‘క్విస్’లో ఫార్మా కంపెనీ ప్రాంగణ ఎంపికలు
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్ : క్విస్ ఫార్మసీ కళాశాలలో గురువారం హైదరాబాద్‌కు చెందిన దివీస్ ఫార్మా కంపెనీ ప్రతి నిధులు ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో పాల్గొన్న విద్యార్థులకు టెక్నికల్, హెచ్ఆర్ రౌండ్లను నిర్వహించారు. 12 మంది విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు కె.హరికృష్ణ, సీహెచ్ కొండయ్య, కళాశాల కరస్పాండెంట్ నిడమానూరి సూర్యకల్యాణ చక్రవర్తి, కళాశాల అధ్యక్షుడు నిడమానూరి నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ దక్షిణామూర్తి, ప్లేస్మెంట్ అధికారి సీహెచ్‌ఎంఎం ప్రసాదరావు పాల్గొని ఎంపికైన విద్యార్థులను అభినందించారు.