రిల్ 30 వరకు టూరిస్ట్ పర్మిట్ జారీ అయ్యింది. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్‌గా ఉంది. 2027 మార్చి 31 వరకు ఫిట్‌నెట్ ఉంది. 2026 ఏప్రిల్ 20 వరకు బస్సుకు ఇన్సూరెన్స్ ఉంది. బైక్‌ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి. అన్ని కోణాల్లో పూర్థి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
కర్నూలు బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం రియాక్షన్
-
కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్ డ్రైవింగ్ చలానాలు
సాక్షి, కర్నూలు: ఘోర ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా ట్రాఫిక్ జరిమానాలు పెండింగ్ ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. 2024 నుంచి చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి(2024) నుంచి అక్టోబర్ (2025) వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. రూ.23120 చలానా పెండింగ్‌లో ఉంది. హైస్పీడ్, డేంజర్ డ్రైవింగ్ కారణంగా రెండు చలానాలు బస్సుపై ఉన్నాయి. తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. బస్సు ఫిట్నెస్, అనుమతులు.. ఒడిశా పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీశారు. బస్సు ప్రమాదస్థలిలో ఫోరెన్సిక్ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. -
కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం ఆరా
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డిలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తక్షణమే ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వెంటనే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించేందుకు జెన్కో సీఎండీ హరీష్‌ను వెంటనే ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.గద్వాల కలెక్టర్, ఎస్పీ అక్కడే అందుబాటులో ఉండాలని, బాధిత కుటుంబాలకు అండదండగా ఉండాలని సూచించారు. మృతుల గుర్తింపుతో పాటు క్షతగాత్రులకు అవసరమైన వైద్యసాయం అందించే చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రమాద ఘటనపై తెలంగాణ ప్రభుత్వం హెల్స్ లైన్ ఏర్పాటు చేసిందిఎం.శ్రీరామచంద్ర- అసిస్టెంట్ సెక్రటరీ-991291954ఈ.చిట్టిబాబు-సెక్షన్ ఆఫీసర్-9440854433గద్వాల్ కలెక్టరేట్లోని కంట్రోల్ రూం నంబర్-9502271122కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్ నంబర్ 9100901599- 9100901598కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూం నంబర్ 9100901604గద్వాల్ పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 8712661828బాధిత కుటుంబాలు.. ఈ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. -
బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి
ఢిల్లీ: కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఈ ఘటన విచారకరమని పేర్కొన్నారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మృతులకు సంతాపం ప్రకటించారు.The loss of lives in a tragic bus fire accident in Kurnool, Andhra Pradesh is deeply unfortunate. I extend my heartfelt condolences to the bereaved family members and pray for the speedy recovery of those injured.— President of India (@rashtrapatibhvn) October 24, 2025ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్రమంలోనే ప్రధాని కార్యాలయం.. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. అలాగే, క్షతగాత్రులకు 50వేల తక్షణ సాయం ఇవ్వనున్నట్టు తెలిపింది. Extremely saddened by the loss of lives due to a mishap in Kurnool district of Andhra Pradesh. My thoughts are with the affected people and their families during this difficult time. Praying for the speedy recovery of the injured.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be…— PMO India (@PMOIndia) October 24, 2025 -
నిర్లక్ష్యంతో బతుకులు బుగ్గి.. కర్నూలులో ఘోర ప్రమాదం (చిత్రాలు)
-
బస్సులో 40 మంది.. ప్రయాణికుల వివరాలు ఇవే..!
-
కర్నూలు ప్రమాదం.. నెల్లూరు రమేష్ కుటుంబ సభ్యులు మృతి
సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం సజీవ దహనమైంది. నెల్లూరుకు చెందిన రమేష్ సహా అతడి భార్య, పిల్లలు చనిపోయారు. దీంతో, వారి బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు.కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో నలుగురు నెల్లూరు జిల్లా వాసులు చనిపోయారు. వారిని వింజమూరు మండలం గోల్లవారిపాలెంకు చెందిన గోళ్ళ రమేష్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. రమేష్ కుటుంబం బెంగళూరులో స్థిరపడింది. వీరంతా హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ (35), అనూష (30), మన్విత (10), మనీశ్ (12) మృతి చెందారు. బంధువులు ఘటనా స్థలికి చేరుకున్నారు.ఇక, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ డీడీ01ఎన్9490 బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి 44పై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. -
కర్నూలు శివారులో ఘోరం..
సాక్షి, కర్నూలు/హైదరాబాద్: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు గురువారం అర్ధరాత్రి దాటాక కర్నూలు శివారులో ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలి బూడిదై పోయింది. ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో మరణాలపై ఏపీ హోమంత్రి అనిత అధికారిక ప్రకటన చేశారు. వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. 27మంది ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. గాయపడ్డ ఆరుగురిలో ముగ్గురికి ప్రాక్చర్లు అయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందో తేల్చేందుకు నాలుగు బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే.. కల్లూరు మండలం చిన్నటేకూరులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన కు సంబంధించి కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ నం. 08518-277305, కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి కంట్రోల్ రూమ్ నం. 9121101059 అలాగే.. ఘటనా స్థలి వద్ద కంట్రోల్ రూమ్ నం. 9121101061, కర్నూలు పోలీస్ ఆఫీసు కంట్రోల్ రూమ్ నం. 9121101075, ఇక.. కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి హెల్ప్ డెస్క్ నంబర్లు 9494609814, 9052951010గా కర్నూలు కలెక్టర్ డా. సిరి తెలిపారు. బాధిత కుటుంబాలు పై నంబర్ లకు ఫోన్ చేసి వివరాలకు సంప్రదించవచ్చని సూచించారు. మృత్యు ప్రయాణం ఇలా..వి కావేరి ట్రావెల్స్ మెయిన్ ఆఫీస్ పటాన్ చెరులో ఉంది. కూకట్ పల్లిలో మరో కార్యాలయం ఉంది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు(డీడీ01ఎన్9490).. రాత్రి 9.30గం. పటాన్చెరు నుంచి ప్రారంభమైంది. బీరంగూడ, గండి మైసమ్మ, బాచుపల్లి ఎక్స్ రోడ్, సూరారం, మియాపూర్, ఆల్విన్ ఎక్స్ రోడ్, వనస్థలిపురం పాయింట్లలో ప్రయాణికులను ఎక్కించుకొని బెంగళూరు వైపు బయల్దేరింది. .. అర్ధరాత్రి 3గం.30ని. ప్రాంతంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టింది. బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌ను అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లడం.. దాని పెట్రోల్ ట్యాంకర్ పేలి మంటలు చెలరేగడంతో మంటలు వ్యాపించాయి. దీంతో.. బస్సును ఆపేసిన డ్రైవర్.. విషయాన్ని హెల్పర్ దృష్టికి తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి వాటర్ బబుల్‌తో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. బస్సు హఠాత్తుగా ఆగడంతో కొందరు ప్రయాణికులకు మెలుకువ వచ్చి ఏం జరుగుతుందా? అని లేచి చూశారు. ఈలోపే.. మంటలు బస్సుకు అంటుకోవడం ప్రారంభించాయి. అది గమనించి డ్రైవర్ పారిపోగా.. హెల్పర్ ప్రయాణికులను అరుస్తూ బయటకు పిలిచాడు. డోర్ తెరిచి లేకపోవడంతో, ఎమర్జెన్సీ ద్వారం కూడా తెరుచుకోకపోవడంతో.. అద్దాలు పగలకొట్టుకుని కొందరు బయటకు దూకేశారు. ఈ క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాఢ నిద్రలోఉన్నవాళ్లు, స్లీపర్ బెర్త్‌లో నిద్రిస్తున్నవాళ్లు.. మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు. నిమిషాల్లో బస్సుకు మంటలు వ్యాపించి అందులోనే సజీవ దహనం అయ్యారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న నవీన్ తన కారులో గాయపడ్డ ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. హైమారెడ్డి అనే మరో మహిళ మంటలు చెలరేగడాన్ని చూసి అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో అందరూ వీడియోలు తీస్తున్నారని వాపోతూ ఆమె తర్వాత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. (Kurnool Travels Bus Fire Accident)డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే..డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని.. బైక్‌ను ఢీ కొట్టినప్పుడే డ్రైవర్ బస్సును ఆపి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ‘‘మంటలు అంటుకోగానే అద్దాలు బద్దలు కొట్టి బయటకు దూకేశాం. అప్పటికే మా సోదరుడి కుటుంబం మంటల్లో చిక్కుకుంది. డ్రైవర్ వాళ్ల రక్షణ వాళ్లు చూసుకున్నారు. ప్రమాణికులను పట్టించుకోలేదు’’ అని గాయపడ్డ ఓ ప్యాసింజర్ వాపోయారు. అలాగే.. ఘటన జరిగిన తర్వాత వాళ్ల రక్షణ చూసుకున్నారే తప్ప.. తమను అప్రమత్తం చేయలేదని, అది జరిగి ఉంటే ప్రయాణికులంతా క్షేమంగా బయటపడేవాళ్లని చికిత్స పొందుతున్న మరో ప్రయాణికుడు తెలిపాడు.మృతుల సంఖ్య పెరగొచ్చు: డీఐజీప్రమాద సమయంలో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారు. గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునే లోపే ఘోరం జరిగిపోయింది. ఘటన నుంచి 23 మంది బయటపడ్డారు. ప్రమాద తీవ్రతను డ్రైవర్ అంచనా వేయలేదు. ఇప్పటిదాకా 11 మృతదేహాలను వెలికి తీశాం. చికిత్స పొందుతున్నవాళ్ల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరగొచ్చు అని డీఐజీ కోయప్రవీణ్ అన్నారు. అలాగే ప్రమాదానికి కారణమైన బైక్ సైతం బస్సు కిందే కాలిన స్థితిలో ఉండిపోగా.. బైకర్ మృతదేహం రోడ్డు పక్కనే పడి ఉంది. అతని పేరు శివ శంకర్‌గా తెలుస్తోంది. కొడుకు మృతితో యశోదమ్మ బోరున విలపిస్తూ కనిపించింది.ట్రావెల్స్ నిర్లక్ష్యం కూడా..ఘటన నేపథ్యంలో.. కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది. బస్సు నిర్మాణంలో ప్రికాషన్స్ లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే బయటపడేలా బస్సులో ఎలాంటి ఏర్పాట్లు లేవని డీఐజీ చెబుతున్నారు. అదే సమయంలో.. ట్రావెల్స్ ఓనర్ పేరు వేమూరి వినోద్ అని, బస్సు ఫిట్నెస్ వాలిడిటీ ఈ ఏడాది మార్చితోనే(31-03-2025) ముగిసిందని, అలాగే.. ఇన్సూరెన్స్ వాలిడిటీ, పొల్యూషన్ కాల పరిమితి కిందటి ఏడాది ఏప్రిల్‌తోనే ముగిశాయని ప్రచారం నడుస్తోంది. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)ప్రయాణికుల జాబితాలో.. 39 మంది, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ప్రయాణికుల్లో చాలామంది హైదరాబాద్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. బస్సులో ఎక్కువగా 20 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు వాళ్లు ఉన్నట్లు లిస్ట్‌ను బట్టి అర్థమవుతోంది. ప్రమాదం నుంచి బయటపడ్డవాళ్లు.. రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం.. మరికొందరు. -
ప్రమాదం ఎలా జరిగిందంటే.. విస్తుపోయే నిజాలు
-
అసలేం జరిగిందంటే? కర్నూల్ SP మాటల్లో..!
-
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన బస్సు.. 40 మంది !
-
ఘోర ప్రమాదం తీవ్రంగా కలచివేస్తోంది: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కర్నూలు ఘోర బస్సు ప్రమాదంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (YS Jagan On Kurnool Bus Accident). ఘటన ఎంతో కలిచి వేసిందని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించిన ఆయన.. వాళ్లకు ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని, అలాగే.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. ‘‘కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనలో పలువురు సజీవ దహనమవడం అత్యంత విషాదకరం. ఈ ఘోర ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి’’ అని ట్వీట్ చేశారు. The news of the tragic bus fire accident near Chinna Tekur village in Kurnool district is deeply distressing. I extend my heartfelt condolences to the families who lost their loved ones. I urge the government to ensure all necessary assistance and medical support to the injured…— YS Jagan Mohan Reddy (@ysjagan) October 24, 2025మరోవైపు.. ఘటనను దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన విచారం వ్యక్తం చేశారని సమాచారం(CM Chandrababu On Kurnool Accident). ఆ వెంటనే సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం అంతా ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి.. మృతుల సంఖ్య పెరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025ఇటు.. కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుములు రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు (CM Revanth Reddy On Kurnool Bus Accident). మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన ఆయన. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే.. ప్యాసింజర్స్ లిస్ట్‌లో అత్యధికం హైదరాబాద్‌కు చెందిన వారే ఉండడం గమనార్హం.కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు.…— Telangana CMO (@TelanganaCMO) October 24, 2025కేటీఆర్ దిగ్భ్రాంతి.. కర్నూలు బస్సు ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. కర్నూల్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.స్థానిక అధికారులు అవసరమైన సహాయక చర్యలు వేగంగా చేపట్టి క్షతగాత్రులకు తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని,ప్రభుత్వo బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరుతున్నాను అని అన్నారు. మంత్రి నారా లోకేష్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురి కావడంపై ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఘటన ఎంతో బాధించిందని.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారాయన. The news of the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district is heartbreaking. I extend my deepest sympathies to the families who have lost loved ones. Wishing speedy recovery to those injured.— Lokesh Nara (@naralokesh) October 24, 2025ఏపీ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్..కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల పరిస్థితిని కర్నూలు జీజీహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. దీంతో.. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు సూచించారు. ‘‘బస్సులోనే ఇంకా భౌతిక కాయాలున్నాయి. పరిస్థితులకనుగుణంగా ఘటనా స్థలం వద్దే భౌతిక కాయాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఫోరెన్సిక్ వైద్యులను ఘటనా స్థలానికి పంపించాం. భౌతిక కాయాల తరలింపునకు మహాప్రస్థానం వాహనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. చనిపోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ నమూనాలు కూడా సేకరిస్తున్నాం. స్వల్పగాయాలతో 12 మంది ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రుల్లో ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. బస్సులో (ఎత్తు) నుంచి దిగడంవల్ల ఒకరికి ఎక్కువ దెబ్బలు తగిలాయి. ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది’’ అని ఆయన అన్నారు. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్తున్న ఓల్వో బస్సు కర్నూల్ వద్ద ప్రమాదానికి గురైందని తెలిసి తీవ్ర ద్రిగ్బాంతి గురి చేసింది. బస్సు ప్రమాద ఘటన పై కర్నూలు జిల్లా అధికారులతో మాట్లాడడం జరిగింది. బస్సు పూర్తిగా దగ్ధం అయినట్టు తెలిసింది.మృతుల కుటుంబాలకు నా ప్రగడ సంతాపాన్ని తెలియజేస్తున్న. వెంటనే క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్న.. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం.. కర్నూలు జిల్లాలో బస్ ఘోర ప్రమాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బస్ దుర్ఘటనలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడం పట్ల ఆయన ఆందోన వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి..ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. మృతుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో పలువురు మరణించడం పట్ల తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.ఇదీ చదవండి: బైక్‌ను ఢీ కొట్టడం వల్లే బస్సు కాలిపోయిందా? -
కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం.. పలువురి సజీవ దహనం
కర్నూలు, సాక్షి: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి సమయంలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది(Kurnool Bus Accident). క్షతగాత్రుల్ని జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు నెంబర్ డీడీ01ఎన్9490 సుమారు 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ వద్దకు చేరుకోగానే ఓ బైక్‌ను ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. డ్రైవర్, హెల్పర్‌తో పాటు పలువురు ప్రయాణికులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. మరికొందరు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. అర్ధరాత్రి 3.30గం. ప్రాంతంలో ఈ ఘోరం చోటు చేసుకుంది. ‘‘బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. బైక్‌ను ఢీ కొటటడంతో మంటలు చెలరేగాయి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్‌ను నిద్ర లేపాడు. చిన్నపాటి ప్రమాదం అనుకుని వాటర్ బబుల్‌తో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ, అంతలోనే మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులను నిద్ర లేపాడు. ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టి మరికొందరు బయటపడ్డారు. గాయపడ్డవాళ్లు కర్నూలు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. ఎంత మంది చనిపోయారన్నది ఇప్పుడే చెప్పలేం’’ అని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉండగా.. స్పేర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


