kyant cyclone
-
బలహీనపడిన తుపాను
విశాఖపట్టణం: క్యాంట్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 220 కిలో మీటర్ల దూరంలో, విశాఖపట్టణానికి దక్షిణ నైరుతి దిశగా 260కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం మధ్యాహ్నానికి వాయుగుండం అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పింది. దీని ప్రభావంగా కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు క్యాంట్ ప్రభావంతో కోస్తా జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. విశాఖపట్టణం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా వర్షం కుంభవృష్టిగా కురిసింది. ప్రస్తుతం విశాఖపట్టణంలో ఆకాశం మేఘావృతమై ఉంది. శ్రీకాకుళం జిల్లాలోనూ అక్కడక్కడా తుపాను ప్రభావంగా చిరుజల్లులు కురిశాయి. దీంతో జిల్లాలో చలి తీవ్రత బాగా పెరిగింది. శనివారం విశాఖపట్టణం వేదికగా భారత్-కివీస్ జట్ల మధ్య సిరీస్ లో ఆఖరి వన్డే మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. తుపాను హెచ్చరికలతో చివరి మ్యాచ్ కు ఆటకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో సిరీస్ ఫలితం తేల్చే రేపటి మ్యాచ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
బలహీనపడిన తుపాను
-
దీపావళి రోజు తీరం దాటనున్న 'క్యాంట్'!
విశాఖ: బంగాళాఖాతంలో ఏర్పడ్డ క్యాంట్ తుపాను దీపావళి రోజున తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు దిశగా కదులుతున్న ఈ తుపాను...చెన్నై- మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను విశాఖకు తూర్పు ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, పశ్చిమ బంగాళాఖలంలోకి రేపు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి ఉత్తర దిశగా గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు క్యాంట్ తుపానుపై విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ బుధవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 11 తీరప్రాంత మండలాలను అప్రమత్తం చేశామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. కలెక్టరేట్లో 180042500009 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందం విశాఖ చేరుకుందని, అలాగే 20 బోట్లు, రెస్క్యూ టీమ్‌లు ఏర్పాటు చేయాలని నేవీని కోరినట్లు చెప్పారు. పారాదీప్ వద్ద చిక్కుకున్న 60-70 బోట్లకు అక్కడే లంగర్ వేసే అవకాశం కల్పించాలని, పారదీప్ అధికారులను కోరుతున్నామన్నారు. అలాగే తుపాను దృష్ట్యా అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. -
ఏపీకి పొంచి ఉన్న ‘క్యాంట్’ ముప్పు
విశాఖపట్నం: నడిసంద్రంలో ఇంతవరకూ ఊగిసలాడిన క్యాంట్ తుపాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైపే దూసుకొస్తోంది. తొలుత పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల వైపు వెళ్తుందనుకున్న ఈ తుపాను చివరకు దిశ మార్చుకుంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం మధ్యాహ్నానికి తుపానుగా బలపడింది. ఇది ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 600, విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 705, మచిలీపట్నానికి తూర్పు ఈశాన్య దిశలో వెయ్యి కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్యాంట్‌గా నామకరణం చేసిన ఈ తుపాను గంటకు 9 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా పయనిస్తోంది. ఇది బుధవారం నాటికి ఒకింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. రాగల 36 గంటల్లో తుపాను మరింత బలపడనుంది. పశ్చిమ దిశగా పయనిస్తూ రేపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రేపటి నుంచి ఏపీ, ఒడిశాలో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించనుంది. 28, 29 తేదీల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఈ నెల 27 నుంచి కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అలాగే మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. కాగా తుపానుకు ‘క్యాంట్’ అనే పేరును మయన్మార్ సూచించింది. -
ఏపీని భయపెడుతున్న క్యాంట్ తుఫాను !