
కాంగ్రెస్‌లో చేరిన నటి కుష్బూ
న్యూఢిల్లీ: ప్రముఖ నటి, డీఎంకే మాజీ నాయకురాలు కుష్బూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో ఆమెతో సమావేశమైన కుష్బూ అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్‌లో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘గతంలో వేరే పార్టీలో ఉన్నా, ఏదో అసౌకర్యానికి గురయ్యాను. ఇప్పుడు సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తోంది’ అని వ్యాఖ్యానించారు.