'బాధితులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తాం'
పూసపాటిరేగ (విజయనగరం) : తుపాను బాధితులకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. సోమవారం మండలంలోని తిప్పలవలస గ్రామంలో 600 మంది తుపాను బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు సహకారంతో ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, చీర, జాకెట్లను పంపిణీ చేశారు.
బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూపు తరఫున సహకారం అందిస్తున్న వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ సురేష్‌బాబు, చిత్రంలో ఆ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు తదితరులు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తిప్పలవలసలో పర్యటించి తుపాను బాధితులను ఆదుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు సహాయం అందించామన్నారు. బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నాఫెడ్ డెరైక్టర్ కేవీ సూర్యనారాయణరాజు మాట్లాడుతూ నష్టపోయిన బాధితులందరిని ఆదుకుని వారు స్థిమితపడే వరకూ అండగా నిలవాన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి పి. సురేష్‌బాబు, పార్టీ నాయకులు పతివాడ అప్పలనాయుడు, డీసీసీబీ డెరైక్టరు బర్రి చిన అప్పన్న, మహంతి లక్ష్మణరావు, మలుకుర్తి శ్రీనివాసరావు, గుజ్జు సురేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.