ఎన్టీఆర్ మనసు మార్చుకున్నాడు..?
జనతా గ్యారేజ్ సక్సెస్ తరువాత నెక్ట్స్ సినిమా ఎంపిక కోసం చాలా రోజుల పాటు ఎదురుచూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫైనల్గా కొత్త సినిమాను ఎనౌన్స్ చేశాడు. కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ను తీసుకోవాలని భావించారు. అయితే తాజాగా సమాచారం ప్రకారం అనిరుద్ కన్నా దేవీ శ్రీ ప్రసాద్ అయితేనే బెటర్ అని భావిస్తున్నారట. అనిరుద్ వర్క్ విషయంలో కాస్త స్లోగా ఉండటం అందులోనూ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో అనిరుద్ను పక్కన పెట్టి దేవీని తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ముగ్గురు ముద్దుగుమ్మలు అలరించనున్నారు. కాజల్ అగర్వాల్ తో పాటు నివేదా థామస్, అనుపమా పరమేశ్వరన్ లను హీరోయిన్లుగా తీసుకోవాలని భావిస్తున్నారు.