labour pains
-
పరీక్ష కేంద్రంలో పురిటినొప్పులు
డుంబ్రిగుడ: పదో తరగతి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థిని ప్రసవ వేదనతో ఆస్పత్రిలో చేరి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన సంచలనం సృష్టించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా వున్నాయి. గుంటగన్నెల పంచాయతీ జాముగుడ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పదో తరగతి చదువుతోంది. ఈమె ఆరోగ్యం బాగులేకపోవడంతో కొద్దిరోజుల క్రితం కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. టెన్త్ పరీక్షలు రాసేందుకు ఆమెను ఈనెల 27న మండల కేంద్రం డుంబ్రిగుడలోని పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చారు. ఆమెకు పురిటినొప్పులు రావడంతో పరీక్ష కేంద్రం నుంచి హుటాహుటిన కుటుంబ సభ్యులు అరకులోయ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ప్రసవించిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన తెలుసుకున్న అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్, ఎంఈవో భారతరత్నం గురువారం కస్తూర్బా విద్యాలయాన్ని సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన విద్యార్థిని గర్భం దాల్చి ప్రసవించడంపై ప్రత్యేకాధికారి జ్యోతి, వసతిగృహ నిర్వాహకురాలు (టీచర్) అప్పలమ్మకు అధికారులు చార్జి మెమో జారీ చేశారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి వివరాలతో పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణకు నివేదిక అందజేస్తామని ఎంఈవో భారతరత్నం తెలిపారు. (చదవండి: దారిలోనే పసివాడిన బతుకు) -
టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది
బ్రిటన్: ఈ మధ్యకాలంలో టాయిలెట్లోనూ, బస్‌స్టేషన్‌లోనూ, ప్రభుత్వ ఆస్పత్రిలోని బాత్రూంలోనూ అనుకోకుండా ప్రసవం జరగడం గురుంచి మనం వినే ఉంటాం కదా. అచ్చం అలాంటి సంఘటన యూకేలో జరిగింది. యూకేకి చెందిన కైట్లిన్ ఫుల్లెర్టన్, సెర్గియో అనే దంపతులు కారులో సరదాగా బయటకు వెళ్లారు. అనోకోకుండా కైట్లిన్కి టాయిలెట్ రావడంతో సమీపంలో ఎలాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌లోని బాత్రూంలోకి వెళ్లింది. (చదవండి: "థింక్ బి ఫోర్ యూ డయల్") అనుకోకుండా ఆమెకు నొప్పులు మొదలై కేవలం 10 నిమిషాల్లోనే ప్రసవం అయిపోయింది. అంతేకాదు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఏం చేయాలో తోచదు. అక్కడే ఉన్న కొంత మంది మహిళల సాయంతో విషయం తన భర్తకు తెలియజేయడంతో వెంటనే కైట్లిన్ భర్త సెర్గియో వస్తాడు. ఆ తర్వాత ఆమె భర్త సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తాడు. తల్లి బిడ్డలు సురక్షింతంగానే ఉన్నారని వైద్యులు చెబుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అనుకోకుండా ఇలా జరిగితే ఎవరికైన భయంగానూ, ఆశ్యర్యంగానూ అనిపిస్తుంది కదా. (చదవండి: "అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్ అయ్యాడు!") -
పురిటి నొప్పులతో పది కిలోమీటర్లు నడిచి..
► మార్గమధ్యలో తానే పురుడు పోసుకున్న గిరిజన మహిళ ► వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో బిడ్డ నుంచి పేగును వేరు చేసిన వైనం మారేడుమిల్లి నెలలు నిండిన గర్భిణులను సుఖ ప్రసవానికి ఆసుపత్రికి తరలించేందుకు కనీస చర్యలు తీసుకోకపోతుండటంతో తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతంలో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం మారేడుమిల్లి మండలం లోతట్టు ప్రాంతమైన కింటుకూరు గ్రామానికి చెందిన పాలించి లక్ష్మి నెలలు నిండటంతో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంపచోడవరం ఆసుపత్రికి వచ్చేందుకు భర్తతో బయలుదేరింది. ఇంతలో పురిటి నొప్పులు రావడంతో ఆ బాధ భరిస్తూనే కొండ ఎక్కి పది కిలోమీటర్లు నడుస్తూ వచ్చింది. దాహంగా ఉందంటూ భర్తను కాలువ నుంచి నీరు తేవాలని చెప్పింది. ఈలోపు నొప్పులు అధికమవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో బిడ్డ నుంచి పేగును వేరుచేసి పురుడు పోసుకుని ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ పరిస్థితి గమనించిన ఓ యువకుడు మొబైల్ నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి వెళ్లి 108కి సమాచారం ఇచ్చాడు. గంట తరువాత వాహనంలో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఆమెను తరలించారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.