ఆహార భద్రతపై శరద్ పవార్ హెచ్చరికలు
న్యూఢిల్లీ: ఆహార భద్రత బిల్లుపై శరద్ పవార్ మంగళవారం హెచ్చరికలు జారీ చేశారు. దేశీయంగా ఆహార ఉత్పత్తులను పెంచుకోకపోతే పథకాన్ని నడపలేమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతోమాట్లాడిన ఆయన కేంద్ర వైఖరిపై విమర్శలు గుప్పించారు. ఎక్కడ నుంచో దిగుమతులు చేసుకుంటే పథకాన్ని ఎలా నడుపుతామని ఆయన మండిపడ్డారు. దిగుమతులు ఆధారంగా పథకాన్ని నడపలేమని తెలిపారు.
సహాయమంత్రి కె.వి.థామస్ మాట్లాడుతూ.. ఆహార ధాన్యాలను నడపడం కష్టమైన పని అని పేర్కొన్నారు. నిజమైన లబ్ధిదారులను ఎంపికపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అసలైన లబ్ధిదారులను ఎంపిక చేస్తే భద్రత పథకానికి మేలు చేకూరుతుందని హితవు పలికారు.