జట్టులోకి ఆ ఇద్దరు క్రికెటర్లు!
స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇప్పటికే వెనుకబడిన వెస్టిండీస్ జట్టు ప్రయోగాలకు సిద్ధమవుతోంది. భారత్‌తో జరిగే మిగతా మూడు వన్డేల కోసం ఇద్దరు యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. భారత్‌తో వన్డే సిరీస్‌లో ఆడేందుకు కైల్ హోప్, సునీల్ అంబ్రిస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు నుంచి పిలుపు వచ్చింది.
భారత్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు ఇప్పటికే 1-0తో వెనుకబడిన సంగతి తెలిసిందే. శుక్రవారం భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మిగతా మూడు వన్డేల కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు 13మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ప్రస్తుత జట్టులోని జోనాథన్ కార్టర్, కెస్రిక్ విలియమ్స్‌పై వేటువేసి.. వారి స్థానంలో యువ ఆటగాళ్లు కైల్ హోప్, సునీల్ అంబ్రిస్‌కు అవకాశం కల్పించింది. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించిన ప్రకారం ఆ జట్టు ఈ విధంగా ఉండనుంది.
జాసన్ హొల్దర్ (కెప్టెన్), సునీల్ అంబ్రిస్, దేవేంద్ర బిషూ, రోస్టన్ చేజ్, మిగ్యుఎల్ కుమ్మినస్, కైల్ హోప్, షాయ్ హోప్, అల్జార్రి జోసెఫ్, ఎవిన్ లూయిస్, జాసన్ మొహమ్మద్, ఆష్లీ నర్స్, కీరన్ పావెల్, రోవ్‌మన్ పావెల్