జిల్లాకు లక్షకోట్ల ప్యాకేజీ కేటాయించాలి
– బీసీ కులాల ఐక్యవేదిక
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండుయాదవ్
ధన్వాడ : వలస జిల్లాగా పేరుగాంచిన పాలమూరు జిల్లాకు ప్రభుత్వం లక్షకోట్ల ప్యాకేజీని కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాండుయాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లో వెనకబడిన బీసీల అభివద్ధికి ప్రభుత్వం రూ. 25వేల కోట్ల ప్యాకేజీని అమలు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. బీసీలకు చట్టసభలో కూడా రిజర్వేషన్ కల్పించకుండా అగ్రకులాల వారు కుట్రకు దిగుతున్నారని మండిపడ్డారు. గ్రామస్థాయి నుంచి బీసీలు బలోపేతం అయినప్పుడే సామాజిక అధికారం బీసీలకు దక్కుతుందన్నారు. మనలో చైతన్యం రావడం కోసమే గ్రామ గ్రామాన బీసీ చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నమని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా గౌవర అధ్యక్షుడు ఆచారి, జిల్లా కార్యదర్శి కష్ణయ్య, వెంకటేష్, రాజ్యాదవ్, ఉదయబాను తదితరులు పాల్గొన్నారు.