పోరాడుతున్న శ్రీలంక
రెండో ఇన్నింగ్స్లో 309/5 ఇంగ్లండ్తో రెండో టెస్టు
చెస్టర్ లీ స్ట్రీట్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక పోరాడుతోంది. మాథ్యూస్ (105 బంతుల్లో 80; 9 ఫోర్లు; 1 సిక్స్), కుశాల్ సిల్వ (145 బంతుల్లో 60; 6 ఫోర్లు), చండిమాల్ (98 బంతుల్లో 54 బ్యాటింగ్; 5 ఫోర్లు), అర్ధ సెంచరీలు చేశారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి లంక రెండో ఇన్నింగ్స్లో 84 ఓవర్లలో ఐదు వికెట్లకు 309 పరుగులు చేసింది.
లంక ఇంకా 88 పరుగులు వెనకబడి ఉంది. సిరివర్ధన (35 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు తమ తొలి ఇన్నింగ్స్లో లంక 43.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది.