తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షునిగా పాలమూరు బిడ్డ
పాలమూరు యూనివర్సిటీ: తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షునిగా పీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.వెంకటాచ లంను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయన నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తంచేశారు. కె.వెంకటాచలం జిల్లాలోని అలంపూర్ తాలుకా మానవపాడు మండ లం జెల్లాపురం గ్రామంలో కె.వెంకటసుబ్బన్న, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు.
గతంలో ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఏపీ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా 1990 నుంచి 1994వరకు పనిచేశారు. 1994లో యూటీసీ యంగ్ సైంటిస్ట్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే చీఫ్‌వార్డెన్‌గా 2005 నుంచి 2007 వరకు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా 2003 నుంచి 2006 వరకు కొనసాగారు.
అపార అనుభవం ఉన్న ఆయన 2008లో పాలమూరు యూనివరిట్సీ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి నేడు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం పట్ల పలువురు జిల్లా ప్రముఖులు హర్షం వ్యక్తంచేశారు. తెలంగాణ ఉన్నతవిద్యామండలికి ఉపాధ్యక్షునిగా నియమితులు కావడం వల్ల భవిష్యత్‌లో పాలమూరు యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడతారని పీయూ విద్యార్థులు సంతోషం వ్యక్తంచేశారు. కె.వెంకటాచలం అత్యున్నత బాధ్యతలు స్వీకరించడం పట్ల పీయూ ప్రిన్సిపాల్ పిండి పవన్‌కుమార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డి.మధుసూదన్‌రెడ్డి, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.