Lack of infrastructure
-
టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మహిళలు
న్యూఢిల్లీ: మెట్రో నగరాలతో పోలిస్తే మెట్రోయేతర నగరాల్లోని మహిళలు ఎక్కువగా టెక్నాలజీ వ్యాపారవేత్తలుగా మారడంపై ఆసక్తిగా ఉన్నారు. అయితే, సాంకేతిక వనరులు, మౌలిక సదుపాయాల కొరత, దిశానిర్దేశం చేసే మెంటార్లు దొరక్కపోవడం వారికి ప్రధాన అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ అనలిటిక్స్ సంస్థ టెక్ఆర్క్, మహిళల ప్లాట్‌ఫామ్ షీట్‌వర్క్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయాయి. దీని ప్రకారం నాన్–మెట్రో నగరాల్లోని మహిళల్లో దాదాపు 48 శాతం మంది .. తమ కెరియర్ ఆప్షన్‌గా టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఎంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నారు. మెట్రో నగరాల్లో తమ సొంత వెంచర్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారి సంఖ్య 23 శాతం మాత్రమే ఉంది. మెట్రో నగరాల్లోని మహిళలు.. సౌకర్యవంతమైన కెరియర్ కోసం ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. ‘భారత్‌లో మహిళా టెక్ ఎంట్రప్రెన్యూర్షిప్ స్థితిగతులు‘ అనే అంశంపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో 2,000 మంది పైచిలుకు పాల్గొన్నారు. వీరిలో ప్రొఫెషనల్స్, విద్యార్థులు, స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఐఐటీల్లో పెరిగిన విద్యార్థినులు.. ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ విద్యా సంస్థల్లో విద్యార్థినుల సంఖ్య గడిచిన నాలుగేళ్లలో గణనీయంగా పెరిగింది. అప్పట్లో ఇది కేవలం 5 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 16 శాతానికి చేరింది. కానీ వీరంతా సొంతంగా టెక్ కంపెనీలను ప్రారంభించే దిశగా వెళ్లడం లేదు. ‘మెట్రోయేతర నగరాల్లోని 73 శాతం మంది మహిళలు .. అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్లే .. తాము ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ను ఎంచుకోలేకపోతున్నామని తెలిపారు. మెట్రోల్లో 22 శాతం మంది మహిళలు భౌతిక ఇన్ఫ్రా కొరత తమకు సమస్యగా ఉంటోందని పేర్కొన్నారు‘ అని నివేదిక వెల్లడించింది. ఇక పురుషులతో పోలిస్తే నిధులు సమీకరించడం, పెట్టుబడులను సమకూర్చుకోవడం కష్టతరంగా ఉంటోందని సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది చెప్పారు. ‘విద్యావంతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ సంబంధిత వ్యాపార, సాంకేతిక వనరులు పరిమిత స్థాయిలోనే ఉండటమనేది వారి వెంచర్లను విస్తరించడంలో అవరోధంగా ఉంటోంది. టెక్నాలజీ కొరత ప్రధాన సవాలుగా ఉంటోందని మెట్రోయేతర నగరాల్లోని 74 శాతం మంది తెలిపారు. మహిళా వ్యాపారవేత్తలు తమ వెంచర్లలో విజయం సాధించాలంటే టెక్నాలజీ అందుబాటులో ఉండటం చాలా ముఖ్యమని మెట్రో నగరాల్లో 24 శాతం మంది చెప్పారు‘ అని నివేదిక పేర్కొంది. -
చెట్ల కింద చదువులు
సాక్షి,డీ.హీరేహాళ్: కార్పొరేట్ పాఠశాల్లో చదువు చెప్పించే స్థోమత లేని చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల్లో కనీస వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. అన్నీ సమస్యలే మండలంలోని పూలకుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 10 వతరగతి వరకు 228 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారు. వీరికి ఒక్కో తరగతికి ఒక్కో తరగతి గది ఉండాలి కానీ కేవలం మూడు గదులు మాత్రమే ఉండడంతో చెట్ల కింద, వరండాలో చదువులు చెప్పిస్తున్నారు. 8 గదులకు గాను 3 గదులు ఉండడంతో వారి చదువులు చెట్ల కిందనే కొనసాగుతున్నాయి. విద్యార్థులకు అనుగుణంగా పది మంది ఉపాద్యాయులు ఉండాల్సిన చోట ఆరుమంది మాత్రమే ఉన్నారు. పాఠశాల మైదానం కూడా గుంతలమయం కావడంతో ఆటలు ఆడుకోవాడానికి ఇబ్బంది పడుతున్నారు. అలాగే పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంటగది లేకపోవడంతో పాఠశాల పక్కనే తడికేలతో ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక షెడ్డులోనే వంట చేస్తున్నారు. దీంతో విద్యార్థులకు పొగ బాధ తప్పడం లేదు. విద్యుత్ ఉన్నప్పుడే నీరు అరకోరగానే వస్తాయి. విద్యుత్ లేకపోతే విద్యార్థులు నీటి కోసం పొలాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. మరుగు దొడ్లులు కూడా మూడు యూనిట్లు ఉండాల్సి ఉన్నా ఒకే మరుగు దోడ్డి ఉండడంతో బాలికలు, మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. గదుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి కాలవ శ్రీనివాసులుకు అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా నేటికీ గదుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. -
అధ్యక్షా... ఇదీ మా గోడు
మౌలిక వసతుల కొరతతో ఇబ్బందులు పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం భయపెడుతున్న కోతులు, కుక్కలు మితిమీరుతున్న సిబ్బంది అవినీతి నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం వరంగల్ అర్బన్ : వరంగల్ నగర ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. సత్వర సేవలు అందడం లేదు. విలీన గ్రామాలను పూర్తిగా విస్మరించారు. సిటిజన్ చార్టర్ అమలు కావడం లేదు. రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీటి సమస్యలపై ప్రతివారం ప్రజలు గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదులు అందజేస్తున్నారు. కోతులు, కుక్కలు ప్రజలను భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ›పలు సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్. మహా నగరంలో చాలా కాలనీల్లో కనీస మౌలిక వసతుల్లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 30 శాతం కాలనీల్లో ఇంకా డ్రెయినేజీలు లేవు. అంతర్గత డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నల్లా నీళ్లు కచ్చితంగా వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది. రెండో రోజులకోమారు సరఫరా అంటున్నారు. వాస్తవంగా పరిశీలిస్తే ఇది అమలు కావడం లేదు. పారిశుద్ధ్యం అ««ధ్వానం మహా నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇంటింటా చెత్త సేకరణ, మురుగు కాలువల పుడికతీత నామామాత్రంగానే సాగుతోంది. ప్రధాన రహదారులను ఊడ్చుతూ సరిపెడుతున్నారు. పారిశుద్ధ్య విభాగం సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ కొరవడింది. దోమల పెరిగిపోయాయి. దోమల నివారణకు ఏటా రూ.50 నుంచి 60 లక్షల సొమ్ము ఖర్చువుతోంది. కానీ దోమల బారి నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నారు. కోతులు, కుక్కలతో పారేషాన్... కోతులు, కుక్కలు ప్రజలను ముప్పుతిప్పలుపెడుతున్నారు. కోతులు ఇళ్లల్లోకి చొరబడి భీభత్సం సృష్టిస్తున్నాయి. వీటి నుంచి కాపాడే నాథుడే కరువయ్యారు. కుక్కలు గుంపులు గుంపులు వెంబడించి గాయాల పాలు చేస్తున్నాయి. కుక్కల ఆపరేషన్ల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం కానరావడం లేదు. రహదారులతో నడుము హూనమే.... మహా నగరంలోని ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. పెద్ద గుంతలతో ప్రజలు పారేషన్ అవుతున్నారు. వాహనాలు దెబ్బతినడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. జాతీయ రహదారుల శాఖ, ఆర్అండ్బీ, గ్రేటర్ వరంగల్ శాఖల అధికారులు రోడ్ల మరమ్మతుల్లో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కదలని ఫైళ్లు, మితిమీరిన అవినీతి ఈ–ఆఫీస్ ద్వారా ఫైళ్లు కదలడం లేదు. ఏ పని కావాలన్నా చేయి తడపాల్సి వస్తోందని ఫిర్యాదుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైసలు ఇస్తేనే సకాలంలో పనులు అవుతున్నాయి. లేదంటే కోర్రిల పేరుతో నెలనెల తరబడి తిప్పుకుంటున్నారు. పన్నుల విభాగం, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, ప్రజారోగ్యం విభాగాల్లో అవినీతి మితిమీరిపోయింది. -
సర్కార్ ఆస్పత్రికి జబ్బు చేసింది...
ఆస్పత్రిలో ఒక్క పడక మీద ఇద్దరు, ముగ్గురు రోగులు సర్దుకోవాలి. అప్పుడే అక్కడ వైద్యం అందుతుంది. లేదంటే కటిక నేలే గతి. విజయనగరం జిల్లా పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలోపరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా... పాలకులు పట్టించుకోకపోవడంతో రోగులు అవస్థలపాలవుతున్నారు. ఈ ఆస్పత్రిలో కేవలం 100 పడకలే ఉండగా... ఆదివారం అర్ధరాత్రి సమయానికి 239 మంది ఇన్ పేషెంట్లుగా నమోదయ్యారు. సోమవారం ఉదయం మరో 38 మంది రోగులు ఇన్ పేషెంట్లుగా వచ్చారు. దీంతో ఇంత మందిని ఎక్కడ సర్దుబాటు చేయాలో సిబ్బందికి పాలుపోవడం లేదు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు, ముగ్గురితోపాటు కొందరిని నేలపై ఉంచి వైద్యం అందిస్తున్నారు. మరో వైపు సిబ్బంది కొరత అధికారులను పీడిస్తోంది. పరిమితంగా ఉన్న సిబ్బంది అంతమంది రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించలేకపోతున్నారు. దీంతో రోగులకు నరకం కనిపిస్తోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఒడిశాలోని సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ ఏరియా ఆస్పత్రిలో కేవలం 100 పడకలే ఉండటం దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఆస్పత్రిని 200 పడకల సామర్థ్యానికి పెంచుతామని ప్రభుత్వం ఎప్పటికప్పుడు హామీలు ఇస్తున్నా.. కార్యరూపం దాల్చడం లేదు.