జయకు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం
బెంగళూరు: ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించే కావేరి సమస్యను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని బహుభాష నాటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ ఆరోపించారు. బృహత్ బెంగళూరు మహానగర పాలికే ఎన్నికల ప్రచారం పాల్గొనడానికి బెంగళూరు వచ్చిన ఆమె స్థానిక కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
తమిళనాడుతోపాటు కర్ణాటక ప్రజల తాగు, సాగునీటికి ప్రధానమైన కావేరి జలాల పంపకానికి సంబంధించిన సమస్యను పరిష్కరించడంపై జయలిత ముందుకు రావడం లేదన్నారు. పైగా సామరస్య వాతావరణంలో పరిష్కరించుకోవాల్సిన ఈ సమస్యను రాజకీయ ప్రయోజనాలు ఆశించే కోర్టు వరకూ జయలలిత తీసుకుపోతున్నారని ఆరోపించారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఈ విషయమై చొరవ చూపి సమస్యను సత్వరం పరిష్కరించాలని కుష్బూ కోరారు.