కువైట్‌లో ఘోర అవమానం: ప్రముఖ సింగర్
కువైట్: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పర దేశంలో తన సిబ్బందికి అవమానం జరిగినందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ట్విటర్ ద్వారా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఒక కార్యక్రమం కోసం కువైట్‌కు వెళ్లిన అద్నాన్ సమీ బృందంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది దుర్భాషలాడారు. దీనిపై కువైట్‌లోని ఇండియన్ ఎంబబీ కార్యాలయానికి ఫిర్యాదు చేసినా ఏ చర్యలు చేపట్టలేదని అద్నాన్ సమీ వాపోయారు. ఇలా అనడానికి ఎంత ధైర్యం అంటూ మండిపడ్డారు. అద్నాన్ ట్వీట్‌కు సుష్మా స్వరాజ్ స్పందిస్తూ.. ఈ విషయంపై మీరు నాతో ఫోన్లో మాట్లాడండి అంటూ ట్వీట్ చేశారు.
వెంటనే స్పందించినందుకు సుష్మాకు అద్నాన్ ధన్యవాదాలు తెలిపారు. దీనికి ప్రతిస్పందనగా... సింగర్ అద్నాన్ బదులిస్తూ.. ‘మాపై చూపిన ప్రేమకు ధన్యవాదాలు. సుష్మా స్వరాజ్ లాంటి వారు విదేశాంగ మంత్రిగా ఉంటే.. మాలాంటి వాళ్లు ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఆమె రక్షిస్తూనే ఉంటారు. ఆమెను చూస్తే నాకు గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయంపై సుష్మా స్వరాజ్ వెంటనే చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
Thank you so much for your concern my dear. @SushmaSwaraj is a lady full of heart & she is in touch with me & is looking after our people.. I’m so proud that she is our foreign minister & looks after us all over the world. https://t.co/2KjCIyRG6f
— Adnan Sami (@AdnanSamiLive) May 6, 2018